తండ్రి కమల్ హాసన్ విడాకులు.. అదే మంచిది.. శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్
టాలీవుడ్ స్టార్ హీరోయిన్ శృతిహాసన్ ప్రస్తుతం భారీ చిత్రాలలో నటిస్తూ ఫుల్ బిజీగా ఉంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమలో తనకంటూ మంచి క్రేజ్ సంపాదించుకుంది. స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకుంది. ప్రస్తుతం కెరియర్ పైనే దృష్టి పెట్టింది. ఈ క్రమంలో తన సమయం ఉన్నప్పుడల్లా ఇంటర్వ్యూలు ఇస్తూ ఇంట్రెస్టింగ్ విషయాలను తెలియజేస్తోంది. ఇక తాజాగా తన తండ్రి కమలహాసన్ విడాకుల విషయంపై ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. ఆ వివరాల్లోకి వెళితే..
కమల్ హాసన్ క్రేజ్ ను దాటేసి..
లోక నాయకుడు, ఇండియాస్ బిగ్గెస్ట్ స్టార్ కమల్ హాసన్ కూతురిగా శృతిహాసన్ చిత్ర పరిశ్రమలోకి అడుగు పెట్టింది. తండ్రికి ఉన్న క్రేజ్ కారణంగా ఈజీ గానే ఫిలిం ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ తన టాలెంట్ తోని చక్కటి కెరియర్ ను మలుచుకొని స్టార్ హీరోయిన్గా ఎదిగింది. ముఖ్యంగా టాలీవుడ్లో నటించిన చిత్రాలతో శృతిహాసన్ కు నటిగా మంచి గుర్తింపు దక్కింది. అనగనగా ఓ ధీరుడు, గబ్బర్ సింగ్, బలుపు రేసుగుర్రం, కాటమరాయుడు, క్రాక్, వకీల్ సాబ్, వీర సింహారెడ్డి, వాల్తేరు వీరయ్య, సలార్ వంటి చిత్రాల్లో నటించి చిత్ర పరిశ్రమలో చెరగని ముద్ర వేసుకుంది. తండ్రికి తగ్గ తనయ అనిపించింది.

తల్లిదండ్రుల విడాకులపై శృతిహాసన్ కామెంట్స్..
ఇటీవల శృతిహాసన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో తన తల్లిదండ్రుల విడాకులపై స్పందించింది. తండ్రి కమల్ హాసన్, తల్లి సారిక విడిపోవడంపై తన అభిప్రాయాన్ని వెల్లడించింది. వారు విడిపోవడం సరైన నిర్ణయమేనని చెప్పడం ఆసక్తికరంగా మారింది. తన తల్లిదండ్రులు విడిపోవడం తనకు బాధ కలిగించినప్పటికిని వారి జీవితంలో మాత్రం సరైన నిర్ణయంగా ఉంటుంది. సంతోషంగా లేని దంపతులు కలిసి జీవించడం కష్టతరం. నా జీవిత పాఠాల్లో కూడా అదే అనుభవం కలిగి ఉన్నాను. మన సామర్థ్యం, స్వతంత్రత అనేవి చాలా విషయాలను నేర్పిస్తాయని భావిస్తున్నట్టు చెప్పింది.
కమల్ హాసన్ కు ఇద్దరితో విడాకులు..
కోలీవుడ్ స్టార్ హీరో, లోక నాయకుడు కమల్ హాసన్ రెండుసార్లు పెళ్లి చేసుకొని, రెండుసార్లు విడాకులు తీసుకున్నారు. తొలుత 1978లో ఇండియన్ డాన్సర్ వాణి గణపతిని పెళ్లి చేసుకున్నారు. వీళ్ళిద్దరూ పదేళ్లపాటు కాపురం చేశారు. కానీ అభిప్రాయ భేదాలతో 1988లో డివోర్స్ తీసుకున్నారు. ఇక అదే ఏడాది 1988లో కమల్ హాసన్ నటి, కాస్ట్యూమ్ డిజైనర్ సారికను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు శృతిహాసన్, అక్షర హాసన్ ఇద్దరు పుట్టారు. కానీ కమల్ హాసన్ సారిక కూడా 2004లో విడిపోయారు.
శృతిహాసన్, కమల్ హాసన్ రాబోయే చిత్రాలు..
కమల్ హాసన్ చివరిగా విక్రమ్, కల్కి 2898 ఏడి, ఇండియన్ 2, థగ్ లైఫ్ వంటి చిత్రాలతో అలరించారు. నెక్స్ట్ ఇండియన్ 3 చిత్రంతో రాబోతున్నారు. ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు శంకర్ డైరెక్ట్ చేస్తుండడం విశేషం. ఇక శృతిహాసన్ విషయానికి వస్తే చివరిగా సలార్ చిత్రంతో భారీ బ్లాక్ బస్టర్ హిట్టును అందుకుంది. నెక్స్ట్ కూలి, జన నాయగన్, ట్రైన్, సలార్ 2 వంటి చిత్రాలతో అలరించనుంది.


Click it and Unblock the Notifications











