పెళ్లి వద్దు కానీ.. అదైతే కానిద్దాం.. శృతిహాసన్
కమల్ హాసన్ కూతురు, స్టార్ హీరోయిన్ శృతిహాసన్ కొద్ది రోజులు పీకల్లోతు ప్రేమలో మునిగితేలిన సంగతి తెలిసిందే. సినిమాలు కూడా పక్కన పెట్టేసి ప్రియుడితో చెట్టాపట్టాలేసుకు తిరిగింది శృతి. ఇంగ్లండ్‌కి చెందిన సింగర్ మైకేల్ కోర్సలేతో డేటింగ్ చేసిన ఆమె.. అతన్ని ఇండియా తీసుకొచ్చి తన తల్లి దండ్రులకు కూడా పరిచయం చేసింది. కానీ ఉన్నట్టుండి ఊహించని రీతిలో అందరికీ షాకిస్తూ తన ప్రియుడు మైకేల్‌కి బ్రేకప్ చెప్పేసింది శృతి హాసన్.
ప్రియుడు మైకేల్‌తో కట్ చేసుకున్న శృతి హాసన్.. తిరిగి సినిమాలపై శ్రద్ద పెడుతోంది. ఈ నేపథ్యంలో ఆమె రెండు ప్రాజెక్టులకు సంతకాలు చేసి ఆ సినిమా షూటింగుల్లో పాల్గొంటోంది. అయితే తాజాగా ట్విట్టర్ లో అభిమానులతో కాసేపు ముచ్చటించిన ఆమెను పెళ్లి గురించిన ప్రశ్నలు వెంటాడాయి. ట్విట్టర్ చాట్ లో భాగంగా.. 'శృతి గారు మీరు పెళ్లెప్పుడు చేసుకుంటారు? అభిమానులందరం మీ పెళ్లికి వస్తాం. మమ్మల్ని ప్రత్యేకంగా మీ పెళ్లికి ఆహ్వానించండి' అని ఓ వ్యక్తి ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్ పై స్పందించిన శృతిహాసన్.. ''పెళ్లి కోసం అయితే మీరు చాలా కాలం వెయిట్ చేయక తప్పదు. మనందరం జన్మదినోత్సవాన్ని కలిసి జరుపుకుందాం.. మీరంతా వచ్చేయండి'' అని ఆసక్తికర సమాధానం చెప్పింది.

బ్రేకప్ తర్వాత పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకోబోతోందంటూ శృతిపై రకరకాల వార్తలు వచ్చాయి. తాజాగా జరిగిన ఈ ట్విట్టర్ చాట్ లో పనిలో పనిగా వాటన్నింటికీ ఫుల్‌స్టాప్ పెడుతూ పెళ్లిపై క్లారిటీ ఇచ్చేసింది శృతిహాసన్. ప్రస్తుతం ప్రేమ సంగతులను పక్కన పెట్టేసిన ఈ యంగ్ హీరోయిన్ ఇకపై సినిమాలకే పూర్తి సమయం కేటాయిస్తానని అంటోంది. చూడాలి మరి శృతికి ముందు ముందు ఎలాంటి అవకాశాలు దక్కుతాయో!


Click it and Unblock the Notifications











