Shweta Basu Prasad: కొత్త బంగారు లోకం హీరోయిన్.. ఈసారి అరాచకమైన ఫొటో వదిలిందిగా..

టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో కొంతమంది హీరోయిన్లు ఎక్కువకాలం నిలదుక్కుకోలేకపోయినప్పటికీ కూడా వారు చేసిన ఒకటి రెండు సినిమాలు మాత్రం మర్చిపోలేని విధంగా ఉంటాయి. ఇక కొత్త బంగారులోకం సినిమాలో నటించిన శ్వేతా బసు ప్రసాద్ అందరికి గుర్తుండే ఉంటుంది. ఆ సినిమా ద్వారా తెలుగు వారికి పరిచయమైన శ్వేతా బసు ప్రసాద్ అన్ని వర్గాల ప్రేక్షకులు కూడా చాలా దగ్గరయిపోయింది. ఇక ఎన్నో చేదు అనుభవాల తర్వాత ఆమె నటిగానే ఇంకా తన ప్రయాణాన్ని కొనసాగిస్తోంది. ఇక రీసెంట్ గా పోస్ట్ చేసిన ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.. ఆ వివరాల్లోకి వెళితే..

మంచి గుర్తింపు

మంచి గుర్తింపు

శ్వేతా బసు ప్రసాద్ ఈ పేరు వినగానే అందరికీ ఒక సినిమా గుర్తుకొస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో వచ్చిన కొత్త బంగారులోకం అప్పట్లో ఎలాంటి విజయాన్ని అందుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. 2008లో ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన ఆ సినిమా ద్వారా అందరికీ మంచి గుర్తింపు లభించింది.

ఆ సినిమాలో..

ఆ సినిమాలో..

ముఖ్యంగా హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ ఒక విధంగా అందులో పక్కింటి అమ్మాయి తరహాలోనే కనిపించింది. ఆమె చిరునవ్వు అలాగే డైలాగ్స్ చెప్పే హావ భావాలు ఎమోషనల్ లవ్ సీన్స్ లో కూడా అద్భుతంగా నటించి మంచి గుర్తింపు అందుకుంది. ఇక సినిమా తర్వాత ఈ బ్యూటీకి తిరుగులేదు అని కూడా చాలామంది అనుకున్నారు.

 మొదటి విజయం తరువాత

మొదటి విజయం తరువాత

అయితే శ్వేతా బసు ప్రసాద్ బ్యాడ్ లక్ ఏమిటో గాని మొదటి సినిమాలో పెద్దగా గ్లామర్ డోస్ లేకపోవడంతో ఆ తర్వాత ఆమెకు మళ్ళీ అగ్ర హీరోల సినిమాల్లో అయితే అవకాశాలు రాలేదు. కేవలం ఒక చిన్న స్థాయి హీరోల వరకే సెట్ అవుతూ వచ్చింది. ఆ తర్వాత రైడ్ అనే ఒక సినిమా చేసింది కానీ అదేమీ అంతగా వర్కౌట్ కాలేదు. ఇక భాషతో సంబంధం లేకుండా కొన్ని హిందీ సినిమాల్లో కూడా చేసింది.

చేదు అనుభవాలు

చేదు అనుభవాలు

అయితే శ్వేతా బసు ప్రసాద్ తన పర్సనల్ లైఫ్ లో కొన్ని చేదు అనుభవాలను కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆమె 2018లో రోహిత్ అనే ఒక వ్యక్తిని ప్రేమించి పెళ్లి చేసుకుంది ఇక అతనితో ఎక్కువ కాలం ఉండలేకపోయినా బ్యూటీ 2019లోనే మళ్లీ విడాకులు తీసుకుంది. ఆ తర్వాత కూడా మరోసారి ప్రేమలో పడినట్లు కూడా వార్తలు వచ్చాయి. కానీ ఆ విషయంపై శ్వేత ఎప్పుడూ కూడా బయటకు చెప్పింది లేదు.

 తెలుగులో చివరగా..

తెలుగులో చివరగా..

ఇక అప్పుడప్పుడు శ్వేతా బసు ప్రసాద్ కొన్ని వెబ్ సిరీస్ లలో నటించే ప్రయత్నం చేస్తుంది. తెలుగులో ఆమె చివరగా విజేత అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లలో అలాగే వెబ్ సిరీస్ లలో కూడా నటించింది. ముఖ్యంగా 2018 నుంచి ఆమె హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసింది ఇటీవల హాట్ స్టార్ లో ఒక వెబ్ సిరీస్ లో కూడా కనిపించింది.

 షాక్ ఇచ్చిన శ్వేతా

షాక్ ఇచ్చిన శ్వేతా

ఇక సోషల్ మీడియాలో అప్పుడప్పుడు శ్వేతా బసు ప్రసాద్ పోస్ట్ చేస్తున్న కొన్ని ఫోటోలు కూడా వైరల్ గా మారుతున్నాయి. రీసెంట్ గా ఆమె మరోసారి ఎద అందాలతో స్టన్ అయ్యేలా చేసింది. గతంలో ఎప్పుడూ లేనివిధంగా అమ్మడు క్లివేజ్ అందాలను తనదైన శైలిలో ప్రజెంట్ చేస్తూ అందరికీ షాక్ ఇచ్చింది. ఈ ఫోటో నిమిషాల్లోనే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఇక ఆ ఫోటోని చూసిన కొంతమంది ఈమె నిజంగా కొత్త బంగారులోకం సినిమాల్లో కనిపించిన అమ్మాయినా అని కామెంట్ చేస్తున్నారు. ఎందుకంటే అంతలా ఆమె మారిపోయింది. ఇక భవిష్యత్తులో మళ్ళీ నటిగా బిజీ అవ్వాలని అడుగులు వేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X