బ్రేకప్ ఓ విషాదం.. అలా కలిసి ఉండటం ఓ బాధ.. శృతిహాసన్ ఎమోషనల్
మ్యూజిక్ కోసం సినిమా అవకాశాలను వదులుకొన్న అందాల తార శృతీహాసన్ కొన్నాళ్లపాటు లండన్‌లో ప్రత్యేకంగా ఈవెంట్లలో పాల్గొన్నారు. ప్రస్తుతం మ్యూజిక్‌ను కాస్త పక్కన పెట్టి ఇప్పుడు మరోసారి సినిమాల బాట పట్టింది. ప్రియుడు మైఖేల్ కోర్సలేతో బ్రేకప్ తర్వాత దక్షిణాది సినిమాలో ఆఫర్లను సొంతం చేసుకొంటూ సినీ ప్రయాణాన్ని కొనసాగించేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఈ క్రమంలో బాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యక్తిగత, ప్రొఫెషనల్, తల్లిదండ్రుల మధ్య విభేదాల గురించి ప్రస్తావించింది. శృతిహాసన్ చెప్పిన విషయాలు ఆమె మాటల్లోనే..

సినిమా, మ్యాజిక్ బ్యాలెన్స్ చేస్తూ
సినిమాలను వదులుకోవడం వల్ల కొంత నష్టపోయాను. మ్యూజిక్‌పై ఉన్న ప్రేమతో అటువైపు కొంత దృష్టిపెట్టాను. కానీ సినిమాల వల్ల నష్టపోతున్న విషయాన్ని తెలుసుకొని మళ్లీ అటువైపుగా దృష్టిపెట్టాలని నిర్ణయం తీసుకొన్నాను. మ్యూజిక్, సినిమాలను బ్యాలెన్స్ చేస్తూ కెరీర్‌ను కొనసాగిస్తాను అని శృతిహాసన్ తెలిపారు.

ఫర్‌ఫెక్ట్ ఫ్యామిలీలో
తన తల్లిదండ్రులు విడిపోవడంపై శృతిహాసన్ స్పందిస్తూ.. ఫర్‌ఫెక్ట్ ఫ్యామిలీలో కూడా బాధ అనేది ఉంటుంది. మీ కుటుంబం సుఖ: సంతోషాల్లో ఉన్నా.. మీ తల్లిదండ్రులు కలిసి ఉన్న ఆ బంధంలో బాధ అనేది తప్పనిసరిగా ఉంటుంది. జీవితంలో బాధ అనేది ఓ భాగం అని శృతిహాసన్ అన్నారు. తన తల్లిదండ్రులు విడిపోవడంలో నాకు తప్పేమీ కనిపించలేదు అని అన్నారు.

బ్రేకప్ మనకు ఓ వార్త కానీ..
నా తల్లిదండ్రులు కమల్ హాసన్, సారిక మంచి మనుషులు. వారు సుఖంగా ఉండాలని కోరుకొన్నారు. డైవోర్స్ తీసుకోవడం అనేది చాలా ఇళ్లలో కనిపిస్తుంది. కానీ కమల్, సారిక విడిపోవడం మనలాండి వాళ్లకు న్యూస్. ఇళ్లలో గడిపే వారికి అది వార్త కాదు. వారు తీసుకొన్న నిర్ణయం నాకు సంతోషం కలిగించింది. ఎందుకంటే వాళ్లిద్దరూ అద్భుతమైన వ్యక్తులు. వారివారి పరిధిలో సంతోషంగా ఉండాలని కోరుకొన్నారు. అందుకే వారు విడివిడిగా సంతోషంగా గడుపుతున్నారు అని శృతిహాసన్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు.

విడిపోవడం ఓ విషాదం
నా తల్లిదండ్రులు డైవోర్స్ తీసుకోవాలనే నిర్ణయం వాస్తవంగా జీర్ణించుకోలేనిది. ఆ విషాదం మమ్మల్ని వెంటాడింది. పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు బలవంతంగా కలిసి ఉండలేం. కొన్నిసార్లు విడిపోవడం తప్పనిసరి అవుతుంది. బయటి ప్రపంచం కోసం బలవంతంగా కలిసి ఉన్నా ఎలాంటి ప్రయోజనం ఉండదు అని శృతీ హాసన్ పేర్కొన్నది.

రవితేజ, విజయ్ సేతుపతితో
కెరీర్ పరంగా చూస్తే.. శృతిహాసన్ యాక్టింగ్ విషయంలో వేగం పెంచింది. ఇంగ్లీష్ టెలివిజన్ సీరియల్ ట్రెడ్‌స్టోన్‌తోపాటు దక్షిణాదిలో వరుస ఆఫర్లను సొంతం చేసుకొన్నది. విజయ్ సేతుపతితో లాంబమ్, తెలుగులో మాస్ మహారాజా రవితేజతో ఓ చిత్రంలో కలిసి నటిస్తున్నది. ఇంకా కొన్ని ఆఫర్లు చర్చల దశలో ఉన్నాయి.


Click it and Unblock the Notifications











