twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్రుతిహాసన్ అసలు రంగు బయటపడింది.. లండన్‌లో దుమ్మురేపిన బ్యూటీ!

    |

    అందాల తార శృతిహాసన్ కొత్త అవతారం ఎత్తారు. ఇప్పటి వరకు వెండి తెర మీద జిగేల్ అనిపించిన ఈ సుందరి లండన్‌లో రాక్‌స్టార్‌గా మారిపోయి సంగీత ప్రియులను ఆకట్టుకొన్నారు. ఇటీవల లండన్‌లోని పాపులర్ రెస్టారెంట్‌లో ఆలపించిన పాప్ సాంగ్ ఆడియెన్స్‌ను ఊర్రూతలూగించింది. నటనకు దూరంగా ఉంటున్న ఈ బ్యూటీ లండన్ ప్రియుడితో కలిసి హంగామా చేస్తున్నారు. సరికొత్త అవతారాల్లో అభిమానులకు చేరువ కాబోతున్నారు.

    లండన్‌లో రాక్‌స్టార్‌గా శ్రుతిహాసన్

    లండన్‌లో రాక్‌స్టార్‌గా శ్రుతిహాసన్

    లండన్‌లో అత్యంత ప్రజాదరణ పొందిన రెస్టారెంట్ ఏదైనా ఉంటే అది ట్రాబడార్ రెస్టారెంట్. అక్కడి సంగీత ప్రియులకు, భోజన ప్రియులకు ఫేవరేట్ అడ్డా. ఆ రెస్టారెంట్‌లో ఓ బ్యాండ్ నిర్వహించిన సంగీత కచేరీలో శృతిహాసన్ రాక్‌స్టార్‌గా మారిపోయారు.

     త్వరలో సరికొత్త ఆల్బమ్ విడుదల

    త్వరలో సరికొత్త ఆల్బమ్ విడుదల

    ఇక సంగీత కచేరిలో శ్రుతీహాసన్ ఎవరో పాడిన పాటలు పాడారంటే పప్పులో కాలేసినట్టే. తాను సొంతంగా రూపొందించిన పాటలను స్వయంగా ఆలపించారట. త్వరలోనే తాను రూపొందించిన పాటలతో శ్రుతీహాసన్ ఓ ఆల్బమ్‌ను విడుదల చేయనున్నారు.

    <strong>ఇండియన్ ప్రియుడు దొరకలేదా?.. అందుకేనా విదేశీ భర్త.. శృతిహాసన్‌కు నెటిజన్ల ఝలక్!</strong>ఇండియన్ ప్రియుడు దొరకలేదా?.. అందుకేనా విదేశీ భర్త.. శృతిహాసన్‌కు నెటిజన్ల ఝలక్!

    మ్యూజిక్‌తో మ్యాజిక్ చేసిన..

    ప్రపంచ ప్రఖ్యాత లండన్ ట్రాబడార్ రెస్టారెంట్‌లో శ్రుతిహాసన్ లైవ్ ప్రదర్శన ఇచ్చారు. తన గొంతుతో మ్యాజిక్‌ను క్రియేట్ చేశారు. వేదికపై అద్భుతమైన పాటలు పాడి సంగీత ప్రియులను అల్లాడించారు. ఈ పాటలకు సంబంధించిన ఆల్బమ్ 2019లో జూన్, జూలైలో విడుదల చేస్తారంటూ సోషల్ మీడియాలో ఫ్యాన్స్ అకౌంట్ వెల్లడించింది. తన ఫ్యాన్స్ అకౌంట్ చేసిన పోస్టుపై స్పందించి థ్యాక్స్ చెప్పారు.

    టాక్‌ షోకు హోస్ట్‌గా శ్రుతి

    టాక్‌ షోకు హోస్ట్‌గా శ్రుతి

    యాక్టింగ్, రాక్‌స్టార్ గానే కాకుండా శ్రుతి హాసన్ మరో కొత్త అవతారం కూడా ఎత్తబోతున్నారు. హల్లో సాగో అనే టాక్ షోను కూడా నిర్వహించబోతున్నారు. ఈ టాక్ షోకు శ్రుతి హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. నటిగా ఆమె చివరి చిత్రం సింగం 3. ఆ తర్వాత ఏ సినిమాను అంగీకరించలేదు.

     లండన్ ప్రియుడి మైఖేల్‌తో డేటింగ్

    లండన్ ప్రియుడి మైఖేల్‌తో డేటింగ్

    సినిమాలకు దూరంగా ఉండటంతో శ్రుతిహాసన్ పెళ్లి వార్తలు గుప్పుమన్నాయి. గత కొద్దికాలంగా లండన్ ప్రియుడు మైఖేల్ కోర్సేల్‌తో డేటింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. దాంతో త్వరలోనే వారిద్దరూ పెళ్లి చేసుకొంటున్నారనే వార్తలకు పలు సంఘటనలు బలం చేకూర్చాయి.

    English summary
    hruti Haasan performed in a popular restaurant in London, which was well received by the audience there. Shruti took to Social media to share videos and pictures from the event. She is hosting a talk show called Hello Sago.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X