For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  అందుకే అక్కడ సర్జరీ చేయించుకున్నా.. ఆ శరీర భాగంలో అంటూ.. శ్రుతి హాసన్

  |

  యూనివర్సల్ స్టార్ హీరో కమల్ హాసన్ నట వారసురాలిగా సినీ రంగంలో ఎంట్రీ ఇచ్చింది బ్యూటిఫుల్ శ్రుతి హాసన్. పేరుకు కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తనదైన శైలీలో ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. శ్రుతి హాసన్ నటనలోనే కాకుండా గొప్ప సింగర్ గా కూడా పేరు తెచ్చుకుంది. అయితే శ్రుతి హాసన్ తెలుగులో అనగనగా ఓ ధీరుడు, హిందీలో లక్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన అంతగా అదృష్టం కలిసిరాలేదు. తర్వాత రానురాను స్టార్ హీరోలందరికీ గోల్డెన్ గర్ల్ గా మారిపోయింది ఈ బ్యూటి. అయితే సినిమా రంగం అన్నాకా.. అందులో హీరోయిన్లు అన్నాకా తమ అందంపై శ్రద్ధా పెట్టాల్సిందే. అందుకే హీరోయిన్స్ కొందరు సర్జరీ బాట పడుతుంటారు. అందులో శ్రుతి హాసన్ కూడా ఒకరు. తనలోని ఓ పార్ట్ అంటే తనకు చాలా ఇష్టమని అందుకే సర్జరీ చేయించుకున్నాను అని ఓపెన్ గా చెప్పేసింది ఈ బ్యూటి.

  వరుస సినిమాలతో సందడి..

  వరుస సినిమాలతో సందడి..

  టాలీవుడ్‌లోకి ఈ మధ్యనే రీఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్.. వరుస సినిమాలతో సందడి చేస్తోంది. ఇప్పటికే ఈ అమ్మడు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో 'సలార్‌' అనే సినిమాను చేస్తోంది. అలాగే బాలయ్య - గోపీచంద్ కాంబినేషన్‌లో వస్తోన్న సినిమాలోనూ భాగమైంది. ఇది మాత్రమే కాదు.. బాబీ దర్శకత్వంలో చిరంజీవి నటిస్తోన్న వాల్తేరు వీరయ్య సినిమాలోనూ శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది.

  అందానికి మెరుగులు దిద్దాల్సిందే..

  అందానికి మెరుగులు దిద్దాల్సిందే..

  ఇక ఇదిలా ఉంటే గ్లామర్ ప్రపంచంలో అందానికి మెరుగులు దిద్దాల్సిందే మరి. అందుకే సర్జరీల వెనక పడతారు హీరోయిన్లు. అందులో శ్రుతి హాసన్ కూడా ఒకరు. కానీ ఏ విషయాన్నైనా ముక్కు సూటిగా మాట్లాడుతుంది ఈ అమ్మడు. అయితే తాజాగా ఓ ఇంగ్లీష్ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చింది ఈ బ్యూటి. ఈ క్రమంలో తన ముక్కుకు చేసుకున్న సర్జరీ గురించి మరోసారి బయట పెట్టింది.

  నా ముక్కు వంకరగా ఉండేది..

  నా ముక్కు వంకరగా ఉండేది..

  'అవును. నేను నా ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకున్నాను. నా ముక్కు వంకరగా ఉండేది. దాని వల్ల నేను బాధ పడ్డాను. అందుకే నేను నా ముక్కును సర్జరీ ద్వారా సరిచేయించుకున్నాను. నా మొదటి సినిమా సర్జరీకి ముందు చేసిందే. ఇది నా శరీరం. దీన్ని అందంగా తీర్చిదిద్దుకునే హక్కు నాకుంది' అని చెప్పుకొచ్చింది శ్రుతి హాసన్.

   ఎక్కువ ఖర్చు చేశాను..

  ఎక్కువ ఖర్చు చేశాను..

  ఇప్పుడే కాకుండా గతంలోనూ తన ముక్కుకు చేసుకున్న సర్జరీ గురించి తెలిపింది శ్రుతి హాసన్. 'నా శరీరంలో నాకు నా ముక్కు అంటే చాలా ఇష్టం. ఎందుకంటే నేను దాని కోసం ఎక్కువ ఖర్చు చేశాను' అని సమాధానం ఇచ్చింది శ్రుతి హాసన్. కాగా శృతి హాసన్ గతంలో విదేశీ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో ప్రేమాయణం సాగించింది. అంతేకాదు, అతడితో పెళ్లి అని ప్రచారం జరిగినప్పుడే బ్రేకప్ చెప్పి షాకిచ్చింది. ఆ తర్వాత ఈ బ్యూటీ డూడుల్ ఆర్టిస్టు అయిన శాంతను హజారికాతో లవ్ ట్రాక్ నడుపుతోంది. అతడితో కలిసి ఒకేచోట ఉంటూ ఈ అమ్మడు తెగ రెచ్చిపోతోంది.

  చిన్న పాత్రతో తెరంగేట్రం..

  చిన్న పాత్రతో తెరంగేట్రం..

  చిన్న వయసులోనే శృతి హాసన్ సింగర్‌గా ప్రయాణాన్ని మొదలెట్టింది. ఆ తర్వాత స్వయంగా ఎన్నో ఆల్బమ్‌లను రూపొందించింది. ఈ క్రమంలోనే 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్రతో తెరంగేట్రం చేసింది. అనంతరం 'లక్' అనే హిందీ మూవీలోనూ నటించింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు'తో శృతి హీరోయిన్‌గానూ పరిచయమై ఫుల్ ఫేమస్ అయింది.

  తక్కువ టైంలోనే స్టార్ గా..

  తక్కువ టైంలోనే స్టార్ గా..

  టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంటర్ అయిన చాలా తక్కువ టైంలోనే శృతి హాసన్ స్టార్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే అందరు స్టార్ హీరోలతోనూ నటించింది. అలా సూపర్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే ఈ సుందరాంగి చాలా గ్యాప్ తీసుకుంది. ఆ తర్వాత 'క్రాక్' మూవీతో మరోసారి టాలీవుడ్‌లోకి వచ్చింది. దీని తర్వాత 'వకీల్ సాబ్' మూవీలోనూ ఈమె అదరగొట్టేసింది.

  English summary
  Tollwyood Beautiful Heroine Shruti Haasan About Her Nose Plastic Surgery In An Interview.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X