ప్రియుడితో శృతి హాసన్ రచ్చ: ఎదపై హత్తుకుని ఘాటుగా.. పిచ్చ హాట్ ఫొటోను షేర్ చేసిన హీరోయిన్

సినీ ఇండస్ట్రీలోకి ఎంతో మంది వారసులు ఎంట్రీ ఇస్తుంటారు. అయితే, అందులో ఎక్కువ మంది అబ్బాయిలే హీరోలుగా పరిచయం అవుతున్నారు. చాలా తక్కువ మంది మాత్రమే తమ కూతుళ్లను కూడా పరిశ్రమకు పరిచయం చేస్తున్నారు. అలా ఎంట్రీ ఇచ్చిన వారిలో లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కుమార్తె శృతి హాసన్ ఒకరు. చూపు తిప్పుకోకుండా చేయగల అందం.. మైమరపించే నటనతో.. అప్పుడప్పుడూ గ్లామర్ ట్రీట్‌తో కొంత కాలంగా సినీ ప్రియులను ఫిదా చేస్తోంది.

ఇలా వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. అదే సమయంలో ప్రియుడితో రొమాన్స్ చేస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా శృతి బాయ్‌ఫ్రెండ్‌తో దిగిన హాట్ పిక్‌ను షేర్ చేసింది. దానిపై మీరూ లుక్కేయండి!

చిన్నప్పుడే పరిచయం అయింది

చిన్నప్పుడే పరిచయం అయింది

టీనేజ్‌లోనే శృతి హాసన్ గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. ఆ తర్వాత సొంతంగా కొన్ని ఆల్బమ్‌లను కూడా కంపోజ్ చేసింది. ఈ క్రమంలోనే 2000లో వచ్చిన 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్ర చేసింది. అనంతరం 'లక్' అనే హిందీ సినిమాలో ముఖ్యమైన రోల్ చేసింది. ఇక, తెలుగులో వచ్చిన 'అనగనగా ఓ ధీరుడు'తో హీరోయిన్‌గానూ ఎంట్రీ ఇచ్చింది.

తెలుగులో స్టార్‌గా.. రీఎంట్రీలోనూ

తెలుగులో స్టార్‌గా.. రీఎంట్రీలోనూ

కమల్ కూతురిగా టాలీవుడ్‌లోకి వచ్చిన శృతి హాసన్.. చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకుంది. ఈ క్రమంలోనే బడా హీరోలు అందరితోనూ స్క్రీన్ షేర్ చేసుకుంది. ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే చాలా కాలం గ్యాప్ తీసుకుని 'క్రాక్' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'వకీల్ సాబ్'లోనూ మెరిసింది. ఇక, ఇప్పుడు ప్రభాస్‌తో 'సలార్‌'లో నటిస్తోంది.

అతడితో బ్రేకప్.. ఇతడితో ప్రేమ

అతడితో బ్రేకప్.. ఇతడితో ప్రేమ

వరుస సినిమాలతో ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే శృతి హాసన్ ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో ప్రేమ‌లో ప‌డింది. అంతేకాదు.. అతడితో పెళ్లికి కమల్ కూడా ఒప్పుకున్నాడని అన్నారు. కానీ, ఊహించని విధంగా శృతి అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇక, మైకేల్‌తో బ్రేకప్ తర్వాత ఏమాత్రం గ్యాప్ తీసుకోని ఈ బ్యూటీ శాంతను హజారికా అనే డూడుల్ ఆర్టిస్టుతో డేటింగ్ మొదలెట్టింది.

పెళ్లి కాకున్నా జంటగానే ఉంటూ

పెళ్లి కాకున్నా జంటగానే ఉంటూ

ప్రస్తుతం శృతి హాసన్ కెరీర్ మీద ఎక్కువగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోంది. ఇలాంటి సమయంలో ఈ కోలీవుడ్ బ్యూటీ శాంతను హజారికాతో విపరీతంగా ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుండానే ముంబైలో కలసి ఒకే ఇంట్లో ఉంటూ తరచూ యమ రచ్చ చేస్తున్నారు.

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

అక్కడ మాత్రం ఎప్పుడూ బిజీగా

కెరీర్ పరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ శృతి హాసన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ ఫాలోవర్లను పెంచుకుంటోంది.

హాట్ ఫొటోలతో రచ్చ చేస్తోందిగా

హాట్ ఫొటోలతో రచ్చ చేస్తోందిగా

సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే శృతి హాసన్.. ఎక్కువగా హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తుంటుంది. అంతేకాదు, ప్రియుడితో రొమాన్స్ చేస్తున్న పిక్స్, క్లిప్స్‌ను కూడా వదులుతోంది. దీంతో ఈ అమ్మడు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. అదే సమయంలో తన గ్లామర్ ట్రీట్‌తో ఇంటర్నెట్‌ను ఊపుతోంది. అలా ఎప్పుడూ హైలైట్ అవుతూనే ఉంటోంది.

రొమాన్స్ చేసే ఫొటోను వదిలింది

రొమాన్స్ చేసే ఫొటోను వదిలింది

కొంత కాలంగా ఒకే ఇంట్లో తన ప్రియుడితో కలిసి ఎంజాయ్ చేస్తోన్న శృతి హాసన్.. తరచూ ఫొటోనో, వీడియోనో వదులుతోంది. ఈ క్రమంలోనే తాజాగా అతడికి ఎదకు హత్తుకుని దిగిన ఓ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో శృతి హాసన్ ఎంతో హాట్‌గా కనిపించింది. అంతేకాదు, శాంతను తన గిఫ్ట్ అని కూడా ఆమె పేర్కొంది. దీంతో ఈ ఫొటో చాలా తక్కువ సమయంలోనే వైరల్ అవుతోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X