శృంగారానికి ఓకే.. పెళ్లి చేసుకోను.. అఫైర్లపై శృతిహాసన్ బోల్డ్ కామెంట్

భారతీయ సినిమా పరిశ్రమలో అత్యంత ప్రతిభావంతులైన యువ హీరోయిన్లలో శృతి హాసన్ ఒకరు. తండ్రి కమల్ హాసన్ నుంచి వారసత్వాన్ని స్వీకరించినప్పటికీ.. తనకంటూ ప్రత్యేకంగా, సొంతంగా గుర్తింపును పొందారు. నటిగానే కాకుండా గాయకురాలిగా, మ్యూజిషియన్‌గా పలు రకాల పాత్రలను పోషిస్తూ తన టాలెంట్‌ను నిరూపించుకొంటున్నారు. అయితే వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే.. చాలా అఫైర్లు, బ్రేకప్స్‌తో ముందుకు సాగుతున్నది. అయితే తాజా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో శృతిహాసన్ మాట్లాడుతూ డేటింగ్, అఫైర్ల గురించి బోల్డుగా కామెంట్ చేశారు. ఆమెకు సంబంధించిన రిలేషన్‌షిప్ వివరాల్లోకి వెళితే..

దక్షిణాదిలో శృతి హాసన్‌కు సంబంధించిన వ్యక్తిగత జీవితంలో ఎన్నో రూమర్లు, గాసిప్స్ బయటకు వస్తుంటాయి. అయితే వాటిని చాలా బోల్డుగా ఆమె స్వీకరిస్తుంటుంది. చాలా మంది హీరోయిన్లతో ఆమెకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయనే విషయం ఓపెన్ సీక్రెట్. అయితే ఆ బంధాలు మాత్రం ఎక్కువ కాలం కొ కొనసాగించకుండా తాత్కాలికంగా బ్రేకప్ కావడం అంతుపట్టని విషయంగా కనిపిస్తుంటుంది.

Shruti Haasan opened up on Dating Affairs Releationships and Marriage

శృతిహాసన్ విషయానికి వస్తే.. ధనుష్, సిద్దార్థ్, నాగచైతన్య లాంటి హీరోలతో రిలేషన్‌షిప్, డేటింగ్ వ్యవహారాలు కొనసాగించారనే విషయం అప్పట్లో హాట్ టాపిక్‌గా మారింది. ఆ తర్వాత బ్రిటిష్ మ్యూజిక్ కళాకారుడితో, అలాగే పెయింటర్ హజారికాతో ఆమె బంధాలు పెళ్లి వరకు వచ్చి ఆగిపోయాయి. అయితే వాటిపై ఆమె ఎన్నడూ కూడా పెద్దగా స్పందించలేదు. కానీ తాజాగా తన వ్యక్తిగత, డేటింగ్ లైఫ్‌పై ఓ క్లారిటీ ఇచ్చేసింది.

తాజాగా ఆమె జాతీయ మీడియాతో మాట్లాడుతూ.. పెళ్లి అనే అంశంపై నాకు సరైన అవగాహన ఉంది. నేను పెళ్లి చేసుకోవడానికి చాలా ఆలోచిస్తాను. పెళ్లి అనే విషయానికి నేను దూరం. కావాలంటే.. డేటింగ్, అఫైర్, రిలేషన్‌షిప్స్‌కు నేను ఒకే. శృంగార జీవితాన్ని ఆస్వాదిస్తాను. కానీ పెళ్లి మాత్రం చేసుకోను అని ఆమె ఓపెన్‌గా కుండ బద్దలు కొట్టేసినట్టు చెప్పేసింది. అయితే ప్రస్తుతం ఆమె అభిప్రాయం మారకపోతుందా? మనసు మార్చుకోని పెళ్లి చేసుకోకపోతుందా? అనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి.

శృతిహాసన్ కెరీర్ విషయానికి వస్తే.. సినిమాలు, మ్యూజిక్‌తో దూసుకెళ్తున్నారు. ఆమె తాజాగా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న వారణాసి సినిమా టైటిల్ రివీల్ ఈవెంట్‌లో ర్యాప్‌తో సాగే సంచారీ అనే పాటను పాడటమే కాకుండా స్టేజ్‌ మీద పెర్ఫార్మెన్స్ కూడా ఇచ్చారు. ఈ పాటను పాడి పెర్ఫార్మెన్స్ చేసినందుకు 1 కోటి రూపాయల పారితోషికం అందుకొన్నట్టు సమాచారం.

More from Filmibeat

Read more about: shruti haasan dhanush kollywood
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X