ఫోన్ నంబర్ అడిగిన నెటిజన్.. వెంటనే ఆలోచించకుండా ఇచ్చేసిన శృతి హాసన్.. కానీ?
కమల్ హాసన్ కుమార్తెగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శృతి హాసన్ సినిమా రంగంలో తనదైన ముద్ర వేసుకున్న సంగతి తెలిసిందే . తనదైన నటనతో, డ్యాన్స్‌తో టాలెంట్ బయట పెడుతూ కమల్ హాసన్ కుమార్తె గా కాకుండా శృతిహాసన్ గా తన సొంత ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంది . అయితే ఒకరితో ప్రేమలో పడి దాదాపు సినిమాలకు దూరం అయిపోయిన ఈ భామ ఆ ప్రేమ విఫలం కావడంతో మళ్లీ సినిమాల్లో సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించింది.
తెలుగులో రవితేజ హీరోగా వచ్చిన క్రాక్ సినిమాతో హీరోయిన్ గా రీ ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత రెండు నెలల్లో వకీల్ సాబ్ సినిమాతో మరో హిట్ అందుకొని.. తాజాగా ప్రభాస్ సరసన సాలార్ సినిమాలో ఆఫర్ కొట్టేసింది. అయితే ఈ భామ తాజాగా ఒక అభియాని అడిగిన ప్రశ్నకు షాకింగ్ సమాధానం ఇచ్చింది. ఆ వివరాల్లోకి వెళితే..

'లక్' అనే బాలీవుడ్ చిత్రం ద్వారా
ప్రముఖ నటుడు కమల్ హాసన్ మరియు నటి సారికల పెద్ద కుమార్తె శృతి. 2008లో 'లక్' అనే బాలీవుడ్ చిత్రం ద్వారా బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా బాగా హిట్ అయ్యింది. కానీ ఆమెకు మాత్రం పేరు తెచ్చిపెట్టలేదు. తర్వాత 2011 లో ఆమె అనగనగా ఒక ధీరుడు సినీరంతో తెలుగు పరిశ్రమలో అడుగు పెట్టింది. ఈ సినిమా పెద్దగా హిట్ కాలేదు.

పీక్స్ లో ఉందన్న సమయంలో
ఆ తరువాత ఆమె 3, ఓ మై ఫ్రెండ్ సినిమాల్లో కనిపించినా 2012లో వచ్చిన గబ్బర్ సింగ్ సినిమాతో స్టార్ హీరోయిన్ అయిపొయింది. అలా అప్పటి నుంచి ఆమె దక్షిణాదిలో చాలా హిట్ సినిమాలలో భాగం అయింది. అయితే కెరీర్ మంచి పీక్స్ లో ఉందన్న సమయంలో కంగా ఈ భామ కొన్నేళ్లపాటు సినిమాలు అన్ని పక్కన పెట్టి మాజీ ప్రియుడు ఇంగ్లాండ్ సింగర్ అయిన మైకేల్ కురిసెలేతో పీకల్లోతు ప్రేమలో మునిగి పోయింది.

డిప్రెషన్ లో ఉండిపోయి
ఒకసారి ఆయనను ఇండియాకి తీసుకు వచ్చి తన తండ్రి తల్లిదండ్రులు కూడా పరిచయం చేసింది. ఇంకేముంది ఇక తర్వాత పెళ్లి అని అందరూ భావిస్తున్న తరుణంలో అతనికి దూరం అయింది. అయితే వారు దూరం కావడానికి కారణాలు ఏమున్నాయో మనకు తెలియదు కానీ ఆ తర్వాత చాలా రోజుల పాటు డిప్రెషన్ లో ఉండిపోయిన శృతి చివరికి మళ్లీ తెలుగులో అవకాశాలు రావడంతో బాలీవుడ్ లో సైతం బిజీ బిజీగా మారుతోంది.
Recommended Video

పోలీసుల నెంబర్ ఇచ్చి
తాజాగా శృతి హాసన్ తన ట్విట్టర్ లో ఒక చాట్ సెషన్ నిర్వహించింది. ఆ చాట్ సెషన్ లో ఓ అభిమాని తన ఫోన్ నెంబర్ ఇవ్వాలంటూ.. శృతి హాసన్‌ని కోరాడు. దీనికి మామూలుగా అయితే లైట్ తీసుకుంటుందని భావించి ఉంటాడు కానీ శృతి మాత్రం దానికి సమాధానంగా '100' అంటూ పోలీసుల నెంబర్ ఇచ్చి అతనికి ఇచ్చింది. దీనితో ఈ రిప్లై చూసి అంతా శృతి సమయస్ఫూర్తిపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సో ఇక మీదట అయినా ఇలాంటి ప్రశ్నలు అడగకుండా ఉంటే మంచిది.


Click it and Unblock the Notifications











