For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రియుడి నగ్న ఫొటోను షేర్ చేసిన శృతి హాసన్: అతడి ముందు అలా కూర్చుని.. పరువు తీసేసిందిగా!

  |

  విశ్వ నాయకుడు కమల్ హాసన్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. యాక్టింగ్, డ్యాన్స్, గ్లామర్, సింగింగ్ ఇలా ఎన్నో రకాల విద్యలను చూపించి తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్‌ను సొంతం చేసుకుంది హాట్ బ్యూటీ శృతి హాసన్. ఇలా చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను అందుకున్న ఈమె.. దేశ వ్యాప్తంగా పాపులారిటీని దక్కించుకుంది. ఈ క్రమంలోనే దక్షిణాది మొత్తంలోనూ హవాను చూపిస్తూ వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. అదే సమయంలో ప్రియుడితో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతూ తెగ ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా తనది, తన ప్రియుడికి సంబంధించిన స్పెషల్ ఫొటోలను శృతి హాసన్ షేర్ చేసింది. దానిపై మీరూ ఓ లుక్కేయండి!

  ఆల్‌రౌండర్‌గా గుర్తింపుతో ఫేమస్

  ఆల్‌రౌండర్‌గా గుర్తింపుతో ఫేమస్

  చిన్నప్పుడే శృతి హాసన్ గాయనిగా తన ప్రయాణాన్ని ప్రారంభించింది. అలాగే సొంతంగా కొన్ని పాటలు కంపోజ్ చేసింది. అప్పటి నుంచి సింగర్‌గా, ఇండిపెండెంట్ మ్యూజిక్ డైరెక్టర్‌గానూ సత్తా చాటింది. ఈ క్రమంలోనే ఎన్నో ఆల్బమ్‌లను క్రియేట్ చేసింది. ఫలితంగా ఆల్‌రౌండర్ పేరును తెచ్చుకుంది. దీంతో దేశ వ్యాప్తంగా మంచి పాపులారిటీని దక్కించుకుని సత్తా చాటిందామె.

  Shyam Singha Roy Twitter Review: నాని సినిమాకు అలాంటి టాక్.. అదొక్కటే మైనస్.. మొత్తంగా ఎలా ఉందంటే!

  సినిమాల్లోకి ఎంట్రీ.. తెలుగులోనూ

  సినిమాల్లోకి ఎంట్రీ.. తెలుగులోనూ

  సినిమాల్లోకి రాకముందే మంచి పేరును సంపాదించుకున్న కమల్ డాటర్ శృతి హాసన్.. 2000లో వచ్చిన 'హే రామ్' అనే చిత్రంలో చిన్న పాత్ర చేసి నటిగా తన ప్రయాణాన్ని మొదలు పెట్టింది. అనంతరం 'లక్' అనే హిందీ సినిమాలో ప్రధాన పాత్ర పోషించింది. ఇక, తెలుగులో సిద్దార్థ్ హీరోగా నటించిన 'అనగనగా ఓ ధీరుడు' అనే మూవీతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది.

  స్టార్ హీరోయిన్.. రీఎంట్రీ ఇచ్చేసి

  స్టార్ హీరోయిన్.. రీఎంట్రీ ఇచ్చేసి


  తెలుగు హీరోలు పవన్ కల్యాణ్, మహేశ్ బాబు, అల్లు అర్జున్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ సహా ఎంతో మందితో శృతి హాసన్ స్క్రీన్ షేర్ చేసుకుంది. కెరీర్ పరంగా బిజీగా ఉన్న టైంలోనే చాలా కాలం పాటు గ్యాప్‌ తీసుకుంది. ఈ క్రమంలోనే రీఎంట్రీ ఇచ్చి 'క్రాక్', 'వకీల్ సాబ్'తో సక్సెస్‌ను అందుకుంది. ఇప్పుడు ఈ బ్యూటీ 'సలార్‌'తో పాటు బాలయ్య మూవీలో నటిస్తోంది.

  Bigg Boss: సిరి క్యారెక్టర్‌పై సన్నీ సంచలన వ్యాఖ్యలు.. పాపం శ్రీహాన్.. ఆ విషయం చెబితే గొడవలే అంటూ!

  విదేశీయుడితో బ్రేకప్ చేసుకుంది

  విదేశీయుడితో బ్రేకప్ చేసుకుంది

  సినిమాల పరంగా ఫామ్‌లో ఉన్న టైంలోనే శృతి హాసన్ ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో ప్రేమ‌లో ప‌డింది. అంతేకాదు.. అతడితో పెళ్లికి కమల్ కూడా ఒప్పుకున్నాడని అన్నారు. కానీ, ఊహించని విధంగా అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇక, మైకేల్‌తో బ్రేకప్ తర్వాత శృతి హాసన్ మరొకరితో లవ్ ట్రాక్ నడపడం కూడా మొదలెట్టింది. ఇప్పుడతడితో కలిసి రచ్చ రచ్చ చేస్తోంది.

  పెళ్లికి ముందే కలిసుంటోన్న జోడీ

  పెళ్లికి ముందే కలిసుంటోన్న జోడీ

  మైకేల్‌తో విడిపోయిన తర్వాత శృతి హాసన్ కెరీర్ మీద బాగా దృష్టి సారించింది. ఈ క్రమంలోనే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి వరుసగా ప్రాజెక్టులను లైన్‌లో పెట్టుకుంటోంది. ఇలాంటి సమయంలో ఈ కోలీవుడ్ బ్యూటీ శాంతను హజారికా అనే పెయింటింగ్ ఆర్టిస్టుతో ప్రేమలో పడిపోయింది. వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుండానే ముంబైలో కలసి ఒకే ఇంట్లో ఉంటూ తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.

  Pushpa 1 Week Collections: 146 కోట్ల టార్గెట్.. వారంలోనే అన్ని కోట్లు.. ఇంకెంత వస్తే హిట్ అంటే!

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీ

  అందులో మాత్రం ఎప్పుడూ బిజీ


  సోషల్ మీడియా ద్వారా శృతి హాసన్ ఫ్యాన్స్‌తో నిత్యం టచ్‌లోనే ఉంటోంది. ఇందులో భాగంగానే ఎప్పుడూ ఏదో ఒక అప్‌డేట్ ఇస్తూ వస్తోంది. మరీ ముఖ్యంగా తనకు, తన కెరీర్‌కు సంబంధించిన ఎన్నో విషయాలను ఫాలోవర్లతో పంచుకుంటూ ఉంటోంది. అలాగే, హాట్ ఫొటోలు, వీడియోలను సైతం షేర్ చేస్తూ హాట్ టాపిక్ అవుతోంది. ప్రియుడి ఫొటోలను కూడా వదులుతూ రచ్చ చేస్తోంది.

  Recommended Video

  NBK107: Nandamuri Balakrishna's Next Grand Launch
  ప్రియుడి నగ్న ఫొటో వదిలిందిగా

  ప్రియుడి నగ్న ఫొటో వదిలిందిగా

  శృతి హాసన్ తాజాగా ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ పిక్‌ను షేర్ చేసింది. ఇందులో శాంతను, శృతి చిన్నప్పుడు తీసుకున్న పిక్స్ కలిపి ఉన్నాయి. అందులోనూ ఈ ఫొటోలో ఆమె బాయ్‌ఫ్రెండ్ నగ్నంగా ఉన్నాడు. అతడు ముందు పిక్‌లో శృతి కూర్చుని ఉంది. వీటికి ఫన్నీ కామెంట్స్ కూడా చేసింది. అలాగే ఏ ఫోజులో ఉంది ఎవరు అనేది కూడా చెప్పింది. దీంతో ఇది తెగ వైరల్ అవుతోంది.

  English summary
  Shruti Hassan Now Dating with Santanu Hazarika. Recently She Shared Boyfriend Santanu Hazarika Childhood Photo.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X