ఆ హీరోయిన్‌పై మా నాన్నకు పీకల్లోతు ప్రేమ.. ఆమె కోసం ఏం చేశాడంటే? సీక్రెట్ లీక్ చేసిన శృతిహాసన్
సౌత్ ఇండియాలోనే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో విభిన్నమైన పాత్రలతో ఆకట్టుకొంటున్న హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరు. గ్లామర్ పాత్రలతోనే కాకుండా ఎమోషనల్ పాత్రలతో ప్రేక్షకులను ఆలరింపజేస్తున్నారు. తాజాగా కూలీ సినిమాలో భావోద్వేగమైన పాత్రలో ఒదిగిపోయారు. ఇటీవల కూలీ ప్రమోషన్స్ కార్యక్రమంలో జోరుగా పాల్గొన్నారు. ఆ సమయంలో తన తండ్రి కమల్ హాసన్ గురించి ఆమె ఆసక్తికరమైన విషయాలు వెల్లడించారు. శృతి మాట్లాడుతూ.. ఓ హీరోయిన్‌తో తన తండ్రి ప్రేమలో పడిన విషయం.. ఆమె కోసం తను మాట్లాడే భాషను కూడా నేర్చుకొన్నాడని ఆమె చెప్పి అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే కమల్ హాసన్ ప్రేమ వ్యవహారాలు.. ఇంతకు క్రష్ పెంచుకొన్న హీరోయిన్ ఎవరనే విషయాల్లోకి వెళితే..
సినీ పరిశ్రమలో కమల్ హాసన్ కొనసాగించిన సుదీర్ఘమైన ప్రయాణంలో ఎంతో మంది హీరోయిన్లతో అఫైర్లు, డేటింగ్ వ్యవహారాలు మీడియాలో కనిపించాయి. అయితే ముఖ్యంగా వాణి గణపతి, సారిక థాకూర్, గౌతమితో వ్యవహారాలే అఫిషియల్‌గా నిలిచాయి. ఈ ముగ్గురితో కాకుండా గతంలో చాలా మంది హీరోయిన్లతో ఆయనకు లింకులు ఉన్నాయనే గాసిప్స్ వచ్చాయి. కానీ అవి మీడియాలో ఎక్కువ కాలం నిలువలేదు.

ఇక తాను ప్రేమించిన వాణి గణపతిని 1978 సంవత్సరంలో వివాహం చేసుకొన్నాడు. దాదాపు 10 ఏళ్ల పాటు వైవాహిక జీవితాన్ని కొనసాగించారు. ఆ తర్వాత వారిద్దరి మధ్య దాంపత్యపరమైన విభేధాలు రావడంతో విడిపోయారు. ఆ తర్వాత సారిక థాకూర్‌ను 1991 సంవత్సరంలో పెళ్లి చేసుకొన్నారు. వారి వైవాహిక జీవితం సుమారుగా 13 ఏళ్లపాటు అంటే.. 2004 సంవత్సరం వరకు కొనసాగింది. ఆ తర్వాత వారిద్దరూ విడాకులు తీసుకొన్నారు. ఇద్దరు భార్యలతో విడిపోయిన తర్వాత తెలుగు నటి గౌతమితో దాదాపు 11 ఏళ్లు సహజీవనం చేశారు. 2016 సంవత్సరంలో వారిద్దరూ బ్రేకప్ చెప్పుకొన్నారు.
కమల్ ఈ ముగ్గురితో కాకుండా బెంగాళీ నటి అపర్ణాసేన్‌తో లవ్‌లో పడ్డారట. ఆమెను పీకల్లోతూ ప్రేమను పెంచుకొని ఆరాధించారు. అపర్ణా సేన్ కోసం బెంగాళీ భాషను కూడా నేర్చుకొన్నారు. కానీ వారిద్దరి మధ్య ఎలాంటి బంధం ఏర్పడలేదు. అపర్ణపై అభిమానం పెంచుకొని.. హే రామ్ సినిమాలో రాణి ముఖర్జీ పాత్ర పేరును అపర్ణగా పెట్టుకొని తన క్రష్‌ను బయటపెట్టుకొన్నాడు అని శృతిహాసన్ వెల్లడించింది.
అయితే కమల్ బెంగాళీ భాషను నేర్చుకోవడం గురించి గతంలో అనేక కథనాలు వినిపించాయి. ఓ సినిమా కోసం ఆ భాషను నేర్చుకొన్నారని అందరూ చెప్పుకొన్నారు. కానీ తన తండ్రి బెంగాళీ భాషను నేర్చుకోవడానికి అపర్ణా సేన్ కారణం. ఆమెను ఇంప్రెస్ చేయడానికే బెంగాళీని నేర్చుకొన్నారు. మా నాన్న మనసులో అపర్ణాసేన్ చెరుగని ముద్ర వేసింది అని శృతిహాసన్ పేర్కొన్నారు.
అయితే తన తండ్రి మాదిరిగానే తాను అనేక భాషలను నేర్చుకొన్నాను. కానీ మా నాన్న మాదిరిగా ఎవరినో ఇంప్రెస్ చేయడానికి మాత్రం కాదు. నా భాషల పట్ల అభిమానంతోనే వాటిని నేర్చుకొన్నాను అని చెప్పారు. శృతి విషయానికి వస్తే.. కేవలం ఆమె నటిగానే కాకుండా గాయనిగా, మ్యూజిక్ కంపోజర్‌గా కూడా రాణిస్తున్నారు.


Click it and Unblock the Notifications











