twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రభాస్‌పై ఇష్టాన్ని బయట పెట్టిన శృతి హాసన్: అతడి కోసం అన్నీ వదులుకుంటుందట

    |

    కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్ అయిపోయింది హాట్ బ్యూటీ శృతి హాసన్. దక్షిణాదిలోని అన్ని పరిశ్రమలతో పాటు బాలీవుడ్‌లోనూ నటించి మెప్పించిన ఈ బ్యూటీ.. దేశ వ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకుంది. అదే సమయంలో సింగర్‌గానూ తనలోని మరో టాలెంట్‌ను బయటకు తీసింది. ఇలా వరుస ప్రాజెక్టులతో సత్తా చాటుతోన్న సమయంలో ప్రేమలో పడి కెరీర్‌ను ప్రశ్నార్థకం చేసుకుంది. ఇక, ప్రియుడితో బ్రేకప్ తర్వాత మరోసారి ముఖానికి మేకప్ వేసుకుంది.

    శృతి హాసన్ ప్రస్తుతం విజయ్ సేతుపతి హీరోగా నటిస్తున్న 'లాభం' అనే మూవీలో నటిస్తోంది. ఎస్పీ జగన్నాథన్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది. అలాగే, తెలుగులో రవితేజ సరసన 'క్రాక్' అనే సినిమా చేస్తోంది. దీనితో పాటు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటిస్తున్న 'వకీల్ సాబ్'లోనూ హీరోయిన్‌గా చేస్తోంది. వీటితో పాటు మరికొన్ని చిత్రాల్లో నటించేందుకు ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. మరికొన్ని చర్చల దశలో ఉన్నాయి. ఇలా చేతి నిండా ప్రాజెక్టులతో బిజీగా గడుపుతున్నప్పటికీ ప్రభాస్ సినిమాలోనూ అవకాశం కోసం వేచి చూస్తోంది.

    Shruti Haasan Likely want to Pairup with Prabhas

    తాజాగా ఓ చిట్ చాట్‌లో పాల్గొంది శృతి హాసన్. ఈ నేపథ్యంలో తనకు ప్రభాస్‌తో నటించాలని ఉందన్న విషయాన్ని బయట పెట్టింది. ఓ నెటిజన్ అడిగిన ప్రశ్నకు సమాధానం చెబుతూ 'నాకు ప్రభాస్‌తో నటించాలన్న డ్రీమ్ ఉంది. ఎప్పటికైనా అది సాకారం అవుతుందని భావిస్తున్నా. ఒకవేళ అతడి పక్కన నటించే అవకాశమే వస్తే.. రెమ్యూనరేషన్ గురించి కూడా పట్టించుకోను. అలాగే నా నిర్ణయాలను కూడా మార్చుకుంటాను' అని చెప్పుకొచ్చింది. ప్రస్తుతం ప్రభాస్.. 'రాధే శ్యామ్' అనే సినిమా చేస్తున్నాడు. దీని తర్వాత ప్రశాంత్ నీల్ 'సలార్', ఓం రౌత్ 'ఆదిపురుష్' చేయనున్నాడు.

    English summary
    Legendary actor Kamal Hassan's lovely daughter Shruti Hassan is not just an eye candy. She is a qualified musician, breathtaking dancer, singer, composer and a dance choreographer as well! In fact, Shruti's film debut was with playback singing for Kamal's cult film.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X