కరోనాను ఎదిరించే మాస్క్.. శృతిహాసన్ చేసిన డిజైన్ చూస్తే థ్రిల్ అవ్వాల్సిందే!
కరోనావైరస్ లాక్‌డౌన్‌లో తనకు ఇష్టమైన రకరకాల పనులు, డిజైన్లతో అందాల భామ శృతిహాసన్ హడావిడి ఎక్కుగానే కనిపించింది. వంటలు చేస్తూ.. ఇంటి పనుల్లో నిమగ్నమైన ఈ బ్యూటీ 100 రోజులపాటు తనకు తాను బిజీగా మారిపోయారు. ఇంటిలోనే ఉంటూ తన సృజనాత్మక శక్తితో కొత్త అలవాట్లను అభిరుచిగా మార్చుకొన్నారు. కరోనా భయంతో అల్లాడిపోతున్న సమయంలో ఈ టాలెంటెడ్ హీరోయిన్ సొంతంగా ఓ అందమైన మాస్క్‌ను తయారు చేసుకొని ఆకట్టుకొన్నది. ఆ మాస్క్ ఎలా ఉందో మీరే చూడండి..

కరోనా భయం గుప్పిట్లో
ప్రస్తుతం ప్రపంచమంతా కరోనా భయం గుప్పిట్లో చిక్కుకొన్నది. కరోనావైరస్ బారిన పడకుండా ఎవరికి వారు తమకు తోచిన విధంగా ముఖాన్ని కప్పేసుకొంటున్నారు. కర్ఛిఫ్స్, క్లాత్‌తో స్వంతంగా మాస్క్‌లు చేసుకొని ప్రాణాంతక వ్యాధి బారి నుంచి తప్పించుకొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో మాస్క్ అవశ్యకతను చెప్పుతూ అందంగా ఉండే మాస్క్‌ను తయారు చేసి శృతి హాసన్ ఆకట్టుకొన్నారు.

స్వయంగా మాస్క్‌లు తయారు చేసే పనిలో
శృతిహాసన్ కరోనా ప్రొటెక్షన్ మాస్క్ తయారు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా స్వయంగా తాను మాస్కులను తయారు చేసుకొని అందరికీ స్పూర్తిగా నిలిచారు. తప్పనిసరిగా మాస్క్ ధరించండి. మీ కోసం మీరు జాగ్రత్త పడండి. ఓ ప్రయోగం చేసి నా కోసం ఓ మాస్క్ తయారు చేసుకొన్నాను అంటూ గతంలో ఓ ఫోటోను షేర్ చేశారు.

నల్లటి వస్త్రంపై సీతాకోక చిలుక బొమ్మలతో
శృతి హాసన్ తాను స్వయంగా డిజైన్ చేసుకొన్న మాస్క్‌ను ఆకట్టుకొనే విధంగా నల్లటి వస్త్రంతో తయారు చేశారు. దానికి సీతాకోక చిలుకల బొమ్మలు కుట్టి మరింత ఆకర్షణీయంగా చేశారు. ఆ మాస్క్‌ను ధరించి సెల్ఫీకి ఫోజిచ్చారు. ఆ ఫోటోను తన ఇన్స్‌టాగ్రామ్‌లో పోస్టు చేయగా మంచి స్పందన కనిపించింది.

శృతి మాస్క్ ఫుల్ రెస్సాన్స్
తన మాస్క్ గురించి క్రేజీగా శృతిహాసన్ ఇన్స్‌టాలో కామెంట్ పెట్టారు. మాస్క్‌పై సీతాకోక చిలుకలు ఎందుకు పెట్టానంటే అంటూ వివరణ ఇచ్చారు. అందంగా కనిపించడానికి నా మాస్క్‌కు అలాంటివి అవసరం అంటూ కామెంట్ చేసి సీతాకోక చిలుక బోమ్మలు, లవ్ సింబల్స్ ఇమోజీలతో కామెంట్ చేశారు. ఈ పోస్టుకు 1.6 లక్షల మంది లైక్ చేయగా, సుమారు 700 మంది కామెంట్స్ చేశారు.
Recommended Video

శృతిహాసన్ కెరీర్ ఇలా...
ఇక శృతిహాసన్ కెరీర్ విషయానికి వస్తే.. ప్రస్తుతం తెలుగులో రవితేజతో క్రాక్ అనే సినిమాలో నటిస్తున్నారు. వాస్తవానికి ఈ సినిమా రిలీజ్ కావాల్సింది. కరోనా కారణంగా రిలీజ్ వాయిదా పడింది. అంతేకాకుండా లాభమ్ అనే తమిళ సినిమాలో నటిస్తున్నారు. విజయ్ సేతుపతి నటిస్తున్న ఈ చిత్రానికి ఎస్పీ జనార్ధన్ దర్శకత్వం వహిస్తున్నారు.


Click it and Unblock the Notifications











