For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  మందు కొడతా, స్మోక్ చేస్తా.... సెక్స్ వర్కర్ ఉదాహరణతో నటి దిమ్మదిరిగే కౌంటర్!

  |

  హిందీ టెలివిజన్ రంగంలో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న నటి శ్వేతా సాల్వే ఇటీవల ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసిన ఓ పిక్ మీద నెటిజన్ల నుంచి విమర్శల వర్షం కురిసింది. ఇటీవల వెకేషన్ వెళ్లిన ఈ బ్యూటీ స్మోక్ చేస్తున్న ఫోటోలు, డ్రింక్ చేస్తున్న ఫోటోలు పోస్టు చేయడమే ఇందుకు కారణం.

  అది బ్రా కాదు, నీచంగా మాట్లాడొద్దు: సింగర్ చిన్మయి ఆవేదన

  ఆడపిల్లలకు సిగ్గుమాలిన అలవాట్లు ఏమిటి? నువ్వు ఇలా చేయడం ద్వారా నీ పిల్లలకు కూడా డ్రింకగ్, స్మోకింగ్ అలవాటయ్యేలా బాటలు వేస్తున్నావు అంటూ కొందరు మండి పడటం.... శ్వేతా సాల్వేకు ఆగ్రహం తెప్పించింది. తనపై విమర్శలు చేసే వారికి దిమ్మదిరిగే కౌంటర్ ఇవ్వడమే కాదు... సిగరెట్ తాగుతూ..., మందు కొడుతున్న కొన్ని ఫోటోలు పోస్టు చేసింది.

   నేను మందు కొడతా, స్మోక్ చేస్తా ఇది నిజం...

  నేను మందు కొడతా, స్మోక్ చేస్తా ఇది నిజం...

  అవును నేను మందు కొడతాను, స్మోక్ చేస్తాను. ఇది నిజం, ఈ విషయాన్ని నిజాయితీగా ఒప్పుకుంటున్నాను. నేను బేసిగ్గా అలాగే ఉంటాను. కానీ నా గురించి, నేను చేసే పనుల గురించి ప్రశ్నించడానికి మీరు ఎవరు? అంటూ శ్వేతా సాల్వే ప్రశ్నించారు.

  దీనికే బ్యాడ్ లేడీగా చిత్రీకరిస్తారా?

  దీనికే బ్యాడ్ లేడీగా చిత్రీకరిస్తారా?

  మందు తాగడం, సిగరెట్‌ తాగడం వల్ల చెడ్డ తల్లిని ఎలా అవుతాను? వీటి ఆధారంగా నన్ను బ్యాడ్ లేడీగా చిత్రీకరించడం ఏమిటి? అంటూ తనదైన శైలిలో శ్వేతా సాల్వే ఫైర్ అయ్యారు.

   నేను నా జీవితాన్ని వేస్ట్ చేసుకోవడం లేదు

  నేను నా జీవితాన్ని వేస్ట్ చేసుకోవడం లేదు

  ఈ అలవాట్ల కారణంగా నా జీవితాన్ని వేస్ట్ చేసుకోవడం మీరు చూశారా? నేను ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటం చూశారా? నా పిల్లలను నిర్లక్ష్యం చేయడం మీరు చూశారా? నేను పని చేస్తున్నాను. రకరకాల పనులు చేస్తున్నారు. నటిగా, డాన్సర్‌గా, వ్యాపారవేత్తగా రాణిస్తున్నాను... అని శ్వేతా సాల్వే చెప్పారు.

  సెక్స్ వర్క్ ఉదాహరణతో...

  సెక్స్ వర్క్ ఉదాహరణతో...

  ఈ అలవాట్లను చూసి నన్ను బ్యాడ్ మదర్ అంటున్నారు.... మరి సెక్స్ వర్కర్ కూడా తన ఒళ్లు అమ్ముకుని ఫ్యామిలీని పోషిస్తుంది, అలా సంపాదించిన దాంతోనే వారి పిల్లలకు చదువు చెప్పించడం, వారి జీవితం సాగేలా చేస్తుంది. అంత మాత్రాన వారు చెడ్డ వ్యక్తులు అవుతారా? ఆమె బ్యాడ్ మదర్ అవుతుందా?... అంటూ శ్వేతా సాల్వే ప్రశ్నించారు.

  నన్ను ప్రశ్నించడానికి మీరెవరు?

  నన్ను ప్రశ్నించడానికి మీరెవరు?

  నా వ్యక్తిగత జీవితం గురించి ప్రశ్నించడానికి మీరెవరు? అలా ఎప్పుడూ చేయకండి. ఇతరుల పర్సనల్ లైఫ్ మీద కామెుంట్ చేయడం మంచి పద్దతి కాదు అంటూ శ్వేతా సాల్వే తనపై విమర్శలు చేసిన వారికి హితబోధ చేసింది.

  నా తల్లిదండ్రులు కూడా...

  నా తల్లిదండ్రులు కూడా...

  నా తల్లిదండ్రులు నన్ను నా సోదరుడిని పద్ధతిగా... మంచి, చెడు తెలిసేలా పెంచారు. వాళ్లు కూడా మద్యం, ధూమపానం చేసినవారే. పిల్లలు పెరిగి పెద్దవారయిన తర్వాత వారి నిర్ణయాలు వారికి ఉంటాయి. కొన్నింటిని మనం అలో చేయాల్సి ఉంటుంది అని శ్వేతా సాల్వే చెప్పుకొచ్చారు.

  English summary
  “Yes I Drink and Smoke ... I am real, honest and basic like that. It has to be of no reason that anyone ever judge me for the person I am or the Mommy I am .. I don’t propagate it and neither do I question anyone else who does, so I would respect the same back. Today I got a few random DM’s by totally random people about my actions, and I usually let such things go pass me but for some reason today I felt like addressing it. How does this make me a bad person or a bad mom??" Shveta Salve tweeted
   

  తక్షణ సినీ వార్తలు, మూవీ రివ్యూలను రోజంతా పొందండి - Filmibeat Telugu

  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Filmibeat sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Filmibeat website. However, you can change your cookie settings at any time. Learn more