కొత్త ప్రియుడి కౌగిట్లో బందీగా శృతి హాసన్.. హాట్ హాట్ పిక్స్ తో హల్చల్!

సాధారణంగా సినిమా వాళ్ల పర్సనల్ విషయాలు తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపిస్తూ ఉంటారు. మరీ ముఖ్యంగా హీరోహీరోయిన్ల మధ్య ఎఫైర్స్ ఏమైనా ఉన్నాయి అంటే మరి ఆసక్తిగా గమనిస్తూ ఉంటారు. ఇక హీరోయిన్స్ బాయ్ ఫ్రెండ్స్ గురించి కూడా తెగ వెతికేస్తూ ఉంటారు. కమల్ హాసన్ పెద్ద కుమార్తె టాలీవుడ్ హీరోయిన్ శృతిహాసన్ విషయానికి వస్తే ఈ అమ్మడి కెరీర్ మళ్లీ సెట్ రైట్ అయింది. చాలా కాలం పాటు తెలుగు సినిమాలకు దూరంగా ఉన్న ఈ అమ్మడు ఈ ఏడాది మొదట్లో సంక్రాంతి సందర్భంగా విడుదలైన క్రాక్ సినిమాతో సూపర్ హిట్ అందుకొని మళ్ళీ హీరోయిన్ గా సెట్ అయ్యింది. అయితే ఈ భామ ఆ మధ్యకాలంలో ప్రేమలో పడి సినిమాలకు దూరమైంది.

కొత్త బాయ్ ఫ్రెండ్ తో

కొత్త బాయ్ ఫ్రెండ్ తో

ఏకంగా ఈ భామ కొన్నేళ్లపాటు సినిమాలు అన్ని పక్కన పెట్టి మాజీ ప్రియుడు ఇంగ్లాండ్ సింగర్ అయిన మైకేల్ కురిసెలేతో పీకల్లోతు ప్రేమలో మునిగి న సంగతి తెలిసిందే. ఎంతలా అంటే ఒకసారి ఆయనను ఇండియాకి తీసుకు వచ్చి తన తండ్రి తల్లిదండ్రులు కూడా పరిచయం చేసింది. ఇంకేముంది ఇక తర్వాత కార్యక్రమం పెళ్లి అని అందరూ భావిస్తున్న తరుణంలో అతనికి దూరం అయింది.

అయితే వారు దూరం కావడానికి కారణాలు ఏమున్నాయో మనకు తెలియదు కానీ ఆ తర్వాత చాలా రోజుల పాటు డిప్రెషన్ లో ఉండిపోయింది శృతి. చివరికి మళ్లీ తెలుగులో అవకాశాలు రావడం, హిట్ కొట్టడంతో ఇప్పుడు ఏకంగా ప్రభాస్ తో సినిమా చేసే అవకాశం దక్కించుకుంది.

కమల్ హాసన్ కి ఒక మరిచిపోలేని గిఫ్ట్

కమల్ హాసన్ కి ఒక మరిచిపోలేని గిఫ్ట్

ఇక ఈ భామ కొత్తగా మరో కుర్రాడితో ప్రేమలో పడింది. ముంబైకి చెందిన సంతాను హజారికాతో కలిసి చెన్నైలో ఆ మధ్య హంగామా చేసింది. స్వయంగా ఆయన ఆర్టిస్ట్ కావడంతో కమల్ హాసన్ కి ఒక మరిచిపోలేని గిఫ్ట్ ఇచ్చాడు.

రాజకీయ ప్రక్షాళన కోసం రంగంలోకి దిగిన కమల్ ఒక చేతిలో గొడ్డలి మరో చేతిలో పట్టుకుని నడుచుకుంటూ వస్తున్నట్లు స్వయంగా గీసిన ఒక ఆర్ట్ ను శృతి బాయ్ ఫ్రెండ్ కమల్ హాసన్ కి గిఫ్ట్ కూడా చేశాడు.ఇంకేముంది అతనితో పెళ్లి కన్ఫామ్ అన్నట్లుగా పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది.

లాక్ డౌన్ లో లాకయి

లాక్ డౌన్ లో లాకయి

అయితే ముంబైలో ప్రస్తుతం లాక్ డౌన్ నడుస్తుండటంతో శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ తో కలిసి ఇంట్లోనే ఉంటుంది. వీరిద్దరికీ కంపెనీగా వారి పెంపుడు పిల్లి సందడి చేస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసిన శృతిహాసన్ పెద్దగా రాసుకొచ్చింది. తన బాయ్ ఫ్రెండ్ కౌగిట్లో ఒదిగిపోతూ పిక్స్ షేర్ చేసింది ఈ భామ.

ఇది చాలా కఠినమైన సమయం అని పేర్కొన్న శృతి ఈ సమయలో తాను చాలా వెర్రి పనులు, సృజనాత్మక పనులు చేస్తున్నానని చెప్పుకొచ్చింది. కనికరంలేని ఫోటోబాంబర్లతో విసుగు తెప్పిస్తున్నా సరేనా కోసం ఉన్న లాక్‌డౌన్ బడ్డీలకు కృతజ్ఞతలు అని పేర్కొంది. బాధపడుతున్న ప్రతి ఒక్కరి కోసం తాను ప్రార్ధన చేస్తున్నానని అన్నారు. నా శక్తిని వెలికి తీయడం కోసం నేను ధ్యానం చేస్తున్నానని పేర్కొంది.

Recommended Video

Apsara Rani & Other Celebs About RaviTeja In Krack Event | Filmibeat Telugu
ఇంతకీ ఎవరీయన ?

ఇంతకీ ఎవరీయన ?

ప్రస్తుతం శ్రుతి హాసన్ సంతాను హజారికాతో డేటింగ్‌లో ఉందనే విషయం వీరిద్దరి పిక్స్ అలాగే క్లోజ్ నెస్ ను బట్టి అర్థమవుతుంది. అయితే అసలు ఇతడు శ్రుతి హాసన్‌కు ఎక్కడ పరిచయం అయ్యాడనే విషయం మాత్రం తెలియదు. సంతాను హజారికా అసోం రాష్ట్రానికి చెందిన యువకుడు, నెం 1 ఆర్టిస్ట్. గువహతి ఆర్ట్ ప్రాజెక్ట్‌ కు ఈయన కో ఫౌండర్.

2014 డూడుల్ ఆర్ట్ కాంబినేషన్‌లో బెస్ట్ డూడల్ ఆర్టిస్ట్‌గా సంతాను గెలుపొందాడు. ఇతగాడికి ఇన్స్‌టాగ్రామ్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. శ్రుతి హాసన్‌తో పోల్చితే తక్కువే అయినా ఆయన ఫీల్డ్ లో ఇంతమంది ఫాలోవర్లను సంపాదించడం గొప్ప విషయమే.అయితే కొద్దిరోజుల క్రితమే తన కొత్త బాయ్‌ఫ్రెండ్‌ను అందరికీ పరిచయం చేసిన శ్రుతి హాసన్.. కాస్త వీలు చూసుకుని అతడు తనకు ఎప్పుడు ఎలా పరిచయం అయ్యాడనే విషయాన్ని చెబుతుందేమో చూడాలి మరి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X