అక్కడికి వెళ్లాకే నా జీవితం మారింది.. శ్రుతిహాసన్ షాకింగ్ కామెంట్స్!

సినీ ఇండస్టీలోకి స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చిన, తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నటి శృతి హాసన్. కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె, వారసత్వంతో వచ్చిన పేరు కంటే తన టాలెంట్‌తోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నారు. నటిగా, గాయనిగా, సంగీతంపై ఆసక్తి ఉన్న కళాకారిణిగా శ్రుతి ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచారు. తాజాగా ఆమె చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇంతకీ ఏమన్నారంటే?

శ్రుతి హాసన్ సినీ ప్రయాణం ప్రారంభ దశలో చాలా సవాళ్లను ఎదుర్కొంది. మొదట గాయనిగా తన ప్రతిభను చూపించిన ఆమె, తర్వాత హీరోయిన్‌గా మారి 'అనగనగా ఓ ధీరుడు' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు. తొలి సినిమా ఆశించిన స్థాయిలో విజయం సాధించకపోయినా, ఆమె నటనపై మంచి అభిప్రాయం ఏర్పడింది. ఆ తర్వాత వరుస అవకాశాలు రావడం మొదలైంది.

Shruti Haasan Says Kamakhya Temple Visit Changed Her Life Spiritual Comments Go Viral

అయితే ఆమె కెరీర్‌కు నిజమైన టర్నింగ్ పాయింట్‌గా నిలిచింది గబ్బర్ సింగ్. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ఈ చిత్రం భారీ విజయాన్ని అందుకోవడంతో శ్రుతి హాసన్ ఒక్కసారిగా స్టార్ హీరోయిన్‌గా మారిపోయింది. ఆ సినిమా తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలు రావడంతో ఆమె బిజీ నటిగా నిలిచారు. తక్కువ సమయంలోనే కమర్షియల్ హీరోయిన్‌గా మంచి స్థానం సంపాదించారు.

కేవలం నటిగా మాత్రమే కాదు, గాయనిగా కూడా శ్రుతి తన ప్రత్యేకతను చూపిస్తున్నారు. సంగీతం అంటే ఆమెకు ఉన్న అభిరుచి అందరికీ తెలుసు. పలు సినిమాల్లోపాటలు పాడిన ఆమె, ఇటీవల కూడా కొన్ని ప్రాజెక్టుల కోసం తన గాత్రాన్ని అందించారు. నటన, సంగీతంతో సమానంగా తీసుకెళ్తున్న అరుదైన నటిమణుల్లో ఆమె ఒకరు. ఇటీవల సాలార్ సినిమాతో ఆమె మరోసారి పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రభాస్ సరసన కనిపించిన శ్రుతి హాసన్, దేశవ్యాప్తంగా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించారు. దీంతో మళ్లీ ఆమె కెరీర్‌కు కొత్త ఊపుట్లైంది.

ఇక వ్యక్తిగత జీవితంలో శ్రుతి హాసన్ తరచుగా వార్తల్లో నిలుస్తారు. తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న ఆమె చేసిన ఆధ్యాత్మిక వ్యాఖ్యలు ప్రత్యేక ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఇటీవల తాను అస్సాంలోని గువాహటిలో నీలాచల్ కొండ పై ఉన్న కామాఖ్యా టెంపుల్( వారాహి అమ్మవారు) దర్శించుకున్నానని చెప్పారు. ఓ స్నేహితుడు ఆలయానికి రమ్మని పిలవడంతో వెళ్లానని, అది పెద్ద దేవాలయం కాకుండా చాలా చిన్న, ప్రశాంతమైన ఆలయం అని వివరించారు. గర్భగుడిలోకి అడుగుపెట్టగానే తనకు నిజమైన భక్తి పారవశ్యం కలిగిందని శ్రుతి హాసన్ అన్నారు.

వారాహి అమ్మవారిని దర్శించుకున్న తర్వాత తన జీవితంలో మంచి మార్పులు వచ్చాయని శ్రుతి చెప్పుకొచ్చింది. అక్కడ ఎలాంటి ఆడంబరం లేదని, వీఐపీ క్యూ లేదని, శబ్దాలు లేవని, పవిత్రమైన ఆత్మీయ అనుభూతిని కలిగి ఉందని, గర్భగుడిలోకి వెళ్లగానే నిజమైన భక్తి పారవశ్యాన్ని పొందానని తెలిపారు. వారాహి అమ్మవారు ఎంతో శక్తివంతమైన దేవత అని చెప్పింది. శ్రుతి మాటల్లో భక్తి అనేది కేవలం ఆచారాలు, పెద్ద పూజలు, జన సందడి కాదని.. మనసులో కలిగే అనుభూతి అని స్పష్టమైంది.ఒక చిన్న దేవాలయంలోనూ నిజమైన ఆధ్యాత్మిక అనుభవం పొందాలని ఆమె చెప్పిన సందేశం చాలామందిని ఆకట్టుకుంది. ఈ కామెంట్స్ ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

ఇదిలా ఉంటే.. ప్రస్తుతం శ్రుతి హాసన్ తమిళంలో విజయ్ సేతుపతి సరసన కొత్త చిత్రంలో నటిస్తున్నారు. అలాగే సాలార్: పార్ట్ 2లోనూ కనిపించనున్నారు. తెలుగులో రామ్ చరణ్ నటిస్తున్న పెద్దిలో ప్రత్యేక పాత్రలో నటించే అవకాశమున్నట్లు టాక్ వినిపిస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X