ప్రియుడి బండారం బయటపెట్టిన శృతి హాసన్: ఎప్పుడూ అదే కావాలంటూ పరువు తీసేసింది!
గతంతో పోలిస్తే ఈ మధ్య కాలంలోనే సినిమాల్లోకి వారసులు ఎక్కువగా ఎంట్రీ ఇస్తున్నారు. అందులో ఎక్కువ మంది అబ్బాయిలే ఉండగా.. కొందరు మాత్రమే అమ్మాయిలు ఉంటున్నారు. అందులో విశ్వనాయకుడు కమల్ హాసన్ గారాల కూతురు శృతి హాసన్ ఒకరు. చిన్న వయసులోనే తన సత్తాను ప్రపంచానికి చూపించుకున్న ఈ భామ.. ఆ తర్వాత హీరోయిన్‌గా పరిచయం అయింది. అందానికి అందం.. నటనకు నటనతో ప్రేక్షకులను ఫిదా చేస్తోన్న ఈ సుందరాంగి.. వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా గడుపుతోంది. అదే సమయంలోనే ప్రియుడితో తెగ ఎంజాయ్ చేస్తూ రచ్చ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా సోషల్ మీడియా ద్వారా అతడి బండారం బయట పెట్టింది. అసలేం జరిగిందో మీరూ చూడండి!

టీనేజ్‌లో ఎంట్రీ.. హీరోయిన్‌గా
శృతి హాసన్ టీనేజ్‌లోనే సింగర్‌గా తన ప్రయాణాన్ని మొదలెట్టింది. ఆ తర్వాత సొంతంగా కొన్ని ఆల్బమ్‌లను కూడా క్రియేట్ చేసింది. ఈ క్రమంలోనే 2000లో వచ్చిన 'హే రామ్' అనే చిత్రంలో చిన్న రోల్ చేసింది. అనంతరం 'లక్' అనే హిందీ సినిమాలో ముఖ్యమైన పాత్రను పోషించింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు'తో హీరోయిన్‌గానూ పరిచయమైంది.

టాలీవుడ్ స్టార్.. మళ్లీ సందడి
స్టార్ డాటర్‌గా టాలీవుడ్‌లోకి అడుగెట్టిన శృతి హాసన్.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే బడా హీరోలు అందరితోనూ ఆడిపాడింది. ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే చాలా కాలం గ్యాప్ తీసుకుని 'క్రాక్' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'వకీల్ సాబ్'లోనూ మెరిసింది. ఇక, ఇప్పుడు ప్రభాస్‌తో 'సలార్' అనే సినిమాలో నటిస్తోంది.

బ్రేకప్ వెంటనే లవ్ ట్రాక్ స్టార్ట్
శృతి హాసన్ వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే ఇంగ్లండ్ గాయకుడు మైకేల్ కోర్సలేతో డేటింగ్ చేసింది. అంతేకాదు.. అతడితో పెళ్లికి కమల్ కూడా ఒప్పుకున్నాడని ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా శృతి అతడితో విడిపోయింది. ఇక, మైకేల్‌తో బ్రేకప్ తర్వాత వెంటనే ఈ బ్యూటీ శాంతను హజారికా అనే డూడుల్ ఆర్టిస్టుతో లవ్ ట్రాక్‌ను మొదలెట్టింది.

పెళ్లికి ముందే ఒకేచోట ఉంటూ
రీఎంట్రీలో శృతి హాసన్ కెరీర్ మీద ఎక్కువగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే అన్ని భాషల్లోనూ వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోంది. ఇలాంటి సమయంలో ఈ హాట్ బ్యూటీ శాంతను హజారికాతో ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుండానే ముంబైలో ఒకే ఇంట్లో కలిసి ఉంటూ తరచూ యమ రచ్చ రచ్చ చేస్తున్నారు.

అందులో మాత్రం ఫుల్ బిజీగా
వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ తనను ఫాలో అయ్యే వారి సంఖ్యను పెంచుకుంటోంది.

హాట్ ఫొటోలతో రచ్చ చేస్తోంది
సోషల్ మీడియాలో రచ్చ చేస్తోన్న శృతి హాసన్.. ఎక్కువగా హాట్ హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. అంతేకాదు, ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న పిక్స్, క్లిప్స్‌ను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. అదే సమయంలో తన గ్లామర్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌ను ఊపుతోంది. ఇలా ఈ మధ్య నిత్యం వార్తల్లోనే ఉంటోంది.

లవర్ బండారం బయటపెట్టి
లవర్‌తో కలిసి ఎంజాయ్ చేస్తోన్న శృతి హాసన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ ఫొటోను షేర్ చేసింది. ఇందులో ఆమె.. తన ప్రియుడు ఫోన్ మాట్లాడుతున్నది చూపించింది. 'శాంతను ఎప్పుడూ ఫోన్‌తోనే ఉంటాడు' అని అందులో పేర్కొంది. అంతేకాదు, 'అసలు నేనంటే నీకు ఇష్టమేనా' అని ప్రశ్న కూడా అడిగింది. ఇప్పుడీ స్క్రీన్ షాట్లు విపరీతంగా వైరల్ అవుతున్నాయి.


Click it and Unblock the Notifications











