ముడతలు పడిన ముఖంతో శృతిహాసన్.. సోషల్ మీడియాలో వైరల్ పిక్
టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతూనే సరికొత్త సదుపాయాలను అందుబాటులోకి తెస్తోంది. ముఖ్యంగా స్మార్ట్ ఫోన్ అందుబాటులోకి వచ్చాక ఎన్నో ఆశ్చర్యపరిచే ఫీచర్స్ ఆకట్టుకుంటున్నాయి. ప్రపంచాన్నే చుట్ట చుట్టి మొబైల్ లో చూపిస్తున్న నేటి సమాజంలో సరికొత్తగా వస్తున్న కొన్ని యాప్స్ భవిష్యత్ లో మనిషి ఎలా ఉంటాడో ఆ రూపాన్ని సైతం కళ్ల ముందుంచుతున్నాయి. ఈ కోవలోనే మార్కెట్ లో 'ఫేస్‌యాప్' పేరుతో ఒక యాప్ అందుబాటులోకి వచ్చి ట్రెండింగ్ అవుతోంది.
ఇందులో ప్రస్తుత ఫొటో ఎంటర్ చేశామంటే చాలు.. ముసలితనం వచ్చాక ఎలా ఉంటామనేది చూపిస్తుంది. దీంతో సాధారణ జనం మొదలుకొని సెలబ్రిటీల వరకూ ఈ యాప్ ఉపయోగించి తమ తమ ఓల్డేజ్ లుక్స్ చూసుకుంటున్నారు. పైగా వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తుండటంతో ప్రస్తుతం సెలెబ్రిటీల ఓల్డేజ్ లుక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇప్పటికే మహేష్ బాబు, ఎన్టీఆర్, సోనమ్ కపూర్, వరుణ్ ధావన్ లాంటి స్టార్స్ తమ ఓల్డేజ్ లుక్స్ అభిమానులతో పంచుకోగా తాజాగా శృతి హాసన్ కూడా తన ఓల్డేజ్ లుక్ షేర్ చేసింది. ఇందులో ముడతలు పడిన ముఖంతో కనిపిస్తోంది శృతి హాసన్.

తన ఇన్స్‌స్టాగ్రామ్ లో ఈ పిక్ చేసిన శృతి హాసన్.. తన ఓల్డేజ్ ఫీలింగ్ లోకి వెళ్ళిపోయి సందేశం ఇవ్వడం విశేషం. ''నా లైఫ్ ని ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకుంటే ఆ అందమైన జీవితానికి కృతజ్ఞతలు చెప్పాలనిపిస్తుంది. ప్రస్తుతం పది మంది మనవళ్ళు మనవరాళ్ళతో సంతోషంగా ఉంది. కానీ ఇప్పుడు కూడా ఇలా యంగ్ లుక్ లో ఎలా ఉన్నావని అడిగితే మాత్రం నా ఆన్సర్ ఒక్కటే. హెవీ మెటల్ మ్యూజిక్ కు ఎక్సర్ సైజ్ చేయడం.. గ్లూటెన్ ఫ్రీ బ్రెడ్ తినడం'' అని క్యాప్షన్ ఇచ్చింది శృతి.
ప్రియుడితో బ్రేకప్ చేసుకొని ఇటీవలే సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన శృతిహాసన్ 'లాభం' అనే ప్రాజెక్టులో భాగమైంది. విజయ్ సేతుపతి హీరోగా ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. దీంతో పాటు హిందీలో 'పవర్', తెలుగులో రవితేజ సరసన మరో సినిమాలో ఆమె నటించనుందని సమాచారం.


Click it and Unblock the Notifications











