చిరంజీవితో అలా బలవంతంగా చేయించారు.. హీరోయిన్లతో ఇలాంటివి ఆపాలి: శ్రుతి హాసన్
యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రుతి హాసన్ తనదైన శైలీలో మంచి గుర్తంపు తెచ్చుకుంది. ముందుగా సింగర్ గా కెరీర్ ప్రారంభించిన బ్యూటిఫుల్ శ్రుతి హాసన్ తర్వాత నటిగా మారింది. అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ స్టార్ హీరోయిన్ గా ఎదగడమే కాకుండా లక్కీ భామ అనిపించుకుంది. ఇక ఇటీవల మెగాస్టార్ చిరంజీవితో వాల్తేరు వీరయ్య సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించిన తాజాగా షాకింగ్ కామెంట్స్ చేసింది ఈ గ్లామరస్ బ్యూటి.
సూపర్ హిట్: యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్ కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది గ్లామరస్ బ్యూటి శ్రుతి హాసన్. తెలుగులోఅనగనగా ఓ ధీరుడు సినిమాతో.. హిందీలో లక్ మూవీతో అడుగు పెట్టిన శ్రుతి హాసన్ కు ఆ సినిమాలు అంతగా కలిసి రాలేదు. కానీ తర్వాత రానురాను తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది. అగ్ర హీరోలతో ఆమె నటించిన సినిమాలన్ని దాదాపుగా సూపర్ హిట్ సాధించాయి.

ఫ్లాప్ హీరోలకు: వరుస ఫ్లాప్స్ తో కొట్టు మిట్టాడుతున్న స్టార్ హీరోల సరసన శ్రుతి హాసన్ నటించడంతో అవి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాయి. దీంతో ఆమె లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ సలార్ లో నటిస్తోంది ఈ చిన్నది. ఈ సినిమానే కాకుండా హాలీవుడ్ లో కూడా ఐ అనే సినిమాతో అలరించేందుకు సిద్దమైంది మోస్ట్ బ్యూటిఫుల్ శ్రుతి హాసన్.
భారీ చిత్రాల్లో: ఇదిలా ఉంటే ఈ ఏడాది తెలుగు చిత్ర పరిశ్రమలో అగ్ర నిర్మాణ సంస్థలైన మైత్రీ మూవీ మేకర్స్ చిత్రాల్లో శ్రుతి హాసన్ నటించిన విషయం తెలిసిందే. అవి బాలకృష్ణ వీర సింహా రెడ్డి ఒకటి అయితే రెండోది మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేరు వీరయ్య. ఈ సినిమా ప్రమోషన్స్ కు, ప్రీ రిలీజ్ ఈవెంట్ కు శ్రుతి హాసన్ రాకపోవడంతో అప్పుడు చర్చ జరిగింది. దీనిపై చిరు ఫన్నీ కామెంట్స్ కూడా చేశారు.

వివాదంగా కామెంట్స్: అయితే తర్వాత తనకు ఆరోగ్యం బాలేకపోవడంతోనే వాల్తేరు వీరయ్య ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రాలేకపోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా కూడా తెలిపింది శ్రుతి హాసన్. ఇదిలా ఉంటే తాజాగా ఆమె పాల్గొన్న శ్రుతి హాసన్ ఫ్యాన్స్ ఫెస్టివల్ లో మాట్లాడిన మాటలు వివాదంగా మారాయి. వాల్తేరు వీరయ్య సినిమాలో బలవంతంగా తనతో మంచులో డ్యాన్స్ చేయించినట్లుగా ఉన్నాయి ఆ వ్యాఖ్యలు.
ఆ మాత్రం చేయలేవా: "మంచులో డ్యాన్స్ చేయడం చాలా కష్టం. హీరోలు చలిని ఆపుకునేందుకు జాకెట్స్ వేసుకుంటారు. కానీ మాకు జాకెట్, కోట్, కనీసం శాలువ కూడా ఇవ్వరు. కేవలం శారీ, జాకెట్ వేసుకుని ఆ మంచులో డ్యాన్స్ చేయాలి. దయచేసి హీరోయిన్ల విషయంలో ఇలాంటివి ఆపాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను ఇది రీసెంట్ గా నే అనుభవించాను" అని శ్రుతి హాసన్ తెలిపింది. ఈ కామెంట్స్ వైరల్ కావడంతో అందుకే తను ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రాలేదని, 15, 20 నిమిషాల పాత్ర కోసం కోట్లకు కోట్లు తీసుకుంటున్నప్పుడు ఆ మాత్రం చేయలేవా అంటూ నెటిజన్లు ఫైర్ అవుతున్నారు.


Click it and Unblock the Notifications











