గ్లామర్ డోస్ పెంచేసిన శృతి హాసన్: ప్రియుడి కోసమే అవన్నీ చూపిస్తూ.. అతడి టాలెంట్‌కు ఫిదా అంటూ!

లెజెండరీ యాక్టర్ విశ్వనాయకుడు కమల్ హాసన్ గారాల పుత్రికగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది హాట్ బ్యూటీ శృతి హాసన్. అద్భుతమైన టాలెంట్‌తో పాటు ఆకట్టుకునే అందంతో చాలా తక్కువ సమయంలోనే విశేషమైన గుర్తింపుతో పాటు స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుందామె. ఈ క్రమంలోనే అన్ని భాషల్లోనూ వరుసగా సినిమాలు చేస్తూ దూసుకెళ్లిపోయింది. కెరీర్ పరంగా సక్సెస్‌ అయిన ఈ బ్యూటీ.. పర్సనల్ లైఫ్‌లో మాత్రం శాడ్ లవ్ స్టోరీతో ఇబ్బంది పడింది. ఇక, ఇప్పుడ మరొకరితో ప్రేమాయణం సాగిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రియుడి కోసం శృతి గ్లామర్ ట్రీట్ చేసింది. ఆ వివరాలు మీకోసం!

అన్నింట్లోనూ సత్తా... ఆల్‌రౌండర్‌గా

అన్నింట్లోనూ సత్తా... ఆల్‌రౌండర్‌గా

సినిమా నటిగా తన సత్తాను ప్రపంచానికి పరిచయం చేసుకుంది శృతి హాసన్. ఫలితంగా దక్షిణాది చిత్రాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలో సింగర్‌గా, ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్‌గానూ పేరు సంపాదించుకుంది. ఈ క్రమంలోనే ఎన్నో ఆల్బమ్‌లను క్రియేట్ చేసింది. ఫలితంగా ఆల్‌రౌండర్ అన్న పేరును తెచ్చుకుంది. దీంతో అమ్మడు వరుస ఆఫర్లను అందుకుంటోంది.

తెలుగులోనూ సక్సెస్.. రీఎంట్రీ ఇలా

తెలుగులోనూ సక్సెస్.. రీఎంట్రీ ఇలా

శృతి హాసన్ తెలుగులో ఎన్నో చిత్రాల్లో నటించింది. మరీ ముఖ్యంగా టాలీవుడ్ స్టార్ హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా ఎంతో మందితో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఆ మధ్య గ్యాప్ తీసుకున్న ఈ బ్యూటీ.. 'క్రాక్'తో రీఎంట్రీ ఇచ్చి సక్సెస్‌ను అందుకుంది. దీని తర్వాత 'వకీల్ సాబ్' కూడా హిట్టే. ఇప్పుడు ప్రభాస్‌తో 'సలార్‌'లో నటిస్తోంది.

అతడితో ప్రేమాయణం... బ్రేకప్ చెప్పి

అతడితో ప్రేమాయణం... బ్రేకప్ చెప్పి

కొన్నేళ్ల క్రితం శృతి హాసన్ ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో ప్రేమ‌లో ప‌డిన విషయం తెలిసిందే. అంతేకాదు.. అతడు క‌మ‌ల్‌ హాసన్‌తో క‌లిసి ఒక వేడుక‌లో కూడా పాల్గొన్నాడు. దీంతో తన కూతురి పెళ్లికి విశ్వనాయకుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అన్నారు. ఆ సమయంలోనే శృతి - మైకేల్ పెళ్లి జరగబోతుందని అంతా అనుకున్నారు. కానీ, ఊహించని విధంగా అతడికి బ్రేకప్ చెప్పింది.

మళ్లీ లవ్‌లో పడిపోయిన హీరోయిన్

మళ్లీ లవ్‌లో పడిపోయిన హీరోయిన్

మైకేల్ కోర్సలేతో బ్రేకప్ అయిపోయిన తర్వాత శృతి హాసన్ కెరీర్ మీద ఎక్కువగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోంది. ఇలాంటి సమయంలో ఈ కోలీవుడ్ బ్యూటీ మరోసారి ప్రేమలో పడిపోయింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించిన ఆమె.. ప్రియుడితో తిరుగుతూ దేశ వ్యాప్తంగా హైలైట్ అయింది.

అక్కడ ఏడాదిగా... కలిసే ఉంటోంది

అక్కడ ఏడాదిగా... కలిసే ఉంటోంది

శృతి హాసన్ ప్రస్తుతం శాంతను హజారికా అనే పెయింటింగ్ ఆర్టిస్టుతో ప్రేమాయణం సాగిస్తోంది. ఎంతో టాలెంట్ ఉన్న అతడు.. సరైన బ్రేక్ కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడతను ముంబైలో ఉంటున్నాడు. శృతి హాసన్ కూడా ఆ కుర్రాడితోనే కలిసి ఉంటున్నట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. ఏడాది కాలంగా వీళ్లిద్దరూ ప్రేమలో ఉన్నా.. ఇటీవలే ఈ విషయం ప్రపంచానికి తెలిసింది.

గ్లామర్ డోస్ పెంచేసిన శృతి హాసన్

గ్లామర్ డోస్ పెంచేసిన శృతి హాసన్


శృతి హాసన్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో భాగంగానే ఈ అమ్మడు ఎన్నో విషయాలను వెల్లడించడంతో పాటు తన ఫొటోలు, వీడియోలను సైతం వదులుతూ ఉంటోంది. ఈ క్రమంలోనే భారీ స్థాయిలో ఫాలోయింగ్‌ను సంపాదించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా శృతి గ్లామర్ డోస్ పెంచేసి మరీ హాట్ ఫొటోలను ఇన్‌స్టాలో షేర్ చేసింది.

Recommended Video

Captain Vijayakanth Biography, వడివేలు పై ఎందుకంత పగ ! || Filmibeat Telugu
ప్రియుడి కోసమే అవన్నీ చూపిస్తూ

ప్రియుడి కోసమే అవన్నీ చూపిస్తూ

శాంతను హజారికా వేసిన పెయింటింగ్స్‌కు పబ్లిసిటీ చేయడం కోసం.. వాటి ముందు శృతి హాసన్ అందాల విందు చేస్తోంది. ఇందుకోసం బుల్లిగౌను ధరించిన ఈ బ్యూటీ.. తన ప్రియుడి టాలెంట్‌ను అందరికీ చూపించడం కోసం ఈ ఫొటోలను వదిలింది. అందులో శాంతను ఫొటోను కూడా షేర్ చేసింది. ఇక, దీని కోసం ఓ కవితను కూడా రాసుకొచ్చిందామె. దీంతో ఇవి వైరల్ అవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X