మందు బాగా తాగేదాన్నంటూ షాకింగ్ విషయాలు చెప్పిన శ్రుతీ హాసన్
సినిమా ఇండస్ట్రీలో అందరికీ అన్ని అలవాట్లు ఉంటాయనేది కామన్‌గా వినిపిస్తూ ఉంటుంది. దీనికి హీరోయిన్స్ కూడా అతీతులు కారని కూడా అంటారు. వారు కూడా పార్టీలకు వెళ్లడం, సిగరెట్లు తాగడం, మద్యం సేవించడం లాంటివన్ని చేస్తుంటారని టాక్ వినిపిస్తూ ఉంటుంది. అయితే బయటకు చెప్పడానికి మాత్రం ఇష్టపడరు. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రం ఏ మొహమాటం లేకుండా తాను డ్రింక్ చేస్తానని చెప్పేసిందిప

సెలబ్రెటీల గుట్టు విప్పుతున్న మంచు లక్ష్మీ
అప్పట్లో.. ప్రేమతో మీ లక్ష్మీ అనే టాక్ షోతో మంచు లక్ష్మీ సెలబ్రెటీలను ఇంటర్వ్యూ చేసేది. అయితే మారిన ట్రెండ్ ప్రకారం.. సెలబ్రెటీల మాస్ మాసాల అంశాల గుట్టును బయట పెట్టేందుకు ఫీట్ అప్ విత్ స్టార్ అనే షో ను చేస్తోంది. దీనిలో ఇప్పటికే రకుల్, సమంత, వరుణ్ తేజ్ లాంటి స్టార్లు పాల్గొని కొన్ని సీక్రెట్స్‌ను బయటపెట్టేశారు.

బ్రేకప్ విషయాలు చెప్పిన శ్రుతి..
తాజాగా శ్రుతీ హాసన్ కూడా ఈ షోలో పాల్గొంది. తన జీవితంలోని జరిగిన సంఘటనలు, చేదు అనుభవాలు, వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాలను ఇలా ఎన్నింటినో షేర్ చేసుకుంది. తన బ్రేకప్ విషయాన్ని కూడా కుండబద్దలు కొట్టేసినట్టు చెప్పింది. వాటి నుంచి ఎన్నో విషయాలను తెలుసుకున్నానని, అదో గుణపాఠం అంటూ చెప్పుకొచ్చింది.

కిల్, మ్యారీ, హుక్...
మహేష్, బన్నీ, తారక్‌లతో సినిమాలు చేసిన ఈ భామకు వారితో మంచి సంబంధాలే ఉన్నాయి. అయితే ఈ ముగ్గురికి కలిపి ఒకే ప్రశ్నలో అడిగేసి.. హీరోయిన్‌ను ఇరకాటంలో పెట్టాలని ప్రయత్నించగా.. శ్రుతి తెలివిగా తప్పించుకుంది. చివరకు మంచు లక్ష్మీ చేతే.. ఆన్సర్ చెప్పించింది. కిల్, మ్యారీ, హుక్ అంటూ ప్రశ్నించిగా.. తారక్‌ను కిల్ చేసి.. బన్నీతో హుక్ అంటూ సమాధానమిచ్చేసింది.

విస్కీ లవర్...
ఇక మరికొన్ని విషయాలను వెల్లడిస్తూ.. తానకు మద్యం సేవించే అలవాటు ఎక్కవని, విస్కీ అంటే చాలా ఇష్టమని అయితే ఆరోగ్య సమస్యలు తలెత్తడంతో మానేసానంటూ, అయితే అది మానేయడానికి చికిత్స కూడా తీసుకున్నానంటూ చెప్పింది. తాను సినిమాలు మానేయడానికి కారణం.. ప్రేమ వ్యవహారం కాదని, ఆరోగ్యం సరిగా లేనందునే చేయలేదని తెలిపింది. తెలుగులో చివరగా కాటమ రాయుడు చిత్రంలో నటించింది. ప్రస్తుతం తమిళంలో విజయ్ సేతుపతి పక్కన లాభం అనే సినిమాలో నటిస్తుంది.


Click it and Unblock the Notifications











