రెడ్ లైట్ ఏరియకు వెళ్లక తప్పలేదు.. కొత్తబంగారు లోకం హీరోయిన్ ఎమోషనల్ కామెంట్స్
కొత్త బంగారు లోకం సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి సింపుల్ ఎంట్రీ ఇచ్చిన నటి శ్వేతా బసు ప్రసాద్. చిన్నతనం నుంచే నటినపై ఆసక్తి పెంచుకున్న ఈ బ్యూటీ జీవితం ఎవరు ఉహీంచని విధంగా మలుపులు తిరిగింది. మొదటి సినిమాతోనే ఈ బ్యూటీ ఇండస్ట్రీలో సినీ ప్రముఖులను ఎంతగానో ఎట్రాక్ట్ చేసింది. కెరీర్ మొదట్లో మంచి జోష్ తో కనిపించిన శ్వేతా ఆ తరువాత మెల్లమల్లగా ఫేడౌట్ అవుతూ వచ్చింది. తెలుగు ఇండస్ట్రీలో కొత్త బంగారు లోకం సినిమా తప్పితే ఆమెకు మరో సినిమా పెద్దగా క్రేజ్ అంధించలేదు.

అలాంటి పాత్రలకు సెట్టవ్వదని..
హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకోవాలని శ్వేతా బసు ప్రసాద్ అప్పట్లో తీవ్రంగా ప్రయత్నం చేసింది. ఎంత కష్టపడినా అనుకున్నంతగా గుర్తింపు రాలేదు. గ్లామర్ పాత్రలకైనా రెడీ అంటూ అప్పుడప్పుడు హాట్ ఫోటో షూట్స్ తో దర్శనమిచ్చేది. కానీ ఆమె హాట్ హీరోయిన్ పాత్రలకు సెట్టవ్వదనే కామేంట్స్ వచ్చాయి. దీంతో స్టార్ హీరోలతో నటించే అవకాశం దక్కలేదు..

అపజయాల కారణంగా..
శ్వేత బసు హీరోయిన్ గా అడుగుపెట్టిన అనంతరం మొదట్లో కొన్ని విజయాలు ఆమెలో ఆశాల్ని రేపాయి. ఇష్టం ఉన్నట్లు కొన్ని చిన్న సినిమాలు చేయడంతో అప్పుడు డబ్బులు బాగానే వచ్చాయి. కానీ ఆ తరువాత అపజయాల కారణంగా అవకాశాలు రావడం కూడా తగ్గాయి. దీంతో మెల్లగా శ్వేతా లైఫ్ లో ఆర్థిక ఇబ్బందులు కూడా మొదలయ్యాయి.

అప్పట్లో డిప్రెషన్ లోకి
శ్వేతా బసు ఆ మధ్య కొన్ని వివాదాల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. ఆ బాధ నుంచి కోలుకోవడానికి అమ్మడు 2018లో రోహిత్ మిట్టల్ అనే దర్శకుడిని లవ్ మ్యారేజ్ చేసుకుంది. ఆ తరువాత కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. అతనితో విడిపోవడం కాస్త డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. ఆ నిర్ణయం తీసుకొని తప్పు చేశానని తన సన్నిహితులతో చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.

రెడ్ లైట్ ఏరియకు
ఇక చాలా కాలం తరువాత శ్వేతా బసు కొన్ని ఎమోషనల్ కామెంట్స్ చేసింది. ఆమె ఇటీవల ముంబైలోని ఒక రెడ్ లైట్ ఏరియకు వెళ్లినట్లు చెబుతూ అక్కడి జీవితాల గురించి తెలుసుకున్న తరువాత చాలా ఎమోషనల్ అయినట్లు చెప్పింది. నెక్స్ట్ సినిమాలో శ్వేతా బసు ప్రసాద్ ఒక సెక్స్ వర్కర్ పాత్రలో కనిపించబోతోంది. 'ఇండియా లాక్ డౌన్' అనే సినిమా చేస్తున్న శ్వేతా బసు ప్రసాద్ అందులో సెక్స్ వర్కర్ మెహృనిస్సా అనే పాత్రలో నటిస్తోంది.

పాత్రకు సరైన న్యాయం చేయాలని..
లాక్ డౌన్ లో ఎంతో మంది ఇబ్బందుకు ఎదుర్కొన్నారు. అందులో రెడ్ లైట్ ఏరియాలో నివసించే కుటుంబాలు కూడా ఉన్నాయి. అయితే వారి గురించి మరింత లోతుగా తెలుసుకోవడానికి నేను దర్శకుడు అలాగే మరికొందరు మూవీ యూనిట్ సభ్యులు కామటిపురానికి వెళ్లినట్లు శ్వేతా వివరణ ఇచ్చారు. పాత్రకు సరైన న్యాయం చేయాలని అలాగే సెక్స్ వర్కర్స్ కష్టాలను రియాలిటీగా చూపించాలనే ఉద్దేశ్యంతోనే వారిని కలిసినట్లు వివరణ ఇచ్చారు. మరి శ్వేతా బసు ఈ సినిమాతో ఎంతవరకు సక్సెస్ అందుకుంటుందో చూడాలి.

నటిగా తానేంటో నీరూపించుకోవాలని..
అప్పుడప్పుడు తన జీవితం గురించి శ్వేత బసు సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్టులతో ఫాలోవర్స్ కి షాకిస్తోంది. ఇక ఇటీవల ఆమె డిప్రెషన్ లోకి వెళ్లినట్లు రూమర్స్ వచ్చాయి లాక్ డౌన్ అనంతరం శ్వేత కుటుంబ సబ్యుల సమక్షంలోనే సీక్రెట్ గా వివాహం చేసుకునే ఛాన్స్ ఉందంటూ బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. కానీ శ్వేతా మాత్రం నటిగా తానేంటో నీరూపించుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది.


Click it and Unblock the Notifications











