ప్రభాస్ కోసం శృతి హాసన్ భారీ సాహసం: ఏ హీరోయిన్ చేయని పనులకు రెడీ అయిన బ్యూటీ
చూపు తిప్పుకోకుండా చేయగలిగే అందం.. అద్భుతమైన నటనతో దక్షిణాదిలోనే స్టార్ హీరోయిన్‌గా వెలుగొందుతోంది హాట్ బ్యూటీ శృతి హాసన్. లెజెండరీ యాక్టర్ విశ్వనాయకుడు కమల్ హాసన్ కూతురిగా సినిమాల్లోకి ప్రవేశించినప్పటికీ.. తనలోని టాలెంట్లతో చాలా తక్కువ సమయంలోనే దేశ వ్యాప్తంగా ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకుందామె. ఈ క్రమంలోనే వరుసగా ఆఫర్లను అందుకుంటూ కెరీర్‌ను సక్సెస్‌ఫుల్‌గా ముందుకు తీసుకెళ్తోంది. మధ్యలో కొంత గ్యాప్ ఇచ్చినా.. ఇటీవలే సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చి ఫుల్ జోష్‌తో కనిపిస్తోంది. దీంతో ఇప్పుడు చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది.
శృతి హాసన్ ప్రస్తుతం నటిస్తోన్న చిత్రాల్లో 'సలార్' ఒకటి. యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తోన్న ఈ సినిమాను కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్నాడు. పాన్ ఇండియా రేంజ్‌లో రాబోతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకు అనుగుణంగానే దీన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ చాలా రోజుల క్రితమే ప్రారంభం అయింది. అయితే, మధ్యలో పలుమార్లు చిత్రీకరణకు ఆటంకం ఏర్పడింది. దీంతో షూట్‌కు బ్రేకులు పడ్డాయి. ఈ నేపథ్యంలో ప్రభాస్ డేట్స్‌ను బట్టి షెడ్యూళ్లను ప్లాన్ చేసుకుంటున్నారు నిర్మాతలు.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రూపొందుతోన్న 'సలార్' మూవీలో శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోన్న విషయం తెలిసిందే. ఇందులో ఆమె పాత్ర ఎంతో కొత్తగా వైవిధ్యంగా ఉంటుందన్న టాక్ వినిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఆమె ఈ చిత్రంలో ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుగా నటిస్తుందని కూడా ఎఫ్పటి నుంచో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, శృతి హాసన్ పాత్రకు చాలా ప్రాధాన్య కూడా ఉంటుందని అంటున్నారు. దీంతో ఆమె లక్కీ ఛాన్స్ కొట్టేసిందని అంతా అనుకున్నారు. ఈ నేపథ్యంలోనే 'సలార్' మూవీలో శృతి పాత్రకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త తాజాగా బయటకు వచ్చింది.

తాజా సమాచారం ప్రకారం.. 'సలార్' మూవీలో శృతి హాసన్ కొన్ని సాహసాలు చేయబోతుందట. ఇందులో ఆమె పాత్ర ఎంతో హైలైట్‌గా ఉంటుందట. అంతేకాదు, ఆమెతో యాక్షన్ సీన్స్ కూడా చేయించబోతున్నారట. ఇందుకోసం ఈ బ్యూటీ మార్షల్ ఆర్ట్స్‌లో శిక్షణ కూడా తీసుకోబోతుందన్న టాక్ వినిపిస్తోంది. అంటే ఈ సినిమాలో ప్రభాస్‌తో కలిసి ఆమె కూడా ఫైటింగ్ సీన్స్ చేయనుందన్న మాట. ఇక, ఈ ఏడాది ఆరంభంలో వచ్చిన 'క్రాక్' సినిమాలోనూ శృతి హాసన్ ఫైట్ చేసిన విషయం తెలిసిందే. దీనికి ప్రేక్షకుల నుంచి భారీ స్థాయిలో స్పందన వచ్చింది. అందుకే ఆమె మరోసారి ఆ తరహా ప్రయోగం చేస్తుందట.
ఎంతో ప్రతిష్టాత్మకంగా రాబోతున్న 'సలార్' మూవీలో ప్రభాస్ డుయల్ రోల్ చేస్తున్నట్లు చాలా రోజులుగా ఓ న్యూస్ వైరల్ అవుతోన్న సంగతి విధితమే. అంతేకాదు, ఇందులో అతడు తండ్రి కొడుకుగా కనిపించనున్నాడట. ఇక, ఈ మూవీ కథపై ఎన్నో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. కానీ, దేనీ పైనా క్లారిటీ మాత్రం రావడం లేదు. దీంతో ఈ మూవీ తరచూ ట్రెండింగ్ అవుతోంది. ఈ భారీ యాక్షన్ మూవీని హొంబళే ఫిల్మ్ సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాను రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నాడు.


Click it and Unblock the Notifications











