For Quick Alerts
  ALLOW NOTIFICATIONS  
  For Daily Alerts

  ప్రియుడికి శృతి హాసన్ సర్‌ప్రైజ్: స్పెషల్ డేన ఆ రొమాంటిక్ ఫొటోలు షేర్ చేసి మరీ!

  |

  శృతి హాసన్.. ఈ పేరుకు పెద్దగా పరిచయం అవసరం లేదు. అంతలా ఈ అమ్మడు చాలా కాలం క్రితమే దక్షిణాదితో పాటు ఉత్తరాదిలోనూ ఫాలోయింగ్‌ను పెంచుకుంది. అంతేకాదు, వరుసగా ఆఫర్లను దక్కించుకుంటూ హవాను చూపిస్తోంది. మరీ ముఖ్యంగా టాలీవుడ్‌లో శృతి తక్కువ సమయంలోనే స్టార్‌డమ్‌ను సొంతం చేసుకుంది. అప్పటి నుంచి వెనుదిరిగి చూడకుండా దూసుకెళ్తోంది. కెరీర్ పరంగా మాంచి ఫామ్‌లో ఉన్న ఈ చిన్నది.. పర్సనల్‌ లైఫ్‌ను కూడా విపరీతంగా ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే శాంతను హజారికా అనే కుర్రాడితో డేటింగ్ చేస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా అతడిని శృతి హాసన్ సర్‌ప్రైజ్ చేసింది. అసలేం జరిగింది? ఆ పూర్తి వివరాలు మీ అందరి కోసం!

  కమల్ కూతురే.. ఫుల్ ఫేమస్

  కమల్ కూతురే.. ఫుల్ ఫేమస్


  దిగ్గజ నటుడు కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చినా.. శృతి హాసన్ చాలా తక్కువ సమయంలోనే మంచి గుర్తింపును అందుకుంది. ఆకట్టుకునే అందం.. అద్భుతమైన నటనతో అందరినీ ఫిదా చేసింది. నటిగానే కాదు.. సింగర్‌గానూ సత్తా చాటిన ఈ ముద్దుగుమ్మ వరుస పెట్టి ఎన్నో ఆల్బమ్‌లను కూడా క్రియేట్ చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా ఫుల్ ఫేమస్ అయిపోయింది.

  స్టార్ హీరోతో ఒకే రూంలో దిశా పటానీ రచ్చ: ఫొటో షేర్ చేయడంతో బుక్కైన సినీ జంట

  టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్

  టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్

  శృతి హాసన్ తెలుగు సినీ ఇండస్ట్రీలోనూ చాలా తక్కువ సమయంలోనే స్టార్ స్టేటస్‌ను దక్కించుకుంది. ఈ క్రమంలోనే బడా హీరోలు అందరితోనూ ఆడిపాడింది. తద్వారా టాలీవుడ్‌లో లక్కీ హీరోయిన్‌ అనే పేరుకు కూడా సంపాదించుకుంది. ఫుల్ ఫామ్‌లో ఉన్నప్పుడే చాలా కాలం గ్యాప్ తీసుకుని 'క్రాక్' మూవీతో రీఎంట్రీ ఇచ్చింది. దీని తర్వాత 'వకీల్ సాబ్'లోనూ మెరిసింది.

  వరుస చిత్రాలతో ఫుల్ బిజీ

  వరుస చిత్రాలతో ఫుల్ బిజీ

  టాలీవుడ్‌లోకి రీఎంట్రీ ఇచ్చిన తర్వాత శృతి హాసన్ మరింత బిజీగా మారిపోయింది. ఇప్పటికే ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబినేషన్‌లో వస్తోన్న 'సలార్' మూవీలో నటిస్తోన్న ఈ సుందరాంగి.. మరిన్ని ప్రాజెక్టులను కూడా లైన్‌లో పెట్టుకుంది. ఇందులో భాగంగానే బాలయ్య - గోపీచంద్ సినిమాలో భాగం అయింది. అలాగే, ఈ చిన్నది చిరంజీవి - బాబీ సినిమాలోనూ నటించబోతుంది.

  Samantha: మరోసారి సమంత అందాల ఆరబోత.. వాళ్ల కోసం దిగిన పిక్‌లో దారుణంగా!

  లవ్ ట్రాక్‌తో ఫేమస్.. బ్రేకప్

  లవ్ ట్రాక్‌తో ఫేమస్.. బ్రేకప్

  సినిమాల పరంగా ఎంతటి గుర్తింపును సంపాదించుకుందో.. లవ్ ట్రాకుల వల్ల కూడా శృతి హాసన్ అంతే ఫేమస్ అయింది. గతంలో ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో ఆమె చాలా కాలం పాటు డేటింగ్ చేసింది. అంతేకాదు.. అతడితో పెళ్లికి కమల్ కూడా ఒప్పుకున్నాడని ప్రచారం జరిగింది. కానీ, ఊహించని విధంగా శృతి అతడికి బ్రేకప్ చెప్పేసిన విషయం తెలిసిందే.

  ఇప్పుడు అతడితో డేటింగ్

  ఇప్పుడు అతడితో డేటింగ్

  మైకేల్‌తో బ్రేకప్ అయిన వెంటనే శృతి హాసన్.. శాంతను హజారికా అనే డూడుల్ ఆర్టిస్టుతో లవ్ ట్రాక్‌ను మొదలెట్టింది. అతడితో ప్రేమ గురించి బహిరంగంగానే ప్రకటించిన ఈ సుందరాంగి.. ఓ రేంజ్‌లో ఎంజాయ్ చేస్తోంది. ఇందులో భాగంగానే వీళ్లిద్దరూ పెళ్లి చేసుకోకుండానే ముంబైలో ఒకే ఇంట్లో కలిసి ఉంటున్నారు. అలాగే, పబ్బులు, పార్టీలు ఇలా తెగ హల్‌చల్ చేస్తున్నారు.

  RRR 6 Days Collections: మహేశ్ ఆల్‌టైం రికార్డు బ్రేక్.. 6 రోజుల్లోనే అన్ని కోట్ల టార్గెట్ ఫినీష్

  ఆ ఫొటోలన్నీ షేర్ చేసింది

  ఆ ఫొటోలన్నీ షేర్ చేసింది

  సోషల్ మీడియాలో శృతి హాసన్ ఎంత యాక్టివ్‌గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇందులో తన కెరీర్ విషయాలతో పాటు ప్రియుడితో గడుపుతున్న మధురమైన క్షణాల గురించి కూడా ప్రస్తావిస్తుంటుంది. ఇందులో భాగంగానే తాజాగా ఈ స్టార్ హీరోయిన్ శాంతనుతో కలిసి దిగిన కొన్ని పర్సనల్ ఫొటోలను షేర్ చేసింది. దీనికి కారణం మార్చి 31న అతడి పుట్టినరోజు కావడమే.

  Recommended Video

  Bigg Boss Telugu OTT : Bindu Madhavi ప్రభంజనానికి అడ్డుపడుతున్న Akhil Sarthak | Filmibeat Telugu
  ఏంజిల్ అంటూ స్పెషల్‌గా

  ఏంజిల్ అంటూ స్పెషల్‌గా

  శాంతను బర్త్‌డేను పురస్కరించుకుని అతడితో దిగిన రొమాంటిక్ ఫొటోలను శృతి హాసన్ షేర్ చేసింది. అలాగే, 'నా లవ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. నీ శక్తి గురించి తెలుసుకునేందుకు ఈ ప్రపంచమే ముందుకు వచ్చింది. నీ గురించి రోజూ కొత్తగా తెలుసుకుంటున్నందుకు సంతోషంగా ఉంది. హ్యాపీ బర్త్‌డే మై ఏంజిల్' అంటూ శృతి హాసన్ స్పెషల్‌గా విషెస్ తెలిపింది.

  English summary
  Kamal Hassan's lovely daughter Shruti Hassan Now Dating with Santanu Hazarika. Recently She Sends Special Birthday Wishes to Him.
   
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X