twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    నా ఆరోగ్య సమస్యలు పట్టవా.. ట్రోలింగ్స్‌పై శృతీ హాసన్ దిమ్మతిరిగే కౌంటర్

    |

    సింగర్‌గా, యాక్టర్‌గా అనతి కాలంలోనే బడా ఇమేజ్‌ను సొంతం చేసుకుంది కమల్ హాసన్ కూతురు శృతీ హాసన్. తండ్రి చాటు బిడ్డగా కాకుండా సొంత టాలెంట్‌లో ఎన్నో అవకాశాలను అందిపుచ్చుకుంది. కెరీర్ ఆరంభంలో చేతి నిండా సినిమాలతో ఈ చిన్నది బిజీ బిజీగా గడిపింది. అయితే, ఆ తర్వాత ఇంగ్లండ్ గాయ‌కుడు మైకేల్ కోర్స‌లేతో ప్రేమ‌లో ప‌డడంతో తన సినీ జీవితాన్ని ప్రశ్నార్థకం చేసుకుంది.

    బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేసి..

    బాయ్‌ఫ్రెండ్‌కు బ్రేకప్ చెప్పేసి..

    ఇటీవలే అతడికి బ్రేకప్ చెప్పేసి, మరోసారి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది. తాజాగా ఆమె పలు చిత్రాలు చేయడానికి సైతం సంతకాలు చేసేసింది. అలాగే, మరికొన్ని అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చింది. ఈ సందర్భంగా తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. ఇందులో భాగంగానే తనపై వచ్చిన రూమర్స్ గురించి ప్రస్తావించింది.

    ఆరోగ్య సమస్యలపై...

    ఆరోగ్య సమస్యలపై...

    ఈ విషయాలను ప్రస్తావిస్తూ.. ‘‘గతంలో చాలా మంది ‘శృతీ హాసన్‌కు పెళ్లైపోయింది', ‘శృతీ హాసన్ లావైంది' అంటూ వాళ్లకు ఇష్టమొచ్చినట్లు నన్ను ట్రోల్ చేశారు. ఆ సమయంలోనే నేను చాలా బాధపడ్డాను. నాకు అప్పుడు ఆరోగ్య సమస్యలు వచ్చాయి. వాటి నుంచి బయటపడేందుకు పదేళ్లు సమయం తీసుకున్నాను. మనుషులెవరికైనా ఆరోగ్య సమస్యలు వస్తాయి. నాకు కొంచెం ప్రేమ కావాలి. అందుకే సైలెంట్‌గా ఉండిపోయాను'' అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

    ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే రిప్లై

    ట్రోలర్స్‌కు దిమ్మతిరిగే రిప్లై

    అంతేకాదు, తనపై వచ్చిన ట్రోల్స్‌పై కూడా స్పందించింది. ‘‘గతంలో నా వ్యక్తిగత జీవితంపై చాలా విమర్శలు వచ్చాయి. కానీ, అవేమీ నన్ను ఇబ్బంది పెట్టలేదు. పెట్టవు కూడా. కానీ, నేను ఒకటి గ్రహించాను. విమర్శలు అనేవి ప్రతి ఒక్కరి జీవితంలో వస్తుంటాయి. వాస్తవానికి వారి వారి వ్యక్తిగత జీవితం ఎంతో ముఖ్యమైనది. అలాగే నా వ్యక్తిగత జీవితం నాకు ముఖ్యం'' అంటూ విమర్శలకు గట్టిగానే బదులిచ్చింది.

    ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

    ప్రస్తుతం చేస్తున్న సినిమాలు

    తన ప్రియుడికి బ్రేకప్ చెప్పిన తర్వాత శృతీ హాసన్ సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇస్తోంది. ఇందులో భాగంగానే తమిళంలో విజయ్ సేతుపతి సరసన ‘లాభం' అనే సినిమా చేస్తోంది. అలాగే, తెలుగులోనూ పలు చిత్రాలు చేయడానికి సిద్ధమైంది. ఇవి ప్రస్తుతం చర్చల దశలో ఉన్నాయి.

    English summary
    kamal haasan daughter, young heroine Shruti Haasan responds on trollings. she opened up about being trolled and criticised. Stating that she isn't bothered about it anymore, she said that she also felt sad in the initial stages.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X