లవర్‌తో శృతిహాసన్ సరసాలు.. ప్రియుడికి ముద్దు ముద్దుగా అలాంటివి నేర్పిస్తూ.. వీడియో వైరల్!

అందాల భామ శృతిహాసన్ కెరీర్‌లో సక్సెస్ కంటే.. అఫైర్లు, బ్రేకప్స్‌తో నిత్య వార్తల్లో ఉంటారు. చాలాకాలంగా పలువురితో డేటింగ్ చేస్తూ మీడియాలో హైలెట్‌గా నిలిచారు. సిద్దార్త్, బ్రిటిష్ సింగర్ లాంటి వ్యక్తులతో శృతిహాసన్ అఫైర్లు నడిపించారు. పెళ్లి వరకు వచ్చాయనుకొన్న రిలేషన్‌షిప్స్ మధ్యలోనే బ్రేకప్ అయ్యాయి. అయితే తాజాగా శంతను హజారికాతో కొన్నేళ్లుగా డేటింగ్ చేస్తున్నది. తాజాగా శంతనుతో సరసాలు ఆడుతున్న వీడియోను పోస్టుచేయగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ వీడియోలో శంతను, శృతిహాసన్ డేటింగ్ వ్యవహారంలోకి వెళితే..

శృతిహాసన్ జీవితంలో బాయ్‌ఫ్రెండ్స్‌తో బ్రేకప్స్, కొత్త ప్రియుడితో కలిసి పోవడం సాధారణంగా జరిగిపోతున్నాయి. దాదాపు 10 ఏళ్ల కాలంలో ఎంతో మందితో ఆమె డేటింగ్ వ్యవహారం సాగింది. అయితే తాజా ప్రియుడు శంతను హజారికాతో మాత్రం సుదీర్ఘకాలంగా అఫైర్ కొనసాగిస్తున్నది. సోషల్ మీడియాలో వారిద్దరూ చేసే హంగామా నెటిజన్లకు జోష్ పుట్టిస్తుంటుంది.

Shruti Haasans lovely video with Santanu Hazarika goes viral in instagram

శంతను హజారికా విషయానికి వస్తే..ముంబైలో స్థిరపడిన ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ఇల్లుస్ట్రేటర్, డూడుల్ క్రియేటర్. డిజిటల్ వరల్డ్ మంచి పాపులారిటి ఉంది. 2015 సంవత్సరంలో వరల్డ్ డూడ్లర్ ఆర్ట్ చాంఫియన్‌షిప్ పోటీల్లో విజేతగా నిలవడంతో శంతను హజారికా పేరు మార్మోగింది. ఆ తర్వాత కొద్ది రోజులకు పార్టీలో శృతిహాసన్‌తో పరిచయం ఏర్పడింది. ఆతర్వాత ఆ పరిచయం ప్రేమగా మారింది.

Shruti Haasans lovely video with Santanu Hazarika goes viral in instagram

శంతను హజారికాతో పీకల్లోతు ప్రేమలో మునిగిన శృతిహాసన్ లాక్‌డౌన్ కాలంలో ముంబైలో సహజీవనం చేశారు. సహజీవనం సమయంలో శృతి షేర్ చేసిన ఫోటోలు వైరల్ అయ్యాయి. వారిద్దరూ మధ్య కెమిస్ట్రీ, సన్నిహితంగా మెదుగుతూ దిగిన ఫోటోలు వైరల్ అయ్యాయి. వారిద్దరి శృంగార లీలలు మీడియాలో చర్చనీయాంశమయ్యాయి. అయినా వారిద్దరూ సోషల్ మీడియాలో రొమాన్స్‌ను కొనసాగించడంలో ఏ మాత్రం తగ్గడం లేదనే విషయం సోషల్ మీడియా పోస్టింగులు తెలియజేస్తున్నాయి.

Shruti Haasans lovely video with Santanu Hazarika goes viral in instagram

తాజాగా శృతిహాసన్ ఇన్స్‌టాగ్రామ్‌లో ఓ వీడియోను పోస్టు చేసింది. ఆ వీడియోలో మంచి రొమాంటిక్ మూడ్‌లో ఉన్నట్టు కనిపించారు. శంతనకు తెలుగు భాషను నేర్పించి.. ఆ మాటలను శంతనుతో చెప్పించే ప్రయత్నం చేసింది. నేను నేర్పించిన తెలుగు మాటలు చెప్పు అని శృతి అంటే.. ఇది నా బంగారం అంటూ శంతను చెప్పి శృతిహాసన్ బుగ్గను చిలిపిగా గిల్లాడు. ప్రస్తుతం ఈ వీడియో ఇన్స్‌టాగ్రామ్ వైరల్ అవుతున్నది.

శృతిహాసన్ విషయానికి వస్తే.. తెలుగులో ఆమె నటించిన సినిమాలు బ్లాక్‌బస్టర్ విజయాలు అందుకొన్నాయి. రవితేజతో క్రాక్ మూవీ, చిరంజవితో వాల్తేరు వీరయ్య, నందమూరి బాలకృష్ణతో వీరసింహారెడ్డి సినిమాలు మంచి బ్రేక్ ఇచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్‌తో సలార్ మూవీలోను, నానితో హాయ్ నాన్నా, ది ఐ అనే ఇంగ్లీష్ చిత్రంలో నటిస్తున్నది. ఇంకా పలు చిత్రాలు అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X