Don't Miss!
- News
బారాముల్లాలో గ్రనేడ్‌తో దాడి.. ఒకరు మృతి, ముగ్గురికి గాయాలు
- Sports
Satender Malik: రిఫరీపై పిడిగుద్దులు.. భారత రెజ్లర్‌పై జీవితకాల నిషేధం!
- Technology
Windows 11లో వర్చువల్ మెమరీని పెంచి సమస్యలకు చెక్ పెట్టడం ఎలా?
- Automobiles
మే 19న జీప్ మెరిడియన్ Jeep Meridian ఎస్యూవీ విడుదల, డీటేల్స్
- Finance
కార్డు లేకున్నా ఏటీఎం నుండి నగదు ఉపసంహరించుకోవచ్చు
- Lifestyle
Mangal Gochar 2022:మీన రాశిలోకి అంగారకుడి సంచారం.. ఏ రాశి వారిపై ఎలాంటి ప్రభావమంటే...!
- Travel
కర్ణాటక జూన్ 1 నుండి ఈ ఆధ్యాత్మిక ప్రదేశాలను తెరవనుంది..
లవర్‌తో కలిసున్న ఫొటో లీక్ చేసిన శృతి హాసన్: అతడు అడగ్గానే అంత పని చేసేసిన బ్యూటీ
సినీ ఇండస్ట్రీలోకి వారసులు ఎంట్రీ ఇవ్వడం సర్వసాధారణమే. అయితే, ఎక్కువగా తమ కుమారులనే చాలా మంది స్టార్లు పరిచయం చేశారు. కొందరు మాత్రమే తమ కూతుళ్లను కూడా చిత్రసీమలోకి తీసుకుని వచ్చారు. అలా వచ్చి చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది హాట్ బ్యూటీ శృతి హాసన్. ఈ క్రమంలోనే దక్షిణాది మొత్తంలోనూ హవాను చూపిస్తూ వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది.
అదే సమయంలో ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తన పర్సనల్ ఫొటోలను శృతి హాసన్ షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

అన్నింట్లోనూ సత్తా.. ఫుల్ పాపులర్
చిన్న వయసులోనే గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది శృతి హాసన్. అలాగే సొంతంగా కొన్ని పాటలు కంపోజ్ చేసింది. అప్పటి నుంచి సింగర్‌గా, ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్‌గానూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఎన్నో ఆల్బమ్‌లను క్రియేట్ చేసింది. ఫలితంగా ఆల్‌రౌండర్ పేరును తెచ్చుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని దక్కించుకుంది.
పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ప్రభాస్ హీరోయిన్: పెళ్లైన ఆరు నెలలకే తల్లిగా ప్రమోషన్

అలా ఎంట్రీ.. తెలుగులోకి ప్రవేశం
టీనేజ్‌లోనే పలు విభాగాల్లో సత్తా చాటుతూ పేరు సంపాదించుకున్న కమల్ డాటర్ శృతి హాసన్.. 2000లో వచ్చిన 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్ర చేసి నటిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అనంతరం 'లక్' అనే హిందీ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఇక, తెలుగులో సిద్దార్థ్ హీరోగా వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు'తో హీరోయిన్‌గా పరిచయం అయింది.

అందరితో చేసింది.. రీఎంట్రీలోనూ
శృతి హాసన్ తెలుగు హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా ఎంతో మందితో స్క్రీన్ షేర్ చేసుకుంది. కెరీర్ పరంగా బిజీగా ఉన్న టైంలోనే చాలా కాలం పాటు గ్యాప్ తీసుకుంది. ఈ క్రమంలోనే రీఎంట్రీ ఇచ్చి 'క్రాక్', 'వకీల్ సాబ్'తో సక్సెస్‌ను అందుకుంది. ఇక, ఇప్పుడు ఈ బ్యూటీ 'సలార్'తో పాటు బాలయ్య మూవీ చేస్తోంది.
Unstoppable with NBK: రెండు ఎపిసోడ్లకే ఆగిపోయిన బాలకృష్ణ షో.. అసలు కారణం చెప్పిన ఆహా

అతడికి బ్రేకప్.. ఇతడితో డేటింగ్
వరుస
సినిమాలతో
దూసుకెళ్తోన్న
టైంలోనే
శృతి
హాసన్
ఇంగ్లండ్
గాయకుడు
మైకేల్
కోర్సలేతో
ప్రేమలో
పడింది.
అంతేకాదు..
అతడితో
పెళ్లికి
కమల్
కూడా
ఒప్పుకున్నాడని
అన్నారు.
కానీ,
ఊహించని
విధంగా
అతడికి
బ్రేకప్
చెప్పేసింది.
ఇక,
మైకేల్‌తో
బ్రేకప్
తర్వాత
శృతి
హాసన్
మరొకరితో
లవ్
ట్రాక్
నడపడం
కూడా
మొదలెట్టింది.
ఇప్పుడతడితో
కలిసి
తెగ
ఎంజాయ్
చేస్తోంది.

పెళ్లి కాకున్నా ఒకే చోట ఉంటూనే
మైకేల్‌తో బ్రేకప్ తర్వాత శృతి హాసన్ కెరీర్ మీద ఎక్కువగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోంది. ఇలాంటి సమయంలో ఈ కోలీవుడ్ బ్యూటీ శాంతను హజారికా అనే పెయింటింగ్ ఆర్టిస్టుతో ప్రేమలో పడిపోయింది. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుండానే ముంబైలో కలసి ఒకే ఇంట్లో ఉంటూ తరచూ వార్తల్లో ఉంటున్నారు.
బ్రా కూడా లేకుండా షాకిచ్చిన పాయల్: వెయిట్ చేయలేకపోతున్నా అంటూ పోస్ట్.. వామ్మో ఇది మరీ దారుణం

శృతి అందులో ఎప్పుడూ బిజీగానే
శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ప్రియుడి ఫొటోలను కూడా తరచూ వదులుతోంది.

పర్సనల్ ఫొటో షేర్ చేసిన బ్యూటీ
తాజాగా శృతి హాసన్ ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ నిర్వహించింది. ఇందులో ఓ నెటిజన్ 'శాంతను, నువ్వు కలిసి దిగిన ఇప్పటి వరకూ షేర్ చేయని ఫొటో చూపించు' అని అడిగాడు. దీనికామె వెంటనే ఓ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో శాంతను శృతిని హత్తుకుని ఉండగా.. ఆమె ఫొటో తీస్తుంది. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది.