కొత్త ప్రియుడితో శృతిహాసన్ చిల్లింగ్ సీన్స్.. కౌగిలింతలతో హల్‌చల్

అందాల తార శృతిహాసన్ డేటింగ్ వ్యవహారం ముదిరి పాకాన పడుతున్నట్టు కనిపిస్తున్నది. వరుస బ్రేకప్‌ల తర్వాత శృతి హాసన్ మరోసారి ప్రేమలో పడిందనే విషయం తాజా ఘటనతో స్పష్టమైంది. ముంబైకి చెందిన ఆర్టిస్టు శంతను హజారికాతో కలిసి చెన్నైలో చేసిన హంగామా ఇప్పుడు సినీ వర్గాల్లో చర్చనీయాంశమవుతున్నది. ఆ వివరాల్లోకి వెళితే...

శృతిహాసన్ తన బంధాన్ని గుట్టుగా

శృతిహాసన్ తన బంధాన్ని గుట్టుగా

ఇప్పటి వరకు గుట్టుగా సాగిన శృతి ప్రేమ వ్యవహారం ఇప్పుడు బహిర్గతమైంది. శనివారం రోజున తన ప్రియుడు శంతనుతో కలిసి చెన్నైలో విహారం చేసింది. చెన్నైలోని తన నివాసంలో తండ్రి కమల్ హాసన్‌ను శంతనుతో కలిసింది. ఆ సందర్భంగా శంతను ఆర్ట్ వర్క్‌ను ప్రశంసించారు.

 కమల్ హాసన్‌కు శంతను రేర్ గిఫ్ట్

కమల్ హాసన్‌కు శంతను రేర్ గిఫ్ట్

రాజకీయ పార్టీ వ్యవహారాల్లో బిజీగా ఉన్న కమల్ హాసన్‌కు శంతను హజారికా అపురూపమైన గిఫ్టును బహుకరించారు. తమిళ రాజకీయ ప్రక్షాళన కోసం బయలు దేరిన కమల్‌ ఓ చేతిలో గొడ్డలి, మరో చేతిలో టార్చ్ లైట్‌ను పట్టుకొని నడిచి వస్తున్న ఫోటోను గీసి బహుకరించారు. తనకు అరుదైన బహుమతిని ఇచ్చిన శంతనకు కమల్ హాసన్ థ్యాంక్స్ చెప్పారు. ఆ తర్వాత కమల్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో ఆ ఫోటోను పోస్టు చేశారు.

ఒకే డిజైన్ ఉన్న మాస్కులతో హంగామా

ఒకే డిజైన్ ఉన్న మాస్కులతో హంగామా

ఇదిలా ఉండగా చెన్నైలో తన ప్రియుడు శంతను హజారికాతో కలిసి హంగామా చేసింది. ప్రేమగా కౌగిలించుకొని సన్నిహితంగా ఫోటోలకు ఫోజిచ్చింది. ఒకే డిజైన్ ఉన్న మాస్క్‌ను ధరించి కెమెరాకు ఫోజిచ్చిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. దీంతో చాటుమాటుగా సాగిన అఫైర్‌ ఇప్పుడు అఫీషియల్ అయిపోయింది.

చెన్నైలో చిల్లింగ్ సీన్స్

చెన్నైలో చిల్లింగ్ సీన్స్

శంతనుతో ఉన్న ఫోటోలను శృతిహాసన్ తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేసింది. శంతనను గట్టిగా వాటేసుకొన్న శృతి తన ఫోటోలకు చెన్నైలో చిల్లింగ్ సీన్స్ అంటూ కాప్షన్ పెట్టింది. ఒకరి ఒడిలో మరొకరు చేరిన ఫోటోలపై నెటిజన్లు మిశ్రమంగా స్పందించారు. దీంతో శృతిహాసన్ అఫైర్ వ్యవహారంపై స్పష్టమైన ఓ అవగాహన కలుగుతుంది.

శృతి బంధంపై కమల్ సంతృప్తికరంగా

శృతి బంధంపై కమల్ సంతృప్తికరంగా

శంతనుతో శృతి హాసన్ బంధంపై తండ్రి కమల్ హాసన్‌ కూడా సంతృప్తికరంగా ఉన్నట్టు సమాచారం. తన తండ్రికి శంతనును పరిచయం చేసి తమ రిలేషన్ గురించి స్పష్టత ఇచ్చినట్టు సమాచారం. ఆ తర్వాత కమల్ హాసన్‌తో కలిసి దిగిన సెల్ఫీ ఫోటోను శృతిహాసన్ తన ఇన్స్‌టాలో షేర్ చేసింది.


.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X