Shruti Haasan నా తలరాత... మనసు మారింది.. శృతిహాసన్ షాకింగ్ కామెంట్స్
తెలుగు, తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ సుదీర్ఘ కాలంగా కెరీర్ కొనసాగిస్తోంది శ్రుతీహాసన్. విశ్వనటుడు కమల్ హాసన్ వారసురాలిగా తెరంగేట్రం చేసిన శ్రుతి అనతి కాలంలోనే ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. విమర్శకులు ప్రశంసలు అందుకుని నటిగా గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు, తమిళంలో అగ్ర కథానాయకుల సరసన నటించింది. ఇప్పటికీ కెరీర్ కొనసాగిస్తూనే ఉంది. శ్రుతి తాజాగా తన కెరీర్, మొదటి సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది.

నటిగా నన్ను నేను ఊహించుకోలేదు
`నటిగా అవ్వాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. నేనే కాదు.. మా అమ్మానాన్నా కూడా నా గురించి అలా ఊహించి ఉండరు. మా అమ్మా, నాన్న పెద్ద నటులైనా నేనెప్పుడూ సినిమా షూటింగ్‌లకు వెళ్లింది లేదు. నేను ఓ సంగీతకారిణిని కావాలనుకున్నా. `లక్` సినిమా సమయానికి నాకు సినిమా గురించి ఏమీ తెలియదు. ఆ సినిమా సెట్‌కు వెళ్లిన తొలి రోజు నాకు వేరే గ్రహానికి వెళ్లినట్టు అనిపించింది. సినిమాల కోసం నేను కొంచెం కూడా ప్రిపేర్ అవలేద`ని శ్రుతి చెప్పింది.

డబ్బుల కోసమే సినిమా
`నటించాలనేది నిజంగా నా నిర్ణయం కాదు. అది నా తలరాత. తొలి రోజుల్లో కేవలం డబ్బుల కోసమే సినిమాలు అంగీకరించేదాన్ని. నటిగా సంపాదించిన డబ్బులతో బ్యాండ్ పరికరాలు కొనుక్కోవాలని అనుకున్నా. ఒక ఐదు సినిమాలు చేసి ఆపేద్దామనుకున్నా. అయితే సినిమాల్లో నటిస్తున్న కొద్దీ నా మనసు మారింది. నటనపై మనసు మళ్లింది. విజయాలు, అపజయాలు, గ్లామర్, ఫేమ్ ఎంతో ఆసక్తిని కలిగించాయ`ని శ్రుతి పేర్కొంది.

సీనియర్స్‌కు ఫస్ట్ ఛాయిస్
పవన్, మహేష్, ఎన్టీయార్, అల్లు అర్జున్ వంటి యంగ్ హీరోలతో ఆడిపాడిన శ్రుతి ప్రస్తుతం సీనియర్స్ సరసన నటించేందుకు సిద్ధమవుతోంది. యంగ్ హీరోయిన్ల రాకతో శ్రుతి కాస్త జోరు తగ్గించింది. ప్రేమ వ్యవహారంతో ఆమె తీసుకున్న బ్రేక్ కూడా ఆమె వెనుకబడేందుకు కారణమైంది. సెకెండ్ ఇన్నింగ్స్‌లో ఆమె పవన్ కళ్యాణ్ `వకీల్ సాబ్`, రవితేజ `క్రాక్` సినిమాలతో విజయాలు అందుకుంది. ప్రస్తుతం ఆమె బాలయ్య, చిరంజీవి వంటి హీరోల సరసన నటించేందుకు సిద్ధమవుతోంది. టాలీవుడ్‌లోని సీనియర్ హీరోలకు ఆమె ఫస్ట్, బెస్ట్ ఛాయిస్‌గా మారింది.

రెమ్యునరేషన్‌లో తగ్గేదేలే..
మెగాస్టార్ చిరంజీవి హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో దర్శకుడు బాబి రూపొందిస్తున్న చిత్రంలో శ్రుతి హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమాలో నటించేందుకు శ్రుతి గట్టిగానే డిమాండ్ చేస్తోందట. రూ. కోటిన్నర ఇస్తేనే సినిమా చేస్తానని చెప్పేసిందట. బాలకృష్ణ-గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా శ్రుతినే హీరోయిన్. ప్రస్తుతం వరుస సినిమాలు అంగీకరిస్తున్న శ్రుతి తన డిమాండ్‌ను క్యాష్ చేసుకునేందుకు గట్టిగానే ప్రయత్నిస్తోందట.
Recommended Video

కరోనా నుంచి కోలుకుని బిజీబిజీ
ఫిబ్రవరి చివరి వారంలో శ్రుతీహాసన్ కరోనా బారిన పడింది. తన ప్రియుడు శంతను హజారికాతో కలిసి శ్రుతి ముంబైలోని తన ఫ్లాట్‌లో సహజీవనం చేస్తోంది. ఇద్దరూ తమ తమ ఫొటోలను సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంటున్నారు. `బెస్ట్ సెల్లార్` వెబ్ సిరీస్‌లో శ్రుతి పాత్రకు అదిరిపోయే ప్రశంసలు దక్కాయి. ఇక, సినిమా షూటింగ్‌లతో శ్రుతి బిజీ కానుంది. శ్రుతి చేతిలో ప్రస్తుతం ప్రభాస్ `సలార్`, చిరంజీవి, బాలయ్య సినిమాలు ఉన్నాయి. అలాగే పలు తమిళ, హిందీ సినిమాలకు కూడా శ్రుతి ఓకే చెప్పనుందట.


Click it and Unblock the Notifications











