twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    ప్రియుడితో శృతిహాసన్ ఫుల్ రొమాంటిక్.. డేటింగ్, అఫైర్‌పై బాయ్‌ఫ్రెండ్ క్లారిటీ

    |

    అందాల భామ శృతిహాసన్ తన కెరీర్ పరంగా కాకుండా అఫైర్లతోనే ఎక్కువగా మీడియాలో నానుతుంటారు. గతంలో అనేక అఫర్లతో మీడియా వార్తల్లో నిలిచిన ఈ బ్యూటీ ఇప్పుడు కొత్త అఫైర్‌తో ముంబై మీడియాను ఫుల్లుగా ఆకర్షిస్తున్నారు. వాలంటైన్ డేకు ముందు బిజీ రోడ్డును దాటుతూ మీడియాకు చిక్కారు. తాజాగా తన ప్రియుడి శంతను హజారికాతో వాలంటైన్ డేను మంచి జోష్‌తో జరుపుకొన్నారు. ఆ విషయాలు గురించి శంతను వెల్లడిస్తూ...

    మైఖేల్ కోర్సలేతో అఫైర్

    మైఖేల్ కోర్సలేతో అఫైర్

    గతంలో హీరో సిద్దార్థ్, ఆ తర్వాత లండన్‌కు చెందిన ర్యాక్ బ్యాండ్ ప్రొఫెషనల్ మైఖేల్ కోర్సలేతో పీకల్లోతు ప్రేమలో మునిగినట్టు వార్తలు వచ్చాయి. ముఖ్యంగా మైఖేల్ కోర్సలేతో అఫైర్ పెళ్లి వరకు వచ్చి ఆగిపోయిందనే వార్తలు గుప్పుమన్నాయి. అయితే ఆ వార్తలకు చెక్ పెట్టేలా శృతి, మైఖేల్ విడిపోయారు.

    శంతను హాజరికాతో డేటింగ్

    శంతను హాజరికాతో డేటింగ్

    తాజాగా ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్టు శంతను‌తో సన్నిహితంగా శృతి హాసన్ ఉండటం మీడియా కంటపడింది. వారిద్దరి ఇటీవల పలుమార్లు డేటింగ్ చేస్తూ, రెస్టారెంట్లలో, ఎయిర్‌పోర్టులో కనిపించారు. దాంతో శృతి హాసన్ మరోసారి ప్రేమలో పడిందనే విషయం ఖరారైంది.

    శంతనుతో శృతిహాసన్ వాలంటైన్

    శంతనుతో శృతిహాసన్ వాలంటైన్

    తాజాగా శంతను హజారికాతో శృతిహాసన్ వాలంటైన్‌ను జోష్‌తో జరుపుకొన్నారు. అందంగా ముస్తాబు చేసిన ఇంటిలో వారిద్దరూ సన్నిహితంగా, తన్మయత్వంతో ఉన్న ఫోటోలు మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ క్రమంలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో శృతిహాసన్‌తో బంధంపై శంతను క్లారిటీ ఇచ్చారు.

    శృతిహాసన్‌తో నా బంధం అంటూ

    శృతిహాసన్‌తో నా బంధం అంటూ

    శృతిహాసన్‌తో ఉన్న బంధం గురించి శంతను మాట్లాడుతూ.. ఆమెతో ఉన్న రిలేషన్‌షిప్ గురించి నేను మాట్లాడను. నా గురించి, నా ప్రొఫెషన్ గురించి మాట్లాడమంటే అన్ని విషయాలు చెబుతాను. అంతేకాకుండా శృతికి మ్యూజిక్, కల్చర్, ఆర్ట్ అంటే ఎంతో మక్కువ. మా మధ్య అందమైన స్నేహం, రిలేషన్ ఉంది అని శంతను హజరికా వెల్లడించారు.

    మా ఇద్దరిని కలిపింది అదే

    మా ఇద్దరిని కలిపింది అదే

    శృతిహాసన్‌ను నన్ను కలిపింది మ్యూజిక్. మా ఇద్దరి మధ్య కామన్ ఇంట్రెస్ అదే. ఆర్ట్, కల్చర్ విషయాల గురించి ఎక్కువగా మాట్లాడుకొంటాం. నా ఆర్ట్ గురించి తెలుసుకొని నాకు దగ్గర అయ్యారు. ఆమె కూడా పెయింటింగ్‌ వేస్తుంటారు. నా వృత్తి పట్ల ఆమెకు విశేషమైన గౌరవం ఉంది అంటూ శంతను క్లారిటీ ఇచ్చారు.

    English summary
    Shruti hasaan has spotted with new boy friend in Mumbai. She was trying to cross road with boy friend Santanu Hazarika by holding his hand. In this occassion, Santanu given clarity about his relationship with the Shruti Haasan.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X