సెట్ లో ప్రభాస్.. రూమ్ లో బాయ్ ఫ్రెండ్.. శృతిహాసన్ మూమెంట్స్ మామూలుగా లేవు!

గ్లామరస్ హీరోయిన్ శృతి హాసన్ ఇటీవల కాలంలో తన స్టార్ హోదాను మరో లెవెల్ కు పెంచుకుంటోంది అనే చెప్పాలి. ఈ బ్యూటీకి ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద పెద్దగా సక్సెస్ లేకపోయినప్పటికీ కూడా తెలుగులో కూడా చాలా మంచి అవకాశాలు దక్కించుకుంటోంది. ప్రస్తుతం ప్రభాస్ సలార్ సినిమాలో మెయిన్ హీరోయిన్ గా నటిస్తున్న విషయం తెలిసిందే. అయితే ఒకవైపు సినిమా షూటింగ్ తో బిజీగా ఉంటూనే మరొకవైపు తన బాయ్ ఫ్రెండ్ తో కూడా వీలైనంత ఎక్కువ సమయాన్ని గడిపేందుకు ప్రయత్నం చేస్తోంది. రీసెంట్ గా ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొన్ని వీడియోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే..

స్టార్ హీరోయిన్ గా..

స్టార్ హీరోయిన్ గా..

విశ్వనటుడు కమల్ హాసన్ పెద్ద కూతురు శృతిహాసన్ సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి ఏళ్ళు గడుస్తోంది. అయితే ఈ బ్యూటీ సక్సెస్ ఫెయిల్యూర్ తో సంబంధం లేకుండా ఇండస్ట్రీలో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తోంది. చిన్న హీరోలతో నే కాకుండా అగ్ర హీరోలతో కూడా ఆమె సినిమాలు చేస్తూ చాలా బిజీగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో అయితే చాలా పెద్ద సినిమాలు ఉన్నాయి. అందులో ఏ ఒక్కటి హిట్ అయినా కూడా ఆమె రేంజ్ మరో లెవల్ కు వెళ్ళినట్లే అని చెప్పవచ్చు.

 బాయ్ ఫ్రెండ్ తో..

బాయ్ ఫ్రెండ్ తో..

కేవలం నటిగానే కాకుండా సింగర్ గా మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా శృతి హాసన్ మంచి గుర్తింపుని అందుకుంది. ఆమె కంపోజ్ చేసిన కొన్ని పాటలు కూడా యూట్యూబ్ లో మంచి క్రేజ్ అందుకున్నాయి. సినిమాలతో ఎంత బిజీగా ఉన్నప్పటికీ కూడా తన బాయ్ ఫ్రెండ్ తో కూడా రొమాంటిక్ లైఫ్ తో చాలా బాగా ఎంజాయ్ చేస్తోంది. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో బాయ్ ఫ్రెండ్ కు సంబంధించిన ఫోటోలను వీడియోలను కూడా షేర్ చేసుకుంటోంది.

సలార్ సెట్ లో ప్రభాస్ భోజనాలు

సలార్ సెట్ లో ప్రభాస్ భోజనాలు


శృతి హాసన్ ప్రస్తుతం సలార్ సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో శృతి హసన్ ఒక పవర్ఫుల్ జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. ఆమె పాత్ర సినిమాలో హైలెట్ గా ఉంటుంది అని సమాచారం. అయితే ప్రతిరోజు షూటింగ్ లో ప్రభాస్ భోజనాలతో సర్ ప్రైజ్ ఇస్తున్నట్లు ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటోంది.

 వీడియోస్ వైరల్

వీడియోస్ వైరల్


అయితే రీసెంట్ గా ఇన్స్టాగ్రామ్ స్టోరీ లో శృతి హాసన్ తన బాయ్ ఫ్రెండ్ శాంతను హాజరికాస్ తో కూడా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నట్లు పోస్టులు పెట్టింది. తన బెడ్ రూమ్లో బాయ్ ఫ్రెండ్ తో అల్లరి చేస్తున్న ఒక వీడియోను కూడా పోస్ట్ చేసింది. అంతే కాకుండా ఒక రెస్టారెంట్లో అంకుల్ ఆంటీ అనే తరహాలో కామెడీ చేసిన తన బాయ్ ఫ్రెండ్ వీడియోను కూడా పోస్ట్ చేసింది.

తెలుగులో బిజీగా..

తెలుగులో బిజీగా..

శృతిహాసన్ ఒకవైపు సినిమాలతోనే కాకుండా మరొక వైపు తన ప్రేమ జీవితాన్ని కూడా చాలా సమానంగా మెయింటెన్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ బ్యూటీ సలార్ సినిమాతో పాటు తెలుగులో నందమూరి బాలకృష్ణ తో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. అంతే కాకుండా మరికొన్ని తెలుగు ప్రాజెక్టులను కూడా ఓకే చేసేందుకు కూడా చర్చలు కొనసాగిస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X