For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  నాకు అప్పులున్నాయి.. కట్టడానికి అమ్మానాన్న లేరు, అందుకే అలా...ఓపెన్ అయిపోయిన శృతి హాసన్!

  |

  కమల్ హాసన్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకుంది. తనదైన నటనతో, డ్యాన్స్‌తో టాలెంట్ బయట పెడుతూ కమల్ హాసన్ కుమార్తె గా కాకుండా శృతిహాసన్ గా తన ఐడెంటిటీ మార్చుకుంది. ఒక ప్రేమ వ్యవహారంలో పడి దాదాపుగా సినిమాలకు దూరం అయిపోయిన ఈ ఫార్మా ఆ ప్రేమ విఫలం కావడంతో మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది. తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాతో హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత రెండో నెలలోనే వకీల్ సబ్ సినిమాతో మరో హిట్ అందుకొని.. తాజాగా తన అప్పులు తన తల్లిదండ్రులతో సంబంధాల గురించి ఈ భామ ఆసక్తికరంగా స్పందించింది ఆ వివరాల్లోకి వెళితే..

  బోల్డ్ బ్యూటీ

  బోల్డ్ బ్యూటీ


  అంశం ఎలాంటిది అయినా సరే శృతి హాస‌న్ చాలా బోల్డ్ గా మాట్లాడుతుంద‌నే సంగ‌తి మ‌నంద‌రికి తెలిసిందే. ఆమె ఎప్పుడూ వివిధ విషయాలపై తన అభిప్రాయాల గురించి కొండ బద్దలు కొట్టడంలో ముందుంటుంది.. ప్రస్తుతం, దేశ పరిస్థితి అంత బాగా లేదు. దేశంలో ప్రతిచోటా కేసులు పెరుగుతున్నాయి. దీంతో నెమ్మదిగా దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమల్లోకి వచ్చింది.

  షూటింగ్స్ తప్పదు

  షూటింగ్స్ తప్పదు

  అయితే లాక్ డౌన్ ఉన్నప్పటికీ, కొన్ని చోట్ల సినిమా మరియు టెలివిజన్ కార్యక్రమాల షూటింగ్స్ జరుగుతున్నాయి. ఇంట్లో ఉండాల్సిన అవసరం ఉన్నప్పటికీ, వారి కడుపు నింపుకోవడానికి షూటింగులకు హాజరు కాని పరిస్థితి నెలకొంది. తాను కూడా షూటింగ్ లో పాల్గొంటున్న అంశం మీద శృతి హాసన్ తాజాగా స్పందించింది.

  దాచేది ఏమీ లేదు

  దాచేది ఏమీ లేదు


  తాను షూటింగ్ లో పాల్గొనే విషయంలో దాటడానికి ఏమీ లేదన్న శృతిహాసన్ ఈ మహమ్మారి ముగిసే వరకు వేచి ఉండలేను అని చెప్పుకొచ్చింది. ఈ మహమ్మారి జడలు విప్పుతున్న సమయంలో నటించడం అంత సులభం కాదని అన్నారు. మాస్క్ లేకుండా సెట్ చాలా భయానకంగా ఉంటుందన్న ఆమె అందరిలాగే నాకు ఆర్థిక పరిమితులు ఉన్నాయని పేర్కొంది. అందుకే షూట్ చేయడానికి దర్శక నిర్మాతలు సిద్ధంగా ఉన్నప్పుడు, నేను పూర్తి చేయాల్సిన సినిమాలు, షూటింగులు పూర్తి చేయడానికి సిద్దంగా ఉండాలని ఆమె చెప్పుకొచ్చింది.

  అమ్మ నాన్న కట్టరుగా

  అమ్మ నాన్న కట్టరుగా

  ఇక త‌ను ఇండిపెండెంట్‌గానే ముందుకు వెళుతున్నానని పేర్కొన్న ఆమె తాను ఎవ‌రిపై ఆధార‌ప‌డనని చెబుతూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అమ్మ‌, నాన్న సాయం నేను ఎప్పుడు తీసుకోనన్న ఆమె నా కాళ్ల మీద నిల‌బ‌డ‌టానికే నేను ప్ర‌య‌త్నిస్తాను. నా ఖ‌ర్చుల‌కి నేనే సంపాదించుకుంటాను. నా బిల్లులు చెల్లించుకోవాలి అంటే ప‌ని చేయ‌క త‌ప్ప‌దు. లేదంటే ఆర్ధికంగా ఇబ్బందులు ఎదుర్కోవాలని ఆమె పేర్కొంది. ఇక ఆమె పదేళ్ళ క్రితమే ఇంటి నుండి బయటకు వచ్చేసింది. అప్పటి నుండి ఆమె స్వయంగా కష్టపడి బ్రతుకుతోంది.

  Gabbar Singh దెబ్బకు ఆ హీరో షాక్, PSPK 28 తో మళ్ళీ అదే మ్యానియా || Filmibeat Telugu
  అందులో అదృష్టవంతురాలినే

  అందులో అదృష్టవంతురాలినే

  అయితే ఆమె మాట్లాడుతూ, ఆహారం అలాగే మెడిసిన్స్ సైతం డబ్బు లేని వ్యక్తులు ఉన్నా తాను మాత్రం నా EMI చెల్లించడానికి ప్రయత్నిస్తున్నాను" అంటే సేఫ్ జోన్ లోనే ఉన్నట్టు ఆమె చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ మరియు ఇతర కారణాల వల్ల షూటింగులు నిలిచిపోవడంతో, శ్రుతి హాసన్ ఇంట్లోనే ఉండి సంగీతం సాధన చేస్తూ, ఫోటోషూట్లు నిర్వహిస్తున్నారు. ఇక మనం మహమ్మారిని ఓడించాలంటే, ఇంట్లోనే ఉండాలి. "ఇది ఆప్షన్ కాదు అన్న ఆమె అయినా ఇంట్లోనే ఉండాలి" అని పేర్కొంది. ఈ భామ సలార్ సినిమాలో ప్రభాస్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది.

  English summary
  Shruti Haasan is no different who has been hit hard by the pandemic like many others. she hopes things return to normalcy at the earliest as she has bills to pay. She addresses her financial constraints where she is sole caretaker of herself and doesn’t have to rely on her parents to pay her bills.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X