6 గురు లవర్స్‌తో 6 సార్లు మోసపోయా.. నా లైఫ్‌తో సిగ్గులేకుండా.. శృతిహాసన్ ఎమోషనల్

శ్రుతి హాసన్‌ (Shruti Haasan) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బహుభాషా నటి మాత్రమే కాదు, గాయని, మ్యూజిషియన్‌గా కూడా తన ప్రతిభను చాటుకున్న బహుముఖ ప్రజ్ఞాశాలి. ప్రముఖ నటుడు కమల్ హాసన్, నటి సారిక కుమార్తెగా సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టిన ఆమె, మొదట్లో వరుస ఫ్లాప్స్‌తో కెరీర్‌లో కష్టాలు ఎదుర్కొంది. కానీ ఆ తర్వాత వరుస విజయాలతో అగ్రహీరోయిన్‌గా నిలదొక్కుకుంది.

సినిమాల పరంగా ఎంత బిజీగా ఉన్నా, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలు కూడా ఆమెను ఎప్పుడూ వార్తల్లో నిలిపాయి. ముఖ్యంగా ప్రేమ వ్యవహారాలు, బ్రేక్‌ప్స్ గురించి ఎలాంటి సంకోచం లేకుండా ఓపెన్‌గా మాట్లాడటం ఆమె ప్రత్యేకత. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన గత రిలేషన్‌షిప్స్ గురించి మాట్లాడిన శ్రుతి, వాటి నుంచి నేర్చుకున్న పాఠాలు, ఎదురైన అనుభవాలను నిజాయితీగా పంచుకుంది. ఆమె చెప్పిన ఈ వ్యాఖ్యలు మరోసారి సోషల్ మీడియాలో చర్చకు దారితీశాయి. ఇంతకీ ఏమన్నారంటే?

Shruti Haasan Reveals 6 Heartbreaks Chooses Single Life After Painful Love

శ్రుతి హాసన్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. తన జీవితంలో ఇప్పటివరకు మొత్తం ఆరుగురు బాయ్‌ఫ్రెండ్స్ ఉన్నారని తెలిపింది. అయితే అందులో అత్యంత బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఆరుగురూ ఒక్కో విధంగా తనను హార్ట్ చేశాయనీ, తన హృదయాన్ని గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. 'ప్రతి రిలేషన్‌షిప్‌లో నేను పూర్తిగా నమ్మకం పెట్టాను. కానీ ఒక్కోసారి ఒక్కో విధంగా ఆ నమ్మకం చిద్రమైంది' అంటూ ఆమె తన ఆవేదనను వ్యక్తం చేసింది.

కొందరు ఆమె విశ్వాసాన్ని మోసం చేయగా, మరికొందరు మధ్యలోనే సంబంధాన్ని ముగించారని, ఇంకొందరు తన భావాలను అర్థం చేసుకోలేకపోయారని చెప్పింది. ప్రేమ అంటే ఆనందం, ఆప్యాయత, అండగా ఉండటం అనుకుంటాం. కానీ తన అనుభవాల్లో మాత్రం ప్రేమ ఎక్కువగా బాధనే మిగిల్చిందని శ్రుతి హాసన్ తెలిపింది. 'ఎవరినైనా మనస్పూర్తిగా నమ్మి ముందుకు వెళ్లినప్పుడు, ఆ వ్యక్తి మన భావాలను గౌరవించకపోతే అది చాలా పెద్ద గాయం అవుతుంది' అని ఆమె చెప్పింది. ఈ వరుస అనుభవాలు ఆమెను మానసికంగా కూడా ప్రభావితం చేశాయని, ప్రతి బ్రేకప్ తనలో మరింత నిరాశను పెంచిందని వెల్లడించింది.

ఈ నేపధ్యంలోనే శ్రుతి హాసన్ ఒక కీలక నిర్ణయం తీసుకుందట. ఇకపై రిలేషన్‌షిప్స్‌ అవసరం లేదని, ఒంటరిగా ఉండడమే తనకు సరైన మార్గమని భావిస్తున్నట్లు తెలిపింది. 'ఇప్పటి నుంచి నేను సింగిల్‌గా ఉండి నా జీవితాన్ని సంతోషంగా గడపాలని అనుకుంటున్నాను. ఇప్పుడు అదే నాకు శాంతి, అదే నాకు ఆనందం' అని తెలిపింది. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అభిమానులు విభిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

కొందరు శ్రుతి హాసన్ ధైర్యాన్ని అభినందిస్తూ, నిజాన్ని బహిరంగంగా చెప్పడం గొప్ప విషయమని అంటుంటే, మరికొందరు గత అనుభవాల ఆధారంగా ప్రేమను పూర్తిగా తిరస్కరించడం సరైంది కాదని అభిప్రాయపడుతున్నారు. 'ప్రేమలో విఫలం అవడం సహజం... సరైన వ్యక్తి జీవితంలోకి వచ్చే వరకు ఎదురు చూడాలి' అనే కామెంట్లు కూడా కనిపిస్తున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X