రవితేజ సినిమాతో గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వనున్న గ్లామరస్ హీరోయిన్

స్వయంకృషితో తెలుగు సినీ ఇండస్ట్రీకి వచ్చాడు మాస్ మహారాజా రవితేజ. కెరీర్ ఆరంభంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా ఎన్నో సినిమాలు చేసి.. ఆ తర్వాత హీరోగా నిలదొక్కుకున్నాడు. ఈ క్రమంలోనే హిట్ చిత్రాలతో స్టార్ హీరోగా ఎదిగిపోయాడు. ఐదు పదుల వయసులోనే ఎంతో ఎనర్జీతో కనిపిస్తూ.. కుర్ర హీరోలకు పోటీగా నిలుస్తున్నాడు. ఏడాదికి రెండు సినిమాలైనా చేసే రవితేజ.. ఈ మధ్య కొంచెం స్పీడు తగ్గించాడు. ప్రస్తుతం అతడు ఒకే ఒక్క సినిమాను చేస్తున్నాడు. అదే 'డిస్కోరాజా'.

'ఎక్కడికి పోతావు చిన్నవాడా' ఫేమ్ వీఐ ఆనంద్ దర్శకత్వంలో 'డిస్కోరాజా' అనే సినిమా చేస్తున్నాడు. కొద్దిరోజులుగా ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఎస్‌‌ఆర్‌‌టీ ఎంటర్‌టైన్మెంట్స్‌ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన పాయల్ రాజ్ పుత్, నభ నటేష్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఎస్‌ఎస్‌ తమన్‌ స్వరకర్త. వెన్నెల కిషోర్, సునీల్‌ ప్రధాన పాత్రలో నటించనున్న ఈ సినిమా సైన్స్ ఫిక్షన్ బ్యాగ్ డ్రాప్‌తో రానుంది. దీంతో ఈ సినిమాపై రవితేజ అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులపై ఎన్నో అంచనాలు ఉన్నాయి.

Shruti Haasan Will Romance With Ravi Teja in Gopichand Malineni Movie

ఈ సినిమా తర్వాత అతడు చేయబోయే దానిపై క్లారిటీ అయితే లేదు. కానీ, ఇటీవల యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని మాత్రం తనతోనే సినిమా చేస్తున్నారంటూ ప్రకటించాడు.'నేను నాగార్జున గారితో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదు. ఆయనకు నేనే ఎటువంటి కథనూ వినిపించలేదు. అసలు మా మధ్య అటువంటి చర్చలు కూడా జరగలేదు. కానీ, నేను త్వరలోనే ఓ రవితేజ గారితో సినిమా స్టార్ట్ చేస్తున్నాను. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతోంది. దానికి సంబంధించిన వివరాలు కొద్దిరోజుల్లో వెల్లడిస్తాము' అని తెలిపాడు.

తాజాగా ఈ సినిమాకు సంబంధించిన ఓ వార్త బయటకు వచ్చింది. ఈ సినిమాలో రవితేజ సరసన గ్లామరస్ హీరోయిన్ శృతి హాసన్ నటిస్తోందట. ఇప్పటికే చిత్ర యూనిట్ ఆమెతో సంప్రదింపులు కూడా జరిపారని ఫిలింనగర్‌లో ఓ వార్త చక్కర్లు కొడుతోంది. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో 'బలుపు' అనే సినిమా వచ్చింది. ఇది మంచి హిట్ అయింది. అలాగే, శృతి - రవితేజ మధ్య కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయింది. ఇదే మరోసారి రిపీట్ అవుతుందేమో చూడాలి.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X