గబ్బర్ సింగ్ అన్నింటికంటే స్పెషల్.. ఆయనంటే క్రష్.. శృతీ హాసన్ కామెంట్స్
మెరుపు తీగలాంటి అందానికి ప్రతిరూపంగా ఉండే శృతిహాసన్.. వరుస విజయాలతో దూసుకుపోయింది. స్టార్ హీరోల సరసన నటించి ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను అందుకుంది. అయితే గత కొన్ని కాలం నుంచి సినిమాలేవీ చేయకుండా దూరంగా ఉంటూ వచ్చింది. ప్రియుడితో బ్రేకప్ అయిన తరువాత మళ్లీ రీ ఎంట్రీ ఇవ్వాలని ఫిక్స్ అయింది. ఈ క్రమంలోనే తమిళంలో విజయ్ సేతుపతితో ఓ చిత్రాన్ని పట్టాలెక్కించింది. ఇటీవలె రవితేజ, గోపిచంద్ మలినేని క్రాక్‌తో టాలీవుడ్‌ను పలకరించేందుకు సిద్దమవుతోంది.

గబ్బర్ సింగ్ స్పెషల్..
ఇటీవలె ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది. ఆమె నటించిన సినిమాలెన్నో సూపర్ హిట్ అయినప్పటికీ.. ఆమె ఆల్ టైం ఫేవరెట్ మాత్రం గబ్బర్ సింగ్ అని చెప్పుకొచ్చింది. రేసుగుర్రం.. బలుపు.. శ్రీమంతుడు లాంటి సినిమాలు తన కెరీర్ లో ఉన్నప్పటికీ.. వేటికవే స్పెషల్ అంటూనే.. గబ్బర్ సింగ్ మాత్రం ఎప్పటికీ ప్రత్యేకమే అని తెలిపింది.

ఆయనంటే క్రష్..
మీరు నటించిన హీరోల గురించి సింగిల్ స్టేట్ మంట్ ఇవ్వమన్నప్పుడు మహేశ్ బాబు హ్యాండ్ సమ్ అని.. అల్లు అర్జున్ పట్టుదలకు నిదర్శనమని చెప్పింది. పవన్ కల్యాణ్ స్టైలిస్ అని.. ప్రభాస్ టాల్ అన్న ఆమె చిన్ననాటి క్రష్ ఎవరంటే మాత్రం హాలీవుడ్ హీరోలియనార్డో డికాప్రియోగా చెప్పింది. తన గురించి మాత్రం చెప్పేందుకు ఇష్టాన్ని ప్రదర్శించలేదు.

నడిపించే శక్తి..
ప్రేమ కోసం ఎప్పుడూ పోరాడటానికి సిద్ధంగా ఉంటానన్న ఆమె.. ప్రేమను నిర్వచించమంటే మాత్రం.. నడిపించే శక్తి అని తేల్చేసింది. సౌత్ ఇండియన్ వంటకాలంటే ఇష్టమే కాదు.. వాటిని చక్కగా వండేస్తానని చెప్పింది. అంతేకాదు.. ఇంట్లో ఇష్టమైన ప్లేస్ ఏదంటే.. కిచెన్ అని చెప్పి ఆశ్చర్యానికి గురి చేసింది.

అక్కడే ఆలోచనలు..
అంతలోనే.. వాస్తవానికి బాత్రూం అంటే ఇష్టమన్న ఆమె.. అక్కడే తనకు చాలా ఆలోచనలు వస్తాయని చెప్పిది. మీలో మీరు కోరుకునే మార్పు అంటే మాత్రం.. సహనాన్ని మరింత పెంచుకోవాలని చెప్పింది. కలలో ఎవరినైనా హగ్ చేసుకోవాల్సి వస్తే.. తాతయ్యను హగ్ చేసుకుంటానని తెలిపింది.


Click it and Unblock the Notifications











