సెట్స్ లో శ్వేతా బసుపై ఎగతాళి.. ఆ తెలుగు హీరోతో బాగా తలనొప్పి.!
తెలుగు చలన చిత్రపరిశ్రమలో యంగ్ హీరోల హవా ఎప్పుడూ కొనసాగుతూనే ఉంటుంది. వారిలో ఎవరి ప్రత్యేకత వారిది. ఒక్కొక్కరి నైపుణ్యం బట్టి వారి స్థాయి పెరుగుతూ వస్తుంది. అలా తన నటనతోనే తెలుగు ఆడియెన్స్ కు ఎంతగానో దగ్గరైంది యంగ్ బ్యూటీ శ్వేతా బసు ప్రసాద్. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన 'కొత్త బంగారులోకం' చిత్రంతో హీరోయిన్ గా ఈ అమ్మడు పరిచయమై మంచి గుర్తింపు దక్కించుకుంది. అంతకు ముందే చైల్డ్ ఆర్టిస్ట్ గా హిందీలో 'మక్దీ' అనే చిత్రం చేసింది. ఆ తర్వాత డైరెక్ట్ గా 'ఇక్బాల్', 'వా!లైఫ్ హో తో ఐసీ' చిత్రాలతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయం అయ్యింది. అవేవీ ఆమెకు అంతగా గుర్తింపు తెచ్చిపెట్టలేదు. కానీ ఆ తెలుగు సినిమాలతో మంచి సక్సెస్ ను అందుకుంది.
కొత్త బంగారు లోకం.. తర్వాత 'రైడ్', 'కాస్కో', 'కలవర్ కింగ్', ప్రియుడు' వంటి సినిమాలు చేసింది. కానీ అప్పటికే శ్వేతా బసు జీవితంలో ఊహించని షాక్ తగలడంతో కెరీర్ తలకిందులైంది.. పదేళ్లుగా టాలీవుడ్ లో అడుగేపెట్టలేదు. ప్రస్తుతం హిందీలో సినిమాలు చేస్తూ వస్తోంది. రెండేళ్లుగా సినిమాలు వదిలి టెలివిజన్ సిరీస్ ల్లో నటిస్తూ నార్త్ ఆడియెన్స్ ను అలరిస్తోంది. ఈ క్రమంలో తాజాగా ఓ సీరిస్ ప్రమోషన్స్ లో భాగంగా ఇంటర్వ్యూ ఇచ్చింది. మాట్లాడుతూ.. టాలీవుడ్ లో తనకు చేధు అనుభవం ఎదురైందని చెప్పుకొచ్చింది.

తెలుగు చిత్రపరిశ్రమలో రూపుదిద్దుకుంటున్న ఓ సినిమా సెట్ లో తను చాలా ఇబ్బంది పడినట్టు తెలిసింది. తన హైట్ గురించి సెట్స్ లో పలువురు హేళన చేయడం బాధగా అనిపించిందని గుర్తుచేసింది. నా ఎత్తు తక్కువని కొందరు హేళన చేస్తుంటే.. అరడుగుల ఎత్తుతో ఉన్న హీరోతో వచ్చే సమస్యలు తలనొప్పి తెప్పించేవని చెప్పింది. ఆయన చిటీకి మాటికి సీన్లు మార్చేస్తూ వాడేవాడని, ఎక్కువ రీటేక్ లు చేయాల్సి వచ్చిందని, అంతా గందరగోళంగా అనిపించేదని చెప్పుకొచ్చింది. ఎత్తు అనేది జెన్యూపరమైన సమస్య. దానికి ఎవరూ ఏం చేయలేరు కదా.. నేను ఎక్కువగా బాధపడిన సెట్ అది ఒక్కటి మాత్రమే'. అని చెప్పుకొచ్చింది.
ఇక ఇటీవల కూడా కొందరు హీరోయిన్లు ఇండస్ట్రీలో ఎదురవుతున్న సమస్యల గురించి చెప్పుకుంటూ వస్తున్న విషయం తెలిసిందే. నిత్యామీనన్ ఆ మధ్యలో స్టార్ హీరోను ఉద్దేశించి మాట్లాడిందని పలు పుకార్లు వచ్చాయి. టాలీవుడ్ లోనూ సినిమా తప్పా వేరే ధ్యాస ఉన్న వారి నుంచి నటీనటులు ఇబ్బందులు పడుతున్నట్టు ఆయా సందర్భాల్లో అభిప్రాయాలను వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇక ప్రస్తుతం టాలీవుడ్ లో గతంలో తనకు ఎదురైన చేధు అనుభవాన్ని శ్వేతాబసు తాజాగా గుర్తు చేసుకోవడం, అది కూడా బాలీవుడ్ మీడియాతో పంచుకోవడం కాస్తా హాట్ టాపిక్ గ్గా మారింది. ఇక తెలుగు లో మాత్రం శ్వేతా బసు సినిమాలు చేయక 11 ఏళ్లు అవుతోంది. చివరిగా 'జీనియస్' చిత్రంలో స్పెషల్ అపీయరెన్స్ తో అలరించింది. ఆ తర్వాత బాలీవుడ్ కే పరిమితమైంది.


Click it and Unblock the Notifications











