Shruti Haasan: అది చూపించమని అడిగిన నెటిజన్.. శ్రుతి హాసన్ ఏ ఫొటో పెట్టిందంటే?

ప్రస్తుత కాలంలో సోషల్ మీడియా వాడకం విపరీతంగా పెరిగిపోయిన విషయం తెలిసిందే. సోషల్ మీడియాను సాధారణ యువతీయువకుల నుంచి స్టార్ సెలబ్రిటీల వరకు అంతా ఉపయోగించుకుంటారు. సినీ ప్రమోషన్స్, అభిమానులతో ఇంటరాక్ట్ తదితర యాక్టివిటీస్ చేస్తుంటారు. అయితే ఒక్కోసారి నెటిజన్ల నుంచి ముద్దుగుమ్మలు హీరోయిన్లకు వింత అనుభవాలు ఎదురవుతుంటాయి. విచిత్రమైన ప్రశ్నలు కూడా వేస్తుంటారు. వాళ్ల క్వశ్చన్స్ కు హీరోయిన్లు కూడా పాజిటివ్ గా స్పందించడం, స్ట్రాంగ్ రిప్లైస్ ఇవ్వడం వంటివి చేస్తారు. తాజాగా గ్లామరస్ బ్యూటి శ్రుతి హాసన్ (Shruti Haasan)కు అలాంటి అనుభవం ఎదురైంది.

మొదట గాయనిగా:లోక నాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) కుమార్తెగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది గ్లామరస్ బ్యూటి శ్రుతి హాసన్. మొదటగా సింగర్ గా తన టాలెంట్ ఏంటో నిరూపించుకుని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. అనంతరం హీరోయిన్ గా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె మొదటగా హిందీ పరిశ్రమలో డెబ్యూ చేసింది. లక్ అనే మూవీతో అడుగుపెట్టిన శ్రుతి హాసన్ కు అంతగా లక్ కలిసి రాలేదు.

Shruti Haasan Shocking Reply To Netizen Who Asks About Show Feet Pic

అతనితో రెండు:బాలీవుడ్ మూవీ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అనగనగా ఓ ధీరుడు సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయింది బ్యూటిఫుల్ శ్రుతి హాసన్. సిద్ధార్థ్ హీరోగా చేసిన ఈ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద అంతగా మెప్పించలేకపోయింది. దీంతో శ్రుతి హాసన్ కు తొలి రెండు చిత్రాలతో ఫెయిల్యూర్ గా మిగిలింది. తర్వాత మళ్లీ సిద్ధార్థ్ తోనే ఓ మై ఫ్రెండ్ మూవీ చేసింది. అది కాస్తా ఓకే అనిపించుకుంది.

హిట్ హీరోయిన్ గా:ఇక పవన్ కల్యాణ్ గబ్బర్ సింగ్ సినిమాతో సాలిడ్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది శ్రుతి హాసన్. అనంతరం రానురాను తెలుగు సినీ ఇండస్ట్రీలో హిట్ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది ఈ బ్యూటి. బలుపు, ఎవడు, రేసుగుర్రం, శ్రీమంతుడు, క్రాక్, వీర సింహా రెడ్డి, వాల్తేరు వీరయ్య వంటి సినమాలతో మంచి బ్లాక్ బస్టర్స్ తన కెరీర్ లో ఉండేలా చేసుకుంది.

Shruti Haasan Shocking Reply To Netizen Who Asks About Show Feet Pic

సలార్-ఐ:అగ్ర హీరోలతో శ్రుతి హాసన్ నటించిన సినిమాలన్ని దాదాపుగా సూపర్ హిట్ సాధించాయి. దీంతో ఆమె లక్కీ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు ప్రభాస్ సరసన పాన్ ఇండియా మూవీ సలార్ (Salaar)లో నటిస్తోంది ఈ చిన్నది. ఈ సినిమానే కాకుండా హాలీవుడ్ లో కూడా 'ది ఐ' (The Eye) అనే సినిమాతో అలరించేందుకు సిద్దమైంది మోస్ట్ బ్యూటిఫుల్ శ్రుతి హాసన్. ఇక శ్రుతి నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా కూడా ఉంటుంది.

Shruti Haasan Shocking Reply To Netizen Who Asks About Show Feet Pic

అన్నింటికి ఫొటోలు:తాజాగా నెటిజన్స్ కు ఫొటోల ద్వారా సమాధానం ఇస్తానంటూ చెప్పి ఆస్క్ మీ ఎనీథింగ్ అనే చిట్ చాట్ నిర్వహించింది శ్రుతి హాసన్. ఈ సెషన్ లో చిన్నప్పటి పిక్ పెట్టమని, రెడ్ డ్రెస్ ఫొటో పోస్ట్ చేయమని, బాయ్ ఫ్రెండ్ శాంతాను హజారికాతో కలిసి ఉన్న పిక్ పెట్టమని ఒక్కొక్కరూ ఒక్కోలా అడిగారు. అలా అన్నింటికి ఫొటోలోను షేర్ చేసిన శ్రుతి హాసన్ కు ఓ నెటిజన్ వింత క్వశ్చన్ వేశాడు.

Shruti Haasan Shocking Reply To Netizen Who Asks About Show Feet Pic

బై అంటూ:నీ పాదాల ఫొటో చూపించు అని శ్రుతి హాసన్ ను ఓ నెటిజన్ కోరాడు. దానికి ఆమె మొత్తం వెంట్రుకలతో ఉన్న వింత జంతువు, ఏలియన్ వంటి కాలు ఫొటోను పోస్ట్ చేసింది. అది ఐ మూవీలో విక్రమ్ పిక్ లా అనిపించింది. తన పాదాలు ప్రస్తుతం అలా వెంట్రుకలతో ఉన్నాయని ఇన్ డైరెక్ట్ గా చెప్పిందా.. లేదా నెటిజన్ కు సెటైర్ వేసిందా అనేది తెలియరాలేదు. ఈ ఫొటోతో బై కూడా చెప్పేసింది ముద్దుగుమ్మ శ్రుతి హాసన్.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X