పెళ్లి చేసుకోవాలనే ఆలోచన లేదు. కానీ, అలా ఉండటం చాలా ఇష్టం
Shruti Haasan: కోలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతి హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. అనతి కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి, తనకంటూ ఓప్రత్యేక పాపులారిటీని సంపాదించుకుంది. ఈ అమ్ముడు కేవలం నటి మాత్రమే కాదు.. సింగర్‌గా కూడా మంచి గుర్తింపు ఉంది. స్టార్ హీరోయిన్‌గా ఎక్కువ కాలం కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ పర్సనల్ లైఫ్ మాత్రం గాడి తప్పింది. ఆమె తన వ్యక్తి గత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కుంటుంది.
వరుస సినిమాలతో బిజీగా ఉన్న సమయంలోనే మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. కొన్నాళ్లు వీరి రిలేషన్ బాగానే సాగిన 2019లో తెరపడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలేకు శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది. ఆ తరువాత ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతి మరోసారి ప్రేమలో పడింది. ఈ అబ్బాయితో రెండేళ్లు డేటింగ్ నడిపిన శ్రుతి ఇటీవలే అతనికి కూడా బ్రేకప్ చెప్పింది.

ప్రతి విషయాన్ని సోషల్ మీడియాలో షేర్ చేస్తే శృతిహాసన్ ఈ విషయాన్ని కూడా ఇన్ డైరెక్టుగా తన తన అభిమానులకు చెప్పేసింది. వీరిద్దరి మధ్య ఏం జరిగిందో మాత్రం తెలియరాకుంది. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ తన డేటింగ్ సమయంలో తన కోపార్టనర్ వ్యవహరించిన తీరు గురించి కామెంట్స్ చేస్తూ వార్తల్లో నిలిచింది. తానే ఎప్పుడు బిల్ పేమెంట్ చేసేదాన్ని నా దగ్గర డబ్బులు ఉంటాయనీ, కట్టుమని ఆర్డర్ వేసేవారు అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్ చేసింది. మొదట్లో ఎవరు అడిగిన తాను బిల్ కట్టే దాని .. కానీ, బిల్ పేమెంట్ చేయడం కూడా ఎదుటివారిపై ఉన్న ప్రేమను చూపిస్తుందని, తన అనుకునేదాన్ని కానీ అడ్వాంటేజ్ గా తీసుకుని తనని ఆడుకునేవారని షాకింగ్ కామెంట్స్ చేసింది.
ఇదిలా ఉంటే తాజాగా శృతిహాసన్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. పెళ్లి గురించి ప్రశ్నించగా వివాహ బంధం పై తన నిర్ణయాన్ని వెల్లడించింది. తనకు ప్రస్తుతం మ్యారేజ్ చేసుకోవడం ఇష్టం లేదని, ఆ నిర్ణయం తీసుకోవడానికి కారణమేంటో కూడా తెలియజేస్తూ ఓ క్లారిటీ ఇచ్చింది. జీవితం అనేది ఎప్పుడూ ఒకేలాగా ఉండదని ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. అయితే.. తాను ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ద్రుష్ట్యా పెళ్లి చేసుకోవద్దని భావిస్తున్నానని, కానీ ఎప్పటికీ ఇలానే ఉంటుందని తాను కచ్చితంగా చెప్పలేనని అన్నారు.
కానీ, ప్రస్తుతానికి మాత్రం పెళ్లి చేసుకునే ఉద్దేశం లేదని, భవిష్యత్తులో ఎవరైనా తన మనసుకు దగ్గర అయితే .. తప్పకుండా పెళ్లి చేసుకుంటానని, తాను రిలేషన్ లో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడతానని చెప్పుకొచ్చింది. ప్రేమ పెళ్లి అనేది తన వ్యక్తిగతమని, స్నేహితులు, బంధువులు ఎంతోమంది పెళ్లి తర్వాత చాలా సంతోషంగా ఉన్నారంటూ పెళ్లి పై క్లారిటీ ఇచ్చింది శృతి హాసన్.

శృతిహాసన్ పెళ్లి గురించి ప్రేమ గురించి మాట్లాడడం ఇదే తొలిసారి ఏమీ కాదు. ఇప్పటికే పలు ఇంటర్వ్యూలలో, పలు షో లలో ప్రేమ పెళ్లి పై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. తనకు ఇలాంటి ప్రశ్నలు నచ్చవని, కానీ, మీరు అడుగుతున్నారు కాబట్టి చెబుతున్నాను అంటూ ఇప్పుడు తాను సింగిల్ గానే ఉన్నానని, రిలేషన్ కోసం ఎదురు చూస్తున్నానని చెప్పేసింది. అయితే ప్రస్తుతం తాను తన కెరీర్ పై ఫోకస్ చేస్తున్నారని, వర్కులలో బిజీగా ఉంటూ లైఫ్ ను ఎంజాయ్ చేస్తున్నారని పలుమార్లు క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసింది.
ఇదిలా ఉంటే శృతిహాసన్ సినిమాల విషయానికొస్తే రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న కూలి సినిమాలో శృతిహాసన్ ఓ మెయిన్రోల్లో నటించబోతున్నట్లు సమాచారం. దీంతోపాటు సలార్ సీక్వెల్ గా రానున్న 'సలార్ శౌర్యంగపర్వం' లో శృతిహాసన్ నటించిన బోతున్నారు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుంది. ఇదిలా ఉంటే అడవి శేషు హీరోగా తెరకెక్కబోతున్న 'డకాయిట్' అనే సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా సెలెక్ట్ చేశారు. కానీ పలు కారణాల వల్ల ఆమె స్థానంలో మృణాల్ ఠాగూర్ తీసుకున్నట్లు మూవీ మేకర్స్ ప్రకటించిన విషయం తెలిసిందే.


Click it and Unblock the Notifications











