లవర్స్‌తో బ్రేకప్స్ గురించి బాధపడను.. అంతమందితో ఎందుకు వర్కవుట్ కాలేదంటే: శృతిహాసన్
స్టార్ హీరోయిన్ శృతి హసన్ తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతటి క్రేజ్ దక్కించుకుందో తెలిసిందే. లోక నాయకుడు కమల్ హాసన్ కూతురిగా చిత్ర పరిశ్రమలో అడుగు పెట్టినా తండ్రికి తగ్గ తనయ అనిపించింది. తన టాలెంట్ ను ప్రదర్శిస్తూ ఇండస్ట్రీలో ఒక్కో మెట్టు ఎక్కింది. తండ్రి పేరు చెప్పుకొని ఆఫర్లు దక్కించుకోకుండా తన టాలెంట్ తోనే సినిమా ఆఫర్లు అందుకుంది. ఆ విషయంలో సినీ ప్రముఖులు, ప్రేక్షకులతోనూ శబాష్ అనిపించుకుంది. మరోవైపు స్టార్ హీరోల సరసన నటించి మెప్పిస్తూ.. అంతకంతకు ఫ్యాన్ ఫాలోయింగ్ పెంచుకుంటోంది.
ఇదిలా ఉంటే.. శృతి హాసన్ తన సినిమాల విషయంలో ఎంతటి శ్రద్ధ వహిస్తారో వ్యక్తిగత విషయంలోనూ అలాగే ఉంటారు. ముఖ్యంగా తన గురించి ఎలాంటి రహస్యాలు ఉండకూదనే అభిప్రాయాలను కలిగి ఉంటారు. అందుకోసం తన అభిమానులను అన్ని విషయాలను పంచుకుంటారు. ఎలాంటి విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడుతూ ఉంటారు. అయితే శృతి హాసన్ రీసెంట్ గా ఫిల్మ్ ఫెయిర్ కు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన బ్రేకప్స్ పై స్పందించింది.

తన హార్ట్ బ్రేకింగ్ రిలేషన్ షిప్స్ గురించి శృతి హాసన్ మాట్లాడుతూ.. నేను ఎలాంటి ప్రశ్చాత్తపం లేకుండా రిలేషన్ షిప్స్ ను ముగించేస్తారు. ఎందుకంటే నేను నా వరకు నిజాయితీగా ఉంటాను. అందుకే కావచ్చు చాలా మంది నన్ను ఇప్పుడు ఎన్నో నెంబర్ బాయ్ ఫ్రెండ్ తో ఉన్నావంటూ మాట్లాడుతారు. కానీ నాకు ఆ విషయం అర్థం కాదు. అందరి విషయంలో అది కేవలం నెంబర్ మాత్రమే... కానీ నా విషయంలో నేను అన్ని సార్లు ప్రేమలో విఫలం అవుతూ వస్తున్నాను. నేను కోరుకున్న నిజమైన ప్రేమను పొందడంలో పదే పదే ఫెయిల్ అవుతున్నానని అర్థం.
అయితే ఇలాంటి విషయాలకు నేను పెద్దగా బాధపడను. కానీ నేను మనిషినే కాబట్టి కొన్ని సందర్భాల్లో కాస్తా బాధపడుతాను. అంతే కానీ నేను ఆ విషయంలో ఎవరినీ నిందించను. ఎందుకంటే మనం ఒకరితో కలిసి ఉన్నప్పుడు ఒకే సయమంలో మారిపోవడం సాధ్యం కాదు. అలా నేను కూడా మారిపోవాలని ఎప్పుడూ ఆలోచించ లేదు. ఇక నాకు రిలేషన్ షిప్ ల కంటే ఇంకేది జీవితం గురించి గొప్పగా నేర్పించేలేదు.... అని చెప్పుకొచ్చింది. ఇక గతేడాది శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో విడిపోయిందని వార్తలు వస్తుండగా.. తాజాగా ఇలా స్పందించింది.
ఇక శృతి హాసన్ తొలుత లండన్ కు చెందిన మైఖేల్ కోర్సేల్లే తో రిలేషన్ షిప్ స్టార్ట్ చేసింది. 2016 నుంచి 19 వరకు మూడేళ్ల పాటు ఒకరితో ఒకరు కలిసి ఉన్నారు. ఆ తర్వాత బ్రేకప్ చెప్పుకున్నారు. ఆ తర్వాత 2021 నుంచి డూడుల్ ఆర్టిస్ట్ షంతను హజారికాతో రిలేషన్ షిప్ స్టార్ట్ చేసింది. గతేడాది 2024లో అతనితో కూడా విడిపోయినట్టు వార్తలు. అయితే వీరిద్దరితోనూ శృతి హాసన్ అందరికి తెలిసేలానే రిలేషన్ షిప్ కొనసాగింది. ఇక సినిమాల విషయానికొస్తే చివరిగా సలార్ చిత్రంతో అలరించింది. నెక్ట్స్ రజనీకాంత్ 'కూలి'. విజయ్ దళపతి 'జన నాయగన్', 'సలార్ 2', 'ట్రైన్' వంటి చిత్రాల్లో నటిస్తూ బిజీగా ఉంది.


Click it and Unblock the Notifications











