ప్రియుడితో శ్వేతా బసు వివాహం.. పెళ్లి ఫోటోలు వైరల్!

హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్ వివాహం ఘనంగా ముగిసింది. కొంత కాలంగా ప్రేమాయణం సాగిస్తున్న తన ప్రియుడు రోహిత్ మిట్టల్ ని వివాహం చేసుకుంది. సోషల్ మీడియాలో తన పెళ్లి ఫోటోలని శ్వేతా బసు సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకుంది. తెలుగు, హిందీ చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న శ్వేతా బసు ప్రస్తుతం బుల్లి తెరపై కూడా రాణిస్తోంది. చాలా రోజులుగా రోహిత్ మిట్టల్, శ్వేతా బసు రిలేషన్ షిప్ లో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. వీరిద్దరూ కలసి తిరుగుతున్న ఫోటోలు కూడా వైరల్ అయ్యాయి. కానీ శ్వేతా ఎప్పుడూ తన ప్రేమ విషయాన్ని బయట పెట్టలేదు. ఇటీవల ఏకంగా పెళ్లి వార్త ప్రకటించి ఆశ్చర్యపరిచింది.

నవ వధూవరులుగా

నవ వధూవరులుగా

సాంప్రదాయ పెళ్లి దుస్తుల్లో శ్వేతా బసు, రోహిత్ మిట్టల్ వెలిగిపోతున్నారు. ఆభరణాలు, పట్టు వస్తాలతో అందంగా తయారైన తన ఫోటోలని శ్వేతా బసు అభిమానులతో పంచుకుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నారు. బెంగాలీ సంప్రదాయంలో శ్వేతా బసు వివాహం జరిగింది. పుణేలో కుటుంబ సభ్యులు, బంధు మిత్రుల సమక్షంలో ఈ వివాహం జరగడం విశేషం.

నిరాశపరిచే చిత్రాలు

నిరాశపరిచే చిత్రాలు

శ్వేతా బసు ప్రసాద్ కొత్త బంగారు లోకం చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ చిత్రం సూపర్ హిట్ కావడంతో శ్వేతా బసుకు మంచి గుర్తింపు లభించింది. ముఖ్యంగా ఎకాడ అనే డైలాగ్ అప్పట్లో ప్రతి యువతీ యువకులు అనుకరించే వారు. శ్వేతా కెరీర్ జోరందుకుంటుంది అనుకున్న తరుణంలో కొన్ని నిరాశపరిచే చిత్రాలు ఎదురయ్యాయి. అదే సాయంలో ఊహించని విధంగా పెద్ద చిక్కులో శ్వేతా చిక్కుంది.

కేసు నుంచి బయటపడి

కేసు నుంచి బయటపడి

అనుకోని విధంగా ఓ కేసులో చిక్కుకున్న శ్వేతా బసు దానినుంచి ఎలాగో బయట పడింది. అప్పటికే శ్వేతా బసు కెరీర్ కు జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. ఆ తరువాత బాలీవుడ్ బాట పట్టిన శ్వేతాబసు ప్రసాద్ కొన్ని హిందీ చిత్రాలలో నటించింది. బుల్లి తెరపై కూడా దృష్టి పెట్టింది. ఆ సమయంలోనే ఇప్పుడిపుడే దర్శకుడిగా ఎదుగుతున్న రోహిత్ మిట్టల్ తో పరిచయం ఏర్పడడం.. అది ప్రేమగా మారడం జరిగింది.

పెళ్లి తర్వాత కూడా

పెళ్లి తర్వాత కూడా

శ్వేతా బసు ప్రసాద్ వివాహం తరువాత కూడా నటనని కొనసాగించే ఆలోచనలు ఉన్నట్లు తెలుస్తోంది. నటించేది బుల్లితెరపైనే కాబట్టి పెద్దగా కష్టం ఉండదు. ఇక రోహిత్ కూడా దర్శకుడిగా రాణిస్తున్నాడు. అలాగే సినిమాలో కూడా కీలకమైన పాత్రలు వస్తే నటించాలనే ఉద్దేశంలో శ్వేతా ఉన్నట్లు తెలుస్తోంది.

More from Filmibeat

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
X