కలిసి బతకలేనప్పుడు విడిపోవడమే... శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్

భారతదేశం గర్వించదగ్గ మహానటుల్లో ఉలగ నాయగన్ కమల్ హాసన్ కూడా ఒకరు. నటనకే కొత్త భాష్యం చెప్పిన ఆయన తన 60 ఏళ్లకు పైగా కెరీర్‌లో ఎన్నో విలక్షణ పాత్రలకు ప్రాణప్రతిష్ట చేశారు. వాటి కోసమే కమల్ హాసన్ పుట్టారా అనిపించేంతగా ఒదిగిపోయారు కమల్. కొత్తగా నటనా రంగంలోకి వచ్చే యువతకు కమల్ హాసన్ జీవితం, ఆయన వేసిన పాత్రలు ఒక గ్రంథాలయం లాంటివని విశ్లేషకులు అంటారంటే అతిశయోక్తి కాదు. వృత్తి జీవితంలో శిఖరాలను అందుకున్న ఈ దిగ్గజ నటుడు.. వ్యక్తిగత జీవితంలో పలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విడాకులు, సహజీవనాలతో మాటలు పడ్డారు. అన్నింటికి మించి సారికతో కమల్ హాసన్ విడాకులు చర్చనీయాంశమైంది. ఆయన కుమార్తె, స్టార్ హీరోయిన్ శృతి హాసన్ కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల విడాకులపై కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వివరాల్లోకి వెళితే..

ఐరన్ లెగ్ నుంచి గోల్డెన్ హ్యాండ్‌గా
కమల్ హాసన్ - సారిక దంపతుల గారాలపట్టిగా చిత్ర పరిశ్రమలో అడుగుపెట్టారు శృతిహాసన్. బలమైన సినీ నేపథ్యం ఉన్నప్పటికీ కెరీర్‌ నిలదొక్కుకోవడానికి ఈ ముద్దుగుమ్మ ఎన్నో కష్టాలు పడ్డారు. తొలుత హే రామ్ మూవీలో బాలనటిగా నటించారు. ఆ తర్వాత.. 2009లో హిందీ చిత్రం లక్ ద్వారా హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చారు. అనంతరం అనగనగా ఓ ధీరుడు, 7 ఓమ్ అరివు, ఓ మై ఫ్రెండ్ తదితర చిత్రాల్లో నటించినా అవి బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ కావడంతో ఐరన్ లెగ్ ట్యాగ్ వేయించుకున్నారు. ఈ దశలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించిన గబ్బర్ సింగ్‌తో హిట్ బాట పట్టారు శృతి హాసన్.

Shruti Haasan Opens Up About Parents Divorce Struggles and Journey from Luxury to Self-Made Stardom

నటిగా, సింగర్‌గా హవా
ఆ తర్వాత ఎవడు, రేసు గుర్రం, పూజ, శ్రీమంతుడు, వేదాళం, ప్రేమమ్, సింగమ్ 3, క్రాక్, వకీల్ సాబ్, వీరసింహా రెడ్డి, వాల్తేర్ వీరయ్య, సలార్, కూలీ చిత్రాలతో తిరుగులేని నటిగా, భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే నటీమణుల్లో ఒకరిగా నిలిచారు శృతి. పాతికేళ్ల కెరీర్‌లో తెలుగు, తమిళ, హిందీ, ఇంగ్లీష్ చిత్రాలలో నటించారు. నటిగానే కాకుండా సింగర్‌గా, సంగీత దర్శకురాలిగానూ సత్తా చాటారు. ప్రస్తుతం తమిళంలో ట్రైన్... తెలుగులో ఆకాశంలో ఒక తార, సలార్ 2 చిత్రాల్లో శృతి హాసన్ నటిస్తున్నారు.

ఇటాలియన్ నటుడితో డేటింగ్
అందరు హీరోయిన్ల మాదిరిగానే శృతిహాసన్‌ కూడా పలువురితో డేటింగ్ చేసినట్లు రూమర్స్ వచ్చాయి. శంతను హాజారికా, సురేష్ రైనా, రణబీర్ కపూర్, ధనుష్, సిద్ధార్థ్‌లతో ఆమె ప్రేమాయణం సాగించినట్లు గాసిప్స్ వైరల్ అయ్యాయి. అయితే ఇటలీకి చెందిన మైఖేల్ కోర్సాలే, శంతను హాజారికాలతో మాత్రం తన రిలేషన్‌ను బహిరంగంగానే వెల్లడించారు. అయితే వీరితో బంధం పెళ్లి పీటల వరకు వెళ్లలేదు. ప్రస్తుతం తన కెరీర్‌పైనే ఫోకస్ పెట్టిన శృతి హాసన్ మంచి చిత్రాలను ఎంచుకుంటున్నారు.

బెంజ్ నుంచి లోకల్ ట్రైన్‌కి
కొద్దిరోజుల క్రితం ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో తన కెరీర్, ఎఫైర్స్, తల్లిదండ్రుల గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు శృతిహాసన్. నేను ఇండస్ట్రీకి రావడానికి ముందే నా తల్లిదండ్రులు విడిపోయారు. ఇది నన్ను ఎంతో బాధించింది. నాన్నతో విడాకుల తర్వాత అమ్మతోనే కలిసి జీవించా. అమ్మనాన్న విడాకుల తర్వాత నా అందమైన జీవితం ఒక్కసారిగా మారిపోయింది. చెన్నై నుంచి ముంబైకి అమ్మతో పాటు వచ్చేశాం.. మెర్సిడెస్ బెంజ్‌లో తిరిగిన నేను ముంబై లోకల్ ట్రైన్‌లో ప్రయాణించాను. లగ్జరీగా బతికా, కష్టాలు పడ్డాను.. అలా రెండు రకాల జీవితాలు చూశానని శృతి తెలిపారు.

కలిసి బతకలేనప్పుడు విడిపోవడమే
తల్లిదండ్రులు విడిపోవడం వల్ల బాధపడినప్పటికీ.. జీవితం ఎంతో విలువైన పాఠాన్ని నేర్పించింది. ఒక స్త్రీ ఆర్ధికంగా, మానసికంగా స్వతంత్రంగా ఉండాల్సిన అవసరం తెలిపింది. ఒకరంగా వాళ్లిద్దరూ విడిపోయినందుకు సంతోషించాను. ఎందుకంటే భార్యాభర్తలు కలిసి సంతోషంగా జీవించలేనప్పుడు.. బలవంతంగా ఒకే ఇంట్లో ఉండటం సరికాదు. ఇష్టం లేకుండా కలిసుండి బాధపడటం కంటే.. విడిపోయి సంతోషంగా ఉండటం మంచిదని నాకు అనిపించింది అని శృతిహాసన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

More from Filmibeat

Read more about: shruti haasan kamal haasan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X