twitter
    For Quick Alerts
    ALLOW NOTIFICATIONS  
    For Daily Alerts

    శ్వేతాబసు ప్రసాద్ షాకింగ్ ఫొటోస్.. డిప్రెషన్ వల్లే ఇలా మారిపోయిందా?

    |

    కొత్తబంగారు లోకం సినిమా ద్వారా తెలుగు తెరకు పరిచయమైన బ్యూటీ శ్వేతాబసు ప్రసాద్. ఈ బ్యూటీ మొదటి సినిమా చూసిన తరువాత.. తప్పకుండా ఆమె స్టార్ హీరోయిన్ అవుతుందని చాలా మంది సినీ ప్రేముఖులు పాజిటివ్ గా కామెంట్ చేశారు. కానీ ఎందుకో ఈ బ్యూటీ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలవలేకపోయింది. పైగా చేసిన సినిమాలన్నీ బెడిసికొట్టాయి. ఇక రీసెంట్ గా శ్వేతాబసుకి సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆమె డిప్రెషన్ లో ఉన్నట్లు ఆ ఫొటోలు చూస్తే అర్థమవుతోందనే కామెంట్స్ వస్తున్నాయి.

    బ్యాడ్ లక్..

    బ్యాడ్ లక్..

    ఆమె అందం చూసి మొదట్లో చాలా మంది పాజిటివ్ గా కామెంట్ చేశారు. ఆమె తప్పకుండా స్టార్ హీరోయిన్ అవుతుందని అనుకున్నారు. కానీ ఎందుకో ఈ బ్యూటీ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో నిలవలేకపోయింది. పైగా చేసిన సినిమాలన్నీ బెడిసికొట్టాయి. ఆమె ఎంచుకున్న సినిమాలు కూడా కాస్త పొరపాటుగానే సెలెక్ట్ చేసుకుందని చెప్పవచ్చు. ఆ ప్లాప్స్ ఆమె కెరీర్ పై తీవ్ర ప్రభావం చూపాయి.

    ఊహించని వివాదాలు..

    ఊహించని వివాదాలు..

    శ్వేతాబసు ప్రసాద్ కెరీర్ పై కొన్ని ఘటనలు కూడా తీవ్ర ప్రభావం చూపయనే చెప్పాలి. అప్పట్లో ఊహించని వివాదాలు ఆమెను వెంటాడాయి. ఎన్నిసార్లు క్లారిటీ ఇచ్చినా రూమర్స్ ఆమెను చాలాసార్లు ఇబ్బందికి గురి చేశాయి. ఇక 2018లో రోహిత్ మిట్టల్ అనే యువకుడిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. ఆ తరువాత కొన్నాళ్లకే విడాకులు తీసుకుంది. అతనితో విడిపోవడంతో కాస్త డిప్రెషన్ లోకి వెళ్లిపోయిందట. ఆ నిర్ణయం తీసుకొని తప్పు చేశానని తన సన్నిహితులతో చెప్పుకుంటున్నట్లు తెలుస్తోంది.

    డిప్రెషన్ లో శ్వేతాబసు..

    డిప్రెషన్ లో శ్వేతాబసు..

    శ్వేతాబసు ఇటీవల తన ఇన్స్టాగ్రామ్ లో కొన్ని ఫొటోలు పోస్ట్ చేసింది. తన స్నేహితురాలు చాలా రోజుల తరువాత తీసిన ఫొటోలు చాలా ఉందంగా ఉన్నాయని క్యాప్షన్ కూడా ఇచ్చింది. కానీ అందులో శ్వేతాబసు ఫేస్ చాలా మారిపోయింది. గత కొంత కాలంగా డిప్రెషన్ లో ఉండడం వలన ఆమె మానసికంగా ఇబ్బందిపడినట్లు టాక్ వస్తోంది. ఇక ఇప్పుడు ఆమె కాస్త బక్కచిక్కినట్లు ఉండడంతో రూమర్స్ ఎక్కువగా వస్తున్నాయి.

    అవకాశాల కోసం..

    అవకాశాల కోసం..

    సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా సక్సెస్ అవ్వాలని చాలా మంది కష్టపడుతుంటారు. ఇక శ్వేతాబసు కూడా తీవ్రంగా ప్రయత్నాలు చేస్తోంది కానీ సరైన అవకాశాలు దక్కడం లేదు. ఓ వైపు ఛాన్సులు రాలేవనే బాధతో పాటు భర్త నుంచి విడాకులు తీసుకోవడం కూడా ఈ బ్యూటీని తీవ్ర మనోవేదనకు గురి చేస్తున్నాయి. దీంతో ఆమె ఫాలోవర్స్ శ్వేతబసు మళ్ళీ సినిమాల్లో బిజీ కావాలని కోరుకుంటున్నారు.

    English summary
    Shweta Basu Prasad, a beauty queen who made a simple entry into the Tollywood industry with her kotha bangaru lokam movie. Her first film has attracted a lot of celebrities in the beauty industry. Shweta, who appeared to be good Josh early on in her career, then came down slowly. She had no other success in her career except for the kotha bangaru lokam movie.
     
    న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
    Enable
    x
    Notification Settings X
    Time Settings
    Done
    Clear Notification X
    Do you want to clear all the notifications from your inbox?
    Settings X
    X