లవర్‌తో కలిసి రెచ్చిపోయిన శృతి హాసన్: నైట్ టైమ్ అతడితో యమ హాట్‌గా!
సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు పరిచయం అవుతున్నారు. ఇందులో అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు చాలా తక్కువ మందే వస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చి.. చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది హాట్ బ్యూటీ శృతి హాసన్. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో శృతి తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. కెరీర్ పరంగా మాంచి ఫామ్‌లో ఉన్న ఈ చిన్నది.. పర్సనల్ లైఫ్‌ను కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే శాంతను హజారికా అనే కుర్రాడితో డేటింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అతడితో కలిసి తీసుకున్న రొమాంటిక్ వీడియోను షేర్ చేసింది. దాన్ని మీరూ చూసేయండి మరి!

స్టార్ డాటర్.. ఫుల్ పాపులర్
విశ్వనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. శృతి హాసన్ చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో అందరినీ ఫిదా చేసింది. నటిగానే కాదు.. సింగర్‌గానూ సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ వరుస పెట్టి ఎన్నో ఆల్బమ్‌లను కూడా క్రియేట్ చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయింది.

తెలుగులో స్టార్ హీరోయిన్
తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ శృతి హాసన్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే బడా హీరోలు అందరితోనూ ఆడిపాడింది. తద్వారా టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్ అనే పేరుకు కూడా సంపాదించుకుంది. ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే చాలా కాలం గ్యాప్ తీసుకుని 'క్రాక్' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'వకీల్ సాబ్'లోనూ నటించింది.

రీఎంట్రీలో బిజీగా మారింది
తెలుగులోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత శృతి హాసన్ మరింత బిజీగా మారిపోయింది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తోన్న 'సలార్' మూవీలో నటిస్తోన్న ఈ సుందరాంగి.. మరిన్ని ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకుంది. ఇందులో భాగంగానే బాలయ్య - గోపీచంద్ సినిమాలో భాగం అయింది. అలాగే, శృతి చిరంజీవి - బాబీ సినిమాలోనూ హీరోయిన్‌గా చేస్తోంది.

లవ్ ట్రాక్‌లు.. అతడికి బైబై
కెరీర్ పరంగా ఎంతటి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుందో.. లవ్ ట్రాకుల వల్ల కూడా శృతి హాసన్ అంతే ఫేమస్ అయింది. గతంలో ఇంగ్లండ్ గాయకుడు మైకేల్ కోర్సలేతో ఆమె చాలా కాలం పాటు డేటింగ్ చేసింది. అంతేకాదు.. అతడితో పెళ్లికి కమల్ కూడా ఒప్పుకున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, ఊహించని విధంగా శృతి అతడి నుంచి విడిపోయిన సంగతి తెలిసిందే.

ఆర్టిస్టుతో ప్రేమలో బ్యూటీ
మైకేల్‌తో విడిపోయిన వెంటనే శృతి హాసన్.. శాంతను హజారికా అనే డూడుల్ ఆర్టిస్టుతో లవ్ ట్రాక్‌ను మొదలెట్టింది. అతడితో ప్రేమ గురించి బహిరంగంగానే ప్రకటించిన ఈ సుందరాంగి.. ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుండానే ముంబైలో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. అలాగే, పబ్బులు, పార్టీలు ఇలా తెగ ఎంజాయ్ చేసేస్తున్నారు.
ఎప్పుడూ అతడి గురించే
వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. సోషల్ మీడియాలోనూ శృతి హాసన్ ఎంతో యాక్టివ్‌గా గడుపుతోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్ సంబంధిత విశేషాలను కూడా వెల్లడిస్తోంది. మరీ ముఖ్యంగా తన ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేసుకుంటోంది. ఫలితంగా వీళ్లిద్దరి లవ్ ట్రాక్ దేశ వ్యాప్తంగా తెగ హైలైట్ అయిపోతూనే ఉంది.

రాత్రి పూట రొమాంటిక్‌గా
సోషల్ మీడియాలో తెగ సందడి చేసే శృతి హాసన్.. తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ డ్యాన్స్ వీడియోను షేర్ చేసింది. ఇందులో ఆమెతో పాటు బాయ్‌ఫ్రెండ్ శాంతను కూడా ఉన్నాడు. వీళ్లిద్దరూ విచిత్రమైన హాట్ స్టెప్పులతో రెచ్చిపోయారు. ఒక సందర్భంలో శాంతను చూసిన చూపులు షాకింగ్‌గా ఉన్నాయి. మొత్తానికి ఈ వీడియోకు భారీ రెస్పాన్స్ వచ్చి తెగ వైరల్ అవుతోంది.


Click it and Unblock the Notifications











