రిలేషన్, డేటింగ్ చేస్తే పెళ్లి చేసుకోవాలా? మిగితా లేడీస్‌కు నాకు తేడా.. శృతిహాసన్ షేకింగ్ కామెంట్స్
దక్షిణాది అందాల తార శృతిహాసన్ వ్యక్తిగత, ప్రొఫెషనల్ జీవితం గురించి రకరకాల వార్తలు మీడియాలో గుప్పుమంటున్నాయి. ప్రియుడు మైఖేల్ కోర్సలే గురించి, తన సినిమాల గురించి ఎన్నో కథలు గట్టిగానే వినిపిస్తున్నాయి. అయితే తాను పెళ్లికి తొందరపడటం లేదనే సమాధానం మాత్రం ఆమె నుంచి వినిపిస్తున్నది. ఇప్పుడే పెళ్లి గురించి ఆలోచించడం లేదని స్పష్టం చేసింది. పెళ్లి గురించి ఆమె ఏమన్నారంటే...

పెళ్లి గురించి నా ఆలోచన
పెళ్లి గురించిన ఆలోచనల విషయంలో ఇతర మహిళలకు నాకు చాలా వ్యత్యాసాలు ఉన్నాయి. నేను పెళ్లి చేసుకోవడం లేదు. నేనెప్పుడూ పెళ్లి చేసుకోవడానికి ఆరాట పడలేదు. నాకు పెళ్లి చేసుకోవాలనే కోరిక, ఇష్టం కలిగినప్పుడు మాత్రమే వివాహం గురించి ఆలోచిస్తాను అని శృతిహాసన్ వెల్లడించింది.

రిలేషన్ ఉంటే పెళ్లి చేసుకోవాలా?
ఇద్దరు వ్యక్తుల మధ్య రిలేషన్ పెళ్లికి దారి తీస్తుందా? తప్పనిసరిగా పెళ్లి చేసుకోవాలా? ఓ వ్యక్తితో బంధం పెళ్లికి దారి తీయకూడదు. రిలేషన షిప్స్‌పై నాకంటూ ఓ అభిప్రాయం ఉంటుంది. రిలేషన్ షిప్ అనేది ఓ స్వేచ్ఛతో కూడినదై ఉండాలి. మనకు నచ్చిన వ్యక్తిని, భాగస్వామిని ఎంచుకొనే స్వేచ్ఛను నేను కోరుకొంటాను అని శృతి చెప్పింది.

ప్రతీ మార్పును స్వాగతించాలని
జీవితంలో ప్రతీ మార్పును ఆస్వాదించాలి. దానిని స్వాగతించాలి. అప్పుడే పరిస్థితులకు అనుగుణంగా జీవితాన్ని కొనసాగించవచ్చు అని చెప్పింది. ప్రస్తుతం లండన్‌కు చెందిన రాక్‌స్టార్ మైఖేల్ కోర్సలేతో శృతిహాసన్ కొద్దికాలంగా డేటింగ్ చేస్తున్నారు. దాంతో ఆమె పెళ్లిపై అనేక ఊహాగానాలు జోరందుకొన్నాయి.

ప్రియుడికి క్రేజీగా బర్త్ డే విషెస్
ఇటీవల మైఖేల్ కోర్సలే బర్త్ డే సందర్భంగా శృతిహాసన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఆసక్తికరమైన కామెంట్‌ను చేసింది. హ్యాపీ బర్త్ డే మైఖేల్ కోర్సలే. నీలో సముద్రమంత పరిపూర్ణత ఉంది. అందుకే పరిపూర్ణమైన సాయంత్రం వేళ.. చక్కటి ఫోటోను నీతో షేర్ చేసుకోవాలనుకొంటున్నాను. ఈ ఫోటో నీకు మరింత సంతోషాన్ని కలిగించడమే కాకుండా, హృదయం ఉప్పొంగేలా చేస్తుందని అనుకొంటున్నాను. మరోసారి హ్యాపీ బర్త్ డే మై బెస్ట్ ఫ్రెండ్ అని శృతి ఓ పోస్టు పెట్టింది.

బాలీవుడ్‌లో పదేళ్లు
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించి పదేళ్లు పూర్తి చేసుకొన్న సందర్భంగా శృతిహాసన్ ఓ మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చింది. 2008లో లక్ అనే చిత్రంతో హిందీ చిత్ర సీమలోకి ప్రవేశించింది. నటనతోపాటు గాయనిగా తన కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. ఇంటర్నేషనల్ ఆల్బమ్‌ను పూర్తి చేసే పనిలో ప్రస్తుతం ఆమె బిజీగా ఉన్నారు. అందుచేతనే సినిమాలను ఆచితూచి ఎంపిక చేసుకొంటున్నట్టు ఆమె వెల్లడించారు.


Click it and Unblock the Notifications











