For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రియుడితో హాట్‌గా శృతి హాసన్: ఆ పని చేసే లవర్స్ ఎప్పటికీ విడిపోరంటూ!

  |

  సౌతిండియన్ స్టార్ హీరో విశ్వ నాయకుడు కమల్ హాసన్ కూతురిగా ప్రపంచానికి పరిచయమైనా.. చాలా తక్కువ సమయంలోనే తనలోని అన్ని టాలెంట్లను చూపించి స్టార్ హీరోయిన్‌గా ఎదిగిపోయింది హాట్ బ్యూటీ శృతి హాసన్. దీంతో రెట్టించిన ఉత్సాహంతో సినిమాల మీద సినిమాలు చేస్తోంది. ఆ మధ్య కొంత కాలం గ్యాప్ తీసుకున్నా.. రీఎంట్రీలో మరింత ఎక్కువగా సందడి చేస్తోంది. కెరీర్ పరంగా ఎలా ఉన్నా.. పర్సనల్ లైఫ్‌ను కూడా శృతి హాసన్ ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే తన ప్రియుడు శాంతను హజారికాతో ఎంతో ఎంజాయ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా శృతి హాసన్ ఓ హాట్ ఫొటోను షేర్ చేసింది. అంతేకాదు, దీనికి అదిరిపోయే క్యాప్షన్ ఇచ్చింది. ఆ సంగతులేంటో మీరే చూడండి!

  అలా వచ్చింది.. ఇలా పాపులర్

  అలా వచ్చింది.. ఇలా పాపులర్

  చిన్న వయసులోనే శృతి హాసన్ సింగర్‌గా కెరీర్‌ను ఆరంభించి.. ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. అలా వచ్చిన తక్కువ సమయంలోనే ఫుల్ పాపులర్ అయింది. దీంతో వరుసగా సినిమాలు చేస్తూ హవాను చూపించింది. శృతి ఏ ఒక్క భాషకో పరిమితం కాకుండా దక్షిణాది మొత్తంలో సినిమాలు చేసింది. అలాగే, బాలీవుడ్‌లోనూ తనదైన చిత్రాలతో తెగ సందడి చేసేసింది.

  ఆగిపోయిన హీరోయిన్ పూర్ణ పెళ్లి: క్లారిటీ ఇస్తూ ఇన్‌స్టా పోస్ట్.. ఆ ఫొటో షేర్ చేయడంతో!

  తెలుగులో అప్పుడూ ఇప్పుడూ

  తెలుగులో అప్పుడూ ఇప్పుడూ

  పేరుకు కోలీవుడ్ హీరోయిన్‌ అయినా శృతి హాసన్ తెలుగులోనూ చాలా తక్కువ సమయంలోనే స్టార్‌గా ఎదిగిపోయింది. ఈ క్రమంలోనే బడా హీరోలు అందరితోనూ ఆడిపాడింది. తద్వారా టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌ అనే పేరును కూడా సంపాదించుకుంది. ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే గ్యాప్ తీసుకున్న ఈమె ‘క్రాక్'తో రీఎంట్రీ ఇచ్చి.. తర్వాత ‘వకీల్ సాబ్'లోనూ కనిపించింది

  రీఎంట్రీలో వరుస సినిమాలు

  రీఎంట్రీలో వరుస సినిమాలు

  టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత శృతి హాసన్ సీనియర్ హీరోల సినిమాల్లో భాగం అవుతోంది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తోన్న ‘సలార్' మూవీలో నటిస్తోన్న ఈ బ్యూటీ.. మరిన్ని ప్రాజెక్టులను కూడా ఒప్పుకుంది. ఇందులో భాగంగానే బాలయ్య - గోపీచంద్ సినిమాతో పాటు చిరంజీవి - బాబీ కాంబోలో వస్తున్న మూవీలోనూ శృతి హాసన్ నటిస్తోంది.

  Laal Singh Chaddha Twitter Review: రిలీజ్ రోజే అమీర్‌కు షాక్.. సినిమా టాక్ ఇలా.. నాగ చైతన్య మాత్రం!

  విదేశీయుడికి బ్రేకప్ చెప్పేసి

  విదేశీయుడికి బ్రేకప్ చెప్పేసి


  సినిమాల పరంగా ఎంతటి పేరు ప్రఖ్యాతలను సంపాదించుకుందో.. లవ్ ట్రాకుల వల్ల కూడా శృతి హాసన్ అంతే ఫేమస్ అయింది. గతంలో ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో ఆమె చాలా కాలం పాటు డేటింగ్ చేసింది. అంతేకాదు.. అతడితో పెళ్లికి కమల్ కూడా ఒప్పుకున్నాడని వార్తలు వైరల్ అయ్యాయి. కానీ, ఊహించని విధంగా శృతి హాసన్ అతడికి బ్రేకప్ చెప్పేసింది.

  శాంతనుతో ట్రాక్ నడుపుతూ

  శాంతనుతో ట్రాక్ నడుపుతూ

  విదేశీయుడితో విడిపోయిన వెంటనే శృతి హాసన్.. శాంతను హజారికా అనే డూడుల్ ఆర్టిస్టుతో ప్రేమలో పడిపోయింది. అతడితో ప్రేమ గురించి బహిరంగంగానే ప్రకటించిన ఈ అమ్మడు.. ఓ రేంజ్‌లో రచ్చ చేస్తోంది. ఇందులో భాగంగానే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుండానే ముంబైలో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. అలాగే, పబ్బులు, పార్టీలు చేసుకుంటూ తెగ రెచ్చిపోతున్నారు.

  శ్రీయ అందాల ఆరబోత: తల్లయ్యాక కూడా ఇంత హాట్‌గానా!

  సోషల్ మీడియాలో అతడితో

  సోషల్ మీడియాలో అతడితో

  కెరీర్ పరంగా వరుస షెడ్యూళ్లతో ఫుల్ బిజీగా గడుపుతోన్నా.. సోషల్ మీడియాలోనూ శృతి హాసన్ ఎంతో యాక్టివ్‌గా గడుపుతోంది. ఇందులో భాగంగానే తన పర్సనల్ లైఫ్ సంబంధిత విశేషాలను కూడా వెల్లడిస్తోంది. మరీ ముఖ్యంగా తన ప్రియుడితో కలిసి దిగిన ఫొటోలు, వీడియోలను కూడా షేర్ చేసుకుంటోంది. ఫలితంగా వీళ్లిద్దరి లవ్ ట్రాక్ దేశ వ్యాప్తంగా తెగ హైలైట్ అవుతోంది.

  Recommended Video

  లాల్ సింగ్ గా అమిర్ ఖాన్ ఆకట్టుకున్నాడా? లేదా? *Reviews | Telugu OneIndia
  ఆ ఫొటోతో షాకింగ్ కామెంట్

  ఆ ఫొటోతో షాకింగ్ కామెంట్

  తాజాగా శృతి హాసన్ తన ప్రియుడితో కలిసి వర్కౌట్ చేస్తోన్న హాట్ ఫొటోను ఇన్‌స్టాగ్రామ్‌లో స్టోరీగా పెట్టుకుంది. దీనికి ‘ఎవరైతే కలిసి తింటూ.. కలిసి వర్కౌట్ చేసుకుంటారో.. వాళ్లెప్పటికీ కలిసే ఉంటారు' అంటూ షాకింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చింది. దీంతో ఈమె షేర్ చేసిన ఈ ఫొటోకు నెటిజన్ల నుంచి భారీ స్పందన దక్కుతోంది. దీంతో ఇది విపరీతంగా వైరల్ అవుతోంది.

  English summary
  Kamal Hassan's lovely daughter Shruti Hassan Now Dating with Santanu Hazarika. Recently She Shared Romantic Workout Photo In Instagram.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X