పేరెంట్స్ కంటబడకుండా ఆ పని చేసేదాన్ని.. :స్టార్ హీరో డాటర్ సీక్రెట్స్ రిలీవ్..
Shruti Haasan: తమిళ స్టార్ హీరోయిన్ శ్రుతిహాసన్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కమలహాసన్ (Kamal Haasan) కూతురుగా ఇండస్ట్రీలో అడుగుపెట్టింది. కానీ, తన అందం, అభినయంతో ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అనతి కాలంలో స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి ఓప్రత్యేక పాపులారిటీని సంపాదించుకుంది. ఈ అమ్ముడు కేవలం నటి మాత్రమే కాదు.. సింగర్‌గా కూడా మంచి గుర్తింపు సంపాదించుకుంది. స్టార్ హీరోయిన్‌గా శృతి హాసన్ తన కెరీర్ ను కొనసాగిస్తుంది. తన తల్లిదండ్రులకు తెలియకుండా ఓ పని చేశానంటూ ఓ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. ఇంతకీ ఏమన్నదంటే?
శృతి హాసన్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటించి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. తెలుగులో ముఖ్యంగా పవన్ కల్యాణ్‌తో నటించిన గబ్బర్ సింగ్, మహేష్‌తో శ్రీమంతుడు సినిమాలలో నటించి, టాలీవుడ్ ప్రేక్షకులకు దగ్గరైంది. దీంతో ఈ అమ్మడుకు వరుస అవకాశాలు చేరువయ్యాయి. ఇదే సమయంలో బాలీవుడ్ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు దక్కించుకుంది.

స్టార్ హీరోయిన్‌గా కొనసాగుతుందనుకున్న శృతి హాసన్ పర్సనల్ లైఫ్ మాత్రం ఒడిదొడుగుల మాయం. కెరీర్ హైప్ లో ఉన్నప్పుడు మైఖేల్ కొసలే అనే వ్యక్తితో శ్రుతి హాసన్ డేటింగ్ చేసింది. పెళ్లికి ముందే ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో కాపురం కూడా పెట్టారు. ఎమైందో తెలియదు. కానీ, వీరి రిలేషన్‌కు 2019లో బ్రేక్ పడింది. విభేదాలు తలెత్తడంతో మైఖేల్ కొసలేకు శ్రుతి హాసన్ బ్రేకప్ చెప్పేసింది. ఆ తరువాత ముంబైకి చెందిన డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికతో శ్రుతి మరోసారి ప్రేమలో పడింది. రెండేళ్లు కొనసాగిన ప్రేమకు కూడా ఇటీవల బ్రేక్ పడినట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే శ్రుతి హాసన్ .. గతంలో తన తల్లిదండ్రుల విడాకుల గురించి కూడా బహిరంగంగా మాట్లాడారు. తాజాగా ఓ ఇంటర్వూలో మాట్లాడుతూ. మత విశ్వాసాలపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. తన తల్లిదండ్రులకు మతంపై నమ్మకం లేనందున రహస్యంగా గుడికి వెళ్లాల్సి వచ్చేదని శృతి చెప్పింది. తన తండ్రి కమల్ హాసన్ నాస్తికుడని, తన తల్లి సారికకు ఆధ్యాత్మిక భావనలు ఉన్నా.. ఆమె ఎప్పుడు కూడా గుడికి వెళ్లలేదు. దీంతో ఇంట్లో దేవుడు, గుడి పేరు వినిపించేది కాదన్నారు. ఇక దేవాలయాలకు వెళ్లే అవకాశం లేకపోయేదని అన్నారు.

వాస్తవానికి తన ఇంటికి, ఆలయం చాలా దూరంలో ఉండనీ, అయినా.. వారానికి ఒకసారి దేవాలయానికి, చర్చికి వెళ్లే దాన్నినని తెలిపారు. ఆ తరువాత కొన్ని రోజులకు తన తాతతో కలిసి మొదటిసారిగా గుడికి వెళ్లాననీ, మొదటిసారి గుడికి వెళ్ళిన అనుభవం తనకు చాలా భిన్నంగా ఉందని చెప్పింది. కానీ, కొంత కాలం తరువాత దేవుడిపై నమ్మకం ఏర్పడిందన్నారు. దీంతో తన తండ్రికి తెలియకుండా దేవాలయాలకు వెళ్లి వచ్చేదానినని చెప్పారు. ఆ అనుభవం చాలా ప్రత్యేకంగా ఉండేదన్నారు. ఆ విషయం తన తండ్రికి తెలియకుండా చాలా కాలం జాగ్రత్త పడేదని అని పేర్కొన్నారు. తనలో దైవభక్తి ఎలా పెరిగిందో తనకు తెలియదనీ, దైవభక్తే తననీ ఈ స్థాయికి చేర్చిందనే అభిప్రాయపడ్డారు.


Click it and Unblock the Notifications











