Don't Miss!
- Finance
Budget 2023: కీలకంగా డిఫెన్స్ బడ్జెట్.. పాక్, చైనాలకు ధీటుగా భారత్ ఉందా..?
- Lifestyle
Chanakya Niti: ఇలాంటి వ్యక్తులను మాత్రమే లక్ష్మీదేవి కటాక్షిస్తుంది, వాళ్లే సంపద సృష్టిస్తారు
- News
స్టాలిన్ సినిమాలో చిరంజీవి చెప్పినట్టే.. యూజీసీ కొత్త నిబంధన; ఇకపై విద్యార్థులకు అది తప్పనిసరి!!
- Technology
Samsung కొత్త ఫోన్ లాంచ్ త్వరలోనే! అందుకే ఈ ఫోన్ ధర రూ.10000 తగ్గింది!
- Sports
INDvsAUS : ఆశ్రమాల చుట్టూ తిరుగుతున్న కోహ్లీ.. ఆసీస్ సిరీస్ ముందు కూడా!
- Automobiles
XUV400 EV బుకింగ్స్‌లో దుమ్మురేపుతున్న మహీంద్రా.. ఇప్పటికే వచ్చిన బుకింగ్స్ ఎన్నంటే?
- Travel
సందర్శనీయ ప్రదేశాలు.. ఆంధ్రప్రదేశ్‌లోని ఈ సరస్సులు!
Waltair Veerayya, వీరసింహారెడ్డికి ముఖం చాటేసిన శృతిహాసన్.. ప్రియుడితో ముంబై వీధుల్లో రొమాంటిక్‌గా!
అందాల భామ శృతిహాసన్ కెరీర్‌పరంగా టాప్ రేంజ్‌లో దూసుకెళ్తున్నది. అగ్ర హీరోలతో భారీ ప్రాజెక్టులతో బిజీగా మారిపోయింది. ఇటీవల కాలంలో టాప్ హీరోలందరితీ జతకడుతూ అభిమానులను ఆలరిస్తున్నది. తాజా సంక్రాంతి పండుగలో శృతిహాసన్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. అయితే ఇటీవల సినిమా ప్రమోషన్లకు దూరంగా ఉంటూ.. తన ప్రియుడితో ముంబైలో చక్కర్లు కొట్టడం వివాదాస్పదంగా మారింది. శృతిహాసన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ వివరాల్లోకి వెళితే..

సంక్రాంతి బరిలో చిరంజీవి, బాలకృష్ణతో
క్రాక్ హిట్టు తర్వాత శృతిహసన్ కెరీర్ మరో రేంజ్‌కు చేరుకొన్నది. ఏకంగా ప్రభాస్‌తో సలార్ చేజిక్కించుకొన్నది. ప్రస్తుతం బాలకృష్ణతో వీరసింహారెడ్డి, చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమాల్లో నటించిన శృతిహాసన్ ప్రత్యేక ఆకర్షణగా మారింది. సంక్రాంతి బరిలో దూకిన రెండు సినిమాలతో టాలీవుడ్‌కు బ్లాక్ బస్టర్ చిత్రాలను అందించింది.

వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్‌కు దూరం
అయితే వీరసింహారెడ్డి సినిమా ప్రీరిలీజ్‌కు హుషారుగా వెళ్లిన శృతిహాసన్.. ఆ వేడుకలో జోష్‌తో కనిపించింది. ఆ తర్వాత రెండు రోజుల అనంతరం జరిగిన వాల్తేరు వీరయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ఆరోగ్య కారణాలతో ఫంక్షన్‌కు దూరమైంది. ఆరోగ్యం సహకరించడం లేదు. అందుకే ఫంక్షన్‌కు రాలేదని తన ఇన్స్‌టాగ్రామ్ స్టోరీ ద్వారా తెలియజేసింది.

రిలీజ్ తర్వాత కనిపించని శృతిహాసన్
అయితే గతవారం రోజులుగా చిరంజీవి, రవితేజ, బాలకృష్ణ, ఇతర నటీనటులు వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య ప్రమోషన్స్‌లో జోరుగా పాల్గొన్నారు. రకరకాల ఈవెంట్లలో టాప్ హీరోలు సందడి చేశారు. కానీ ఒక్క ఈవెంట్‌కు, ప్రమోషనల్ యాక్టివిటిలో శృతి కనిపించలేదు. దాంతో రకరకాల ఊహాగానాలు మీడియాలో కనిపించాయి.

శృతి ఎందుకు రావడం లేదంటూ
వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య సినిమాల రిలీజ్ తర్వాత నిర్వహిస్తున్న సక్సెస్ మీట్, థ్యాంక్యూ మీట్స్‌కు శృతిహాసన్ ముఖం చాటేసింది. ఈ రెండు సినిమాల రిలీజ్ తర్వాత నిర్వహించిన ప్రెస్ మీట్లలో చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ పాల్గొన్నారు. దాంతో శృతిహాసన్ ఎందుకు రావడం లేదనే ప్రశ్న వినిపించింది.

ప్రియుడితో శృతిహాసన్ రొమాంటిక్‌గా
అయితే
వీరసింహారెడ్డి,
వాల్తేరు
వీరయ్య
సినిమా
ప్రమోషన్స్‌కు
దూరమైన
శృతిహాసన్.
ముంబై
వీధుల్లో
జోష్‌తో
కనిపించింది.
ప్రియుడు
శంతను
హజారికాతో
చెట్టాపట్టాలేసుకొని
కనిపించింది.
ప్రియుడి
చేతిలో
చేయి
వేసి
శృతిహాసన్
రొమాంటిక్
లుక్‌తో
మీడియాకు
చిక్కింది.
దాంతో
శృతి
హాసన్
బాగానే
ఉంది
కదా..
ప్రమోషన్స్‌కు
ఎందుకు
రావడం
లేదనే
ప్రశ్న
మరోసారి
సినీ
వర్గాలు
లేవనెత్తుతున్నారు.