For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  Shruti Haasan ఆ యాక్టర్లతో డేటింగ్ వర్కవుట్ కాలేదు.. అందుకే అతడితో అఫైర్.. పెళ్లిపై శృతిహాసన్ రియాక్షన్ అలా!

  |

  బ్యూటీ విత్ బ్రెయిన్ అంటే వెంటనే గుర్తొచ్చే హీరోయిన్లలో శృతిహాసన్ ఒకరంటే ఏ మాత్రం సందేహం అక్కర్లేదు. నిత్యం మీడియా కెమెరాలకు చిక్కి సోషల్ మీడియాలో వైరల్ కావడం, డేటింగ్ వార్తలతో పతాక శీర్షికలను ఆకర్షించడం శ‌ృతి హాసన్‌కు సర్వసాధారణంగా మారాయి. అగ్ర నటులు, భారీ బడ్జెట్ చిత్రాలతో శృతి హాసన్ బిజీగా ఉంటూ.. ఇటీవల జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలో తన ప్రేమ, అఫైర్లు, డేటింగ్ లాంటి విషయాలపై కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. శృతిహాసన్ చెప్పిన విషయాలు మీ కోసం..

  2022లో నా కెరీర్ సూపర్‌గా

  2022లో నా కెరీర్ సూపర్‌గా


  నా కెరీర్ గురించి చెప్పాలంటే.. 2022లో అంతా సానుకూలంగా ఉంది. వెబ్ సిరీస్‌తో నా ఈ సంవత్సరం మొదలైంది. ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ, ప్రేమను పొందగలిగాను. అలాగే ప్రభాస్‌తో సలార్, చిరంజీవితో చిరు154, బాలకృష్ణతో NBK107 చిత్రాలతోపాటు పలు దక్షిణా చిత్రాల్లో నటిస్తున్నాను. ఇంకా పలు సినిమాల గురించి చర్చలు జరుగుతున్నాయి అని శృతిహాసన్ తెలిపింది

  హిందీ సినిమాల్లో నటిస్తాను అంటూ

  హిందీ సినిమాల్లో నటిస్తాను అంటూ


  హిందీ సినిమా రంగంలో కూడా బిజీగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. ముంబై నాకు సొంత నగరం లాంటింది. మా అమ్మా నాన్న విడిపోయినప్పటి నుంచి నేను ముంబైలో పెరిగాను. అమ్మతో కలిసి హిందీ మాట్లాడుతాను. 2009లో లక్ అనే సినిమాతో బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చాను. చాలా సినిమాలు చేశాను. కానీ అంతగా నాకు గుర్తింపు లభించలేదు. పలు ప్రాజెక్టుల గురించి చర్చలు జరుగుతున్నాయి. అన్ని కుదిరితే త్వరలోనే నేను మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందు ఉంటాను అని శృతిహాసన్ ఆశాభావం వ్యక్తం చేసింది.

  శంతను హజారికాతో డేటింగ్

  శంతను హజారికాతో డేటింగ్


  తన జీవితంలోని అఫైర్లు, డేటింగ్ గురించి శృతిహాసన్ ఓపెన్ అవుతూ. శంతను హజారికాకు నాకు కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు. వారి ద్వారా మా పరిచయం జరిగింది. సినిమా, మ్యూజిక్, కళలు మా మధ్య కామన్ విషయాలు. అందుకే మేమిద్దరం చాలా దగ్గరయ్యాం. శంతను లాంటి వాళ్లు చాలా రేర్‌గా ఉంటారు. నేను గతంలో చాలా మంది యాక్టర్లతో డేటింగ్ చేశా. కానీ వాళ్లతో వర్కవుట్ కాలేదు. అయితే శంతను లాంటి వాళ్లు చాలా అరుదుగా కనిపిస్తారు. మా బంధంలో మ్యూజిక్ కీలక పాత్ర పోషించింది అని తెలిపింది.

  శంతను లాంటి వాళ్లు లభించరు అంటూ

  శంతను లాంటి వాళ్లు లభించరు అంటూ


  శంతను హజారికాను కలిసిన తర్వాత నా ప్రపంచం ఒక్కసారిగా మారిపోయింది. నా అభిరుచులను గౌరవిస్తాడు. నేనంటే మంచి అభిప్రాయం ఆయనకు ఉంది. వినోద పరిశ్రమలో అలాంటి వాళ్లు అరుదుగా ఎదురుపడుతారు. అందుకే ఆయనకు దగ్గరయ్యాను. తొలిసారి ఇండస్ట్రీకి సంబంధం లేని వ్యక్తితో ప్రేమలో పడ్డాను. మా డేటింగ్ వ్యవహారం సవ్యంగా సాగుతున్నది అని శృతి హాసన్ తెలిపింది.

  పెళ్లి గురించి శృతిహాసన్

  పెళ్లి గురించి శృతిహాసన్


  నా జీవితంలో పెళ్లి ప్రస్తావన చాలా సార్లు వచ్చింది. పెళ్లి అనే విషయం రాగానే నేను చాలా నెర్వస్‌గా ఫీలవుతాను. ఆ బంధంలోకి అంత త్వరగా నేను దూరిపోలేను. అందుకే పెళ్లి గురించి ఆలోచిస్తూనే ఉన్నాను. నాపై నా తల్లిదండ్రుల పెళ్లి ప్రభావం ఎక్కువగానే ఉంది. పెళ్లి వర్కువుట్ అయితే జీవితం చాలా బాగుంటుంది. వర్కువట్ అయినా కాకున్నా నాకు పెళ్లిపై మంచి అభిప్రాయం ఉంది. నా తల్లిదండ్రుల విషయంలో వర్కవుట్ కాకపోతే వివాహ వ్యవస్థపై నాకు ఎలాంటి చెడు అభిప్రాయం లేదు అని శృతిహసన్ చెప్పింది.

  English summary
  Actress Shruti Haasan busy with muliple projects in South and Hindi. She is doing Chiru 154, NBK107, Salaar with top stars of Telugu. She opened up about marriage with her boyfriend Shantanu Hazarika
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X