ప్రియుడితో రెడ్ హాండెడ్‌గా పట్టుబడ్డ శృతిహాసన్.. కొత్త బాయ్‌ఫ్రెండ్ ఎవరంటే..

అందాల భామ శృతి హాసన్ కెరీర్ మరోసారి గాడిన పడింది. గత కొద్దికాలంగా సక్సెస్‌కు దూరమైన ఈ సుందరి తాజాగా క్రాక్ సినిమాతో హిట్‌ను తన ఖాతాలో వేసుకొన్నారు. క్రాక్ విజయంతో భారీగా ఆఫర్లను మరోసారి దక్కించుకొనే ప్రయత్నంలో ఉన్నారు. అయితే 35వ బర్త్‌డేను జరుపుకొంటున్న శృతి తాజాగా కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో ముంబై వీధుల్లో చెట్టాపట్టాలేసుకొని మీడియాకు రెడ్ హ్యాండెడ్‌గా చిక్కారు. కొత్త ప్రియుడితో రొమాన్స్ గురించిన వివరాల్లోకి వెళితే..

మరింత గ్లామర్‌గా శృతి హాసన్.. క్రాక్ విజయంతో మరింత జోష్‌గా

మైఖేల్ కోర్సలేతో బ్రేకప్

మైఖేల్ కోర్సలేతో బ్రేకప్

గతంలో లండన్‌కు చెందిన మైఖేల్ కోర్సలేతో శృతి హాసన్ పీకల్లోతూ ప్రేమలో మునిగిపోయారు. దాదాపు పెళ్లి చేసుకొని కాపురం చేసినంత పని చేశారు. నవ దంపతుల మాదిరిగా చెన్నైలో జరిగిన ఓ పెళ్లికి హాజరయ్యారు. వారిద్దరి వివాహం పక్కా అని అనుకొనే క్రమంలో వారి మధ్య అభిప్రాయ బేధాలు రావడం, అవి పరిష్కరించుకొనే వీలు లేకపోవడంతో 2019లో విడిపోయారు. మైఖేల్‌ కోర్సలేతో విడిపోయిన తర్వాత శృతి ఒంటరిగానే ఉంటూ వచ్చారు.

అఫైర్ గురించి లైవ్‌లో శృతి

అఫైర్ గురించి లైవ్‌లో శృతి

ఇటీవల ఇన్స్‌టాగ్రామ్‌లో అభిమానులతో లైవ్‌లో ముచ్చటిస్తుండగా రిలేషన్‌షిప్ గురించి చర్చ జరిగింది. మళ్లీ ప్రేమలో పడ్డారా? బాయ్ ఫ్రెండ్ గురించి వివరాలు చెప్పడం అంటూ ఓ ఫ్యాన్ అడిగితే.. బాయ్ ఫ్రెండ్ ఉన్నారు. నేను ఎప్పుడూ ప్రేమలో ఉంటూనే ఉంటాను. ఆ విషయంలో సందేహం అక్కర్లేదు అంటూ కొంటెగా జవాబిచ్చారు.

కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో ముంబైలో చక్కర్లు

కొత్త బాయ్‌ఫ్రెండ్‌తో ముంబైలో చక్కర్లు

ఇక శృతి హాసన్ తాజాగా ఓ వ్యక్తితో డేటింగ్ చేస్తూ ముంబైలో పలు రెస్టారెంట్లలో మీడియా కంటపడినట్టు వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఆ వార్తలకు బలం చేకూరేలా జనవరి 27వ తేదీన బాయ్‌ఫ్రెండ్‌తో నడి రోడ్డు మీద చేతిలో చేయి వేసుకొని డేటింగ్ చేస్తూ కనిపించడం మీడియా కెమెరాలకు చిక్కింది. గతంలో అదే వ్యక్తితో పలుమార్లు కనిపించినట్టు సోషల్ మీడియాలో ఫోటోలు తెగ వైరల్ అయ్యాయి.

ప్రియుడి చేతిని పట్టుకొని రోడ్డు దాటుతూ

ప్రియుడి చేతిని పట్టుకొని రోడ్డు దాటుతూ

తాజాగా మీడియాకు చిక్కిన వీడియోలో జీన్స్, టీషర్ట్ వేసుకొన్న శృతి హాసన్ ముఖాని మాస్క్ ధరించి రద్దీ ప్రదేశంలో ప్రియుడి చేతిని పట్టుకొని రోడ్డు దాటేందుకు ప్రయత్నిస్తూ కనిపించింది. స్పీడ్ వెళ్లున్న వాహనాలు భయపడి ప్రియుడిని చేతిని పట్టుకొని చేరువైనట్టు వీడియోలో కనిపించింది. అయితే ప్రియుడు కూడా మాస్క్ ధరించి ఉండటంతో అతడు ఎవరనేది మిస్టరీగానే మారింది.

ప్రభాస్‌తో కలిసి సలార్‌లో శృతి హాసన్

ప్రభాస్‌తో కలిసి సలార్‌లో శృతి హాసన్

ఇక శృతి హాసన్ కెరీర్ విషయానికి వస్తే.. రవితేజతో కలిసి నటించిన క్రాక్ చిత్రం ఘనం విజయం సాధించి సంక్రాంతి రేసులో బ్లాక్ బస్టర్‌గా నిలివడంతో ఈ భామ కెరీర్ రాకెట్ స్పీడ్ అందుకొన్నది. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో వస్తున్న సలార్ సినిమాలో ఆఫర్‌ను చేజిక్కించుకొన్నారు. ఇంకా పలు భారీ ప్రాజెక్టుల్లో నటించే విషయంపై చర్చలు జరుగుతున్నట్టు తెలుస్తున్నది.

Recommended Video

Salaar Updates : Shruti Haasan Joins Prabhas Starrer Salaar

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X