నా పేరెంట్స్ వల్లే మద్యానికి బానిసయ్యా.. స్టార్ హీరో డాటర్ షాకింగ్ కామెంట్స్..!
Shruti Haasan: శ్రుతిహాసన్ .. విశ్వనటుడు కమలహాసన్ (Kamal Haasan) గారాల పట్టి. కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి, తనకంటూ ఓప్రత్యేక పాపులారిటీని సంపాదించుకుంది. ఈ అమ్ముడు కేవలం నటి మాత్రమే కాదు.. సింగర్‌గా కూడా మంచి గుర్తింపు ఉంది. స్టార్ హీరోయిన్‌గా శృతి హాసన్ తన కెరీర్ ను కొనసాగిస్తున్నా.. పర్సనల్ లైఫ్ లో మాత్రం ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కుంటుంది. తాజా తన తల్లిదండ్రులపై షాకింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నదంటే?
శృతి హాసన్ ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన తల్లిదండ్రులు కమల్ హాసన్, సారికల విడాకుల గురించి ప్రస్తావించింది. తన తల్లిదండ్రుల విడాకుల తరువాత, ఆర్థికంగా, స్వతంత్రంగా ఉండటం ఎలా అనేది అర్థం చేసుకున్నానని తెలిపారు. విడిపోయే ముందు తల్లిదండ్రులు కలిసి జీవించేందుకు ఎంతో ప్రయత్నించారని తెలిపారు. తల్లిదండ్రుల విడాకుల తర్వాత తన జీవితంలో అంతా మారిపోయిందని శృతి వాపోయింది.

శృతి హాసన్ ఇంకా మాట్లాడుతూ.. నేను చాలా అందమైన కుటుంబంలో పుట్టాను. తెలివైన తల్లిదండ్రులను పొందాను. భగవంతుని దయతో అన్ని సౌకర్యాలను పొందాను. కానీ, నేను దాని మరొక వైపు కూడా చూశాను. నా తల్లిదండ్రులు విడిపోయినప్పుడు, నా జీవితంలో ప్రతిదీ మారిపోయింది. నా తల్లిదండ్రులు విడిపోయిన తర్వాతే నాకు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండటం అంటే అర్థమైంది. ప్రతి ఒక్కరూ ఆర్థికంగా ఎందుకు స్వతంత్రంగా ఉండాలో.. ఆ క్షణంలో నేను గ్రహించాను. మా అమ్మ వైపు చూస్తే కూతురిగా ఆర్థికంగా స్వాతంత్ర్యం పొందాలని అనిపించింది. ఏదైనా నిర్ణయం తీసుకోవడం చాలా కష్టం, కానీ మీరు ఒకరిపై ఆధారపడినప్పుడు అది మరింత కష్టం' అంటూ ఎమోషనల్ అయ్యారు.
నటి శృతి హాసన్ ఇంకా మాట్లాడుతూ.. ' తన తల్లిదండ్రులు విడాకులు తీసుకోవడం చాలా తప్పుడు నిర్ణయమని శృతి హాసన్ అన్నారు. పిల్లలే కాదు తల్లిదండ్రులు కూడా ఆ బాధను అనుభవిస్తారనీ, అయితే, ఇప్పుడు పరిస్థితులు చాలా సాధారణమయ్యాయి. సమాజహితం కోసం తల్లిదండ్రులు కలిసి జీవించే ఇళ్లు ఇంకా చాలా ఉన్నాయనీ, ఇద్దరిలో కూడా బాధ ఉందనీ, అది దారుణమన్నారు. శృతి తన మద్యపానానికి తన తల్లిదండ్రులే కారణమంటూ షాకింగ్ స్టేట్ మెంట్ ఇచ్చింది.
తన తల్లిదండ్రులు విడాకులు తీసుకున్నప్పుడు తనకు 18 ఏళ్ల అనీ, ఇది బాల్యం నుండి యుక్తవయస్సుకు మారే సమయం. నా తల్లితండ్రులు విడిపోయినప్పుడు తాను చాలా కృంగిపోయాననీ, ఈ సంఘటన వల్ల తాను మద్యానికి బానిసయ్యాననీ, అలాగే డిప్రెషన్ కు గురయ్యానని శృతి తెలిపింది. ఆ సమయంలో తన మానసిక ఆరోగ్యం క్షీణించిందని వార్తలు వ్యాపించాయని అన్నారు. ఆ వార్త 100% నిజమేననీ, అయితే దీనికి కారణం ఏమిటనేది చాలామందికి తెలియలేదన్నారు. అందుకు ప్రధాన కారణం నా తల్లిదండ్రుల విడాకులు. ఆ ఘటన తన మనసుకు చాలా బాధ కలిగించిందని శ్రుతి చెప్పింది.

కమల్ హాసన్ 1984లో 'రాజ్ తిలక్' సినిమా షూటింగ్ సమయంలో నటి సారిక ను మొదటిసారి కలిశారు. మొదట ఇద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది. ఆ తర్వాత ఆ స్నేహం ప్రేమగా మారింది. ఆ తర్వాత వారిద్దరూ 1988లో పెళ్లి చేసుకున్నారు. అయితే పెళ్లికి రెండేళ్ల ముందు సారిక కూతురు శృతికి జన్మనిచ్చింది. పెళ్లికి ముందు కమల్ హాసన్ తో లివ్ ఇన్ రిలేషన్ షిప్ లో ఉన్నారు. ఇద్దరికీ ఇద్దరు కూతుళ్లు శృతి, అక్షర హాసన్. అయితే.. 2004లో కమల్ హాసన్- సారిక లు విడాకులు తీసుకున్నారు. విడాకుల తర్వాత సారిక టీవీ ప్రపంచంలోకి అడుగుపెట్టింది.
ఇక శ్రుతి హాసన్ వర్క్ ఫ్రంట్ గురించి మాట్లాడుతూ.. శృతి హాసన్ చివరిగా 'సాలార్ పార్ట్ 1, లో కల్పించారు. ఈ సినిమాలో ప్రభాస్‌తో కలిసి కనిపించింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా నటించారు. ప్రస్తుతం రజనీకాంత్ నటిస్తున్న కూలీ, సాలార్ పార్ట్ 2 సినిమాలతో నటిస్తున్నారు.


Click it and Unblock the Notifications











